Tirumala Special Darshan Tickets For July 2024 : తిరుమల కొండపై కొలువై ఉన్న కలియుుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు నిత్యం ప్రపంచ నలుమూలల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తుంటారు. అయితే.. నడిచి వెళ్లలేని వారికోసం టీటీడీ ప్రత్యేక దర్శన టికెట్లు జారీ చేస్తూ ఉంటుంది. ఈ క్రమంలో జులై నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను.. ఇవాళ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ప్రతినెలా శ్రీవారి ఆర్జిత సేవలకు సంబంధించిన టికెట్లను మూడు నెలల ముందుగానే టీటీడీ రిలీజ్ చేస్తూ ఉంటుంది. ఈ క్రమంలో జులై నెలకు సంబంధించిన షెడ్యూల్‌ను టీటీడీ ఇటీవలే ప్రకటించింది. జులై నెలకు సంబంధించిన.. సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన లాంటి ఆర్జిత సేవల ఆన్లైన్ లక్కీడిప్ కోసం.. ఏప్రిల్ 18వ తేదీ నుంచి 20వ తేదీ వరకు నమోదు చేసుకునే అవకాశం కల్పించింది. అలాగే.. ఏప్రిల్ 22న కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్ సేవ, సహస్రదీపాలంకరణ సేవాటికెట్లనూ విడుదల చేసింది టీటీడీ. అదేవిధంగా ఈ నెల 23 తేదీన(నిన్న) అంగ ప్రదక్షిణం టోకెన్ల కోటాను, శ్రీవాణి ట్రస్టు టికెట్లను వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది.
ఇవాళ తిరుమల ప్రత్యేక దర్శన టికెట్లు విడుదల : తాజాగా జులై నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను ఇవాళ(ఏప్రిల్ 24) విడుదల చేయనున్నట్లు టీటీడీ పేర్కొంది. ఈరోజు ఉదయం 10 గంటలకు జూలై నెలకు సంబంధించిన స్వామివారి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను రిలీజ్ చేయనున్నారు. అలాగే ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల, తిరుపతిలో గదుల కోటాను ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తీసుకొస్తారు. ఇక.. శ్రీవారి సేవ కోటాను 27న ఉదయం 11 గంటలకు, నవనీత సేవ మధ్యాహ్నం 12 గంటలకు, పరకామణి సేవ కోటాను మధ్యాహ్నం ఒంటి గంటకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నట్లు టీటీడీ తెలిపింది.
ముందే బుక్ చేసుకోండి :
కాలినడకన వెళ్లలేని వారు ముందుగానే టికెట్లు బుక్ చేసుకోవడం మంచిది. చిన్న పిల్లలు, వృద్ధులు ఉన్నవారికి ఈ అవకాశం ఎంతో మేలు చేస్తుంది. మీరు టికెట్లు బుకు చేసుకోవాలని అనుకుంటే.. https://tirupatibalaji.ap.gov.in వెబ్‌సైట్‌కు వెళ్లండి. ఇందులో ప్రత్యేక దర్శన టికెట్లతో పాటు మరిన్ని సేవలూ బుక్ చేసుకోవచ్చు.
IRCTC తిరుమల స్పెషల్ టూర్ ప్యాకేజీ - తక్కువ ధరలోనే 3 రోజుల ట్రిప్ - స్పెషల్ దర్శనం కూడా!