Tomato Pepper Rasam : వేడివేడి అన్నంలోకి ఎలాంటి కర్రీ చేసుకున్నప్పటికీ.. చక్కటి టమాటా మిరియాల రసం సైడ్ డిష్‌గా ఉంటే.. ఆ మీల్స్ అద్దిరిపోద్ది. అప్పుడే దించిన అన్నంలో ఈ రసం కలుపుకుని తింటే.. అమృతమే! ఇది రుచిగా ఉండటంతోపాటు, ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది. వర్షాకాలంలో జలుబు, దగ్గు వంటి సమస్యలతో ఇబ్బంది పడేవారి నోటికి పులుపు, ఘాటుతో చక్కగా ఉంటుంది. వారు దీన్ని సూప్‌లాగా కూడా తాగేయొచ్చు. ఈ సూపర్ రసాన్ని పది నిమిషాల్లోనే తయారు చేసేయొచ్చు. మరి.. ఈ రెసిపీని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం.
కావాల్సిన పదార్థాలు :
- టమాటాలు -5
- చింతపండు- కొద్దిగా
- పసుపు- అర టీస్పూన్
- రుచికి సరిపడా ఉప్పు
- శనగపప్పు-టేబుల్‌స్పూన్
- మినపప్పు- అర స్పూన్
- జీలకర్ర- టీస్పూన్
- ధనియాలు- టీస్పూన్
- మిరియాలు- అరటీస్పూన్
- ఎండు మిర్చి - 2
- మెంతులు - అర టీస్పూన్
- దాల్చినచెక్క- చిన్నముక్క
- ఎండు కొబ్బరి ముక్కలు - 2 చిన్నవి
టమాటా మిరియాల రసం తయరీ విధానం :
- ముందుగా కట్ చేసుకున్న టామాటాలను ఒక గిన్నెలో వేసుకుని అందులో చింతపండు, రుచికి సరిపడా ఉప్పు, పసుపు, కొన్ని నీళ్లను పోసుకుని మెత్తగా ఉడికించుకోవాలి.
- అలాగే మరొక పాన్‌లో శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ధనియాలు, మిరియాలు, ఎండు మిర్చి, మెంతులు, దాల్చినచెక్క, ఎండు కొబ్బరి ముక్కలు వేసి దోరగా వేయించుకోవాలి.
- ఇవి వేగిన తర్వాత చల్లార్చి.. మిక్సీ జార్లో రెండు వెల్లుల్లి రెబ్బలు వేసి మెత్తగా పౌడర్ చేసుకోవాలి.
- ఇప్పుడు బాగా ఉడికిన టమాటాలను పప్పు గుత్తి సహాయంతో రుబ్బుకోవాలి. తర్వాత ఇందులో లీటర్ నీళ్లను పోసుకుని బాగా కలుపుకోవాలి.
- తర్వాత తాలింపు కోసం పాన్‌లో ఆయిల్ పోసుకుని అందులో శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కట్ చేసుకున్న ఉల్లిపాయలు, కరివేపాకు వేసి ఫ్రై చేయండి.
- ఆనియన్స్ బ్రౌన్ కలర్లో వేగిన తర్వాత టమాటా రసాన్ని పోసుకోవాలి. అలాగే ఇందులో గ్రైండ్ చేసుకున్న రసం పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు, కారం ఉందో లేదో చూసుకోవాలి.
- సన్నని మంట మీద మూడు పొంగులు వచ్చే వరకు రసాన్ని మరిగించుకోవాలి.
- ఆ తర్వాత కప్పు కొత్తిమీర వేసుకుని దింపేసుకుంటే.. సరిపోతుంది.
- ఆరోగ్యానికి ఎంతో మేలు టేస్టీ చేసే టమాటా మిరియాల రసం రెడీ అయిపోయినట్లే..!
ఇవి కూడా చదవండి :
చిటపట చినుకుల వేళ స్పైసీ స్పైసీ "పుదీనా చారు"- ఇలా ప్రిపేర్ చేస్తే తినడమే కాదు తాగొచ్చు కూడా!
నిమిషాల్లోనే ఘుమఘుమలాడే "వాము చారు" - వర్షాకాలంలో జలుబుకు సూపర్ రెమిడీ!