ETV Bharat / bharat

స్టీల్‌ పాత్రలు, గాజు, ప్లాస్టిక్‌ బాటిల్స్‌పై - స్టిక్కర్స్​ ఎలా తొలగించాలో మీకు తెలుసా? - Tips to Remove Stickers

author img

By ETV Bharat Telugu Team

Published : Jul 3, 2024, 10:18 AM IST

Tips to Remove Stickers From Steel And Glass : ఇంట్లో వాడుకోవడానికి కొత్త స్టీల్‌ గిన్నెలు, గాజు పాత్రలు, వాటర్ బాటిల్స్‌ కొనుగోలు చేస్తుంటాం. అయితే.. వాటిపై ఉండే స్టిక్కర్స్‌, బార్‌కోడ్స్ తొలగించడానికి జనం వివిధ ప్రయత్నాలు చేస్తుంటారు. అయినా కూడా కొన్నిసార్లు ఈ స్టిక్కర్‌లు పూర్తిగా తొలగిపోవు. అయితే, కొన్ని చిట్కాల ద్వారా ఈజీగా స్టిక్కర్‌లను తొలగించుకోవచ్చు.

Remove Stickers From Metal
How to Remove Stickers From Metal (ETV Bharat)

How to Remove Stickers From Metal : కొత్తగా కొన్న పాత్రలపై అతికించిన స్టిక్కర్లు, బార్‌కోడ్‌లను పూర్తిగా తొలగించడం కొద్దిగా కష్టమే! చాలాసార్లు ఆ స్టిక్కర్లు తీసినప్పుడు అవి పూర్తిగా తొలగిపోవు. ఒకవేళ స్టిక్కర్‌ తీసినా కూడా గిన్నెలపై గమ్‌ అంటుకుపోయి ఉంటుంది. అయితే.. కొన్ని టిప్స్‌ పాటిస్తూ స్టిక్కర్‌లను తొలగించడం ద్వారా పూర్తిగా పేపర్‌ను తీసేయవచ్చు. ఆ చిట్కాలు ఏంటో చూసేద్దామా..

యాపిల్ సైడర్ వెనిగర్ :
యాపిల్‌ సైడర్‌ వెనిగర్‌ను ఉపయోగించి పాత్రలపై అతికించిన స్టిక్కర్లు, బార్‌కోడ్‌లను సులభంగా తొలగించవచ్చు. ఒక స్ప్రే బాటిల్‌లో కొద్దిగా యాపిల్ సైడర్ వెనిగర్ పోసి దాన్ని స్టిక్కర్లపై స్ప్రే చేయండి. కొద్దిసేపటి తర్వాత చేత్తో రుద్దితే అవి సులువుగా వదిలిపోతాయి.

సోప్‌ వాటర్‌ :
గాజు, స్టీల్‌, ప్లాస్టిక్‌తో చేసిన పాత్రలపై ఉన్న స్టిక్కర్లను తొలగించడానికి సోప్‌ వాటర్‌ బాగా పనిచేస్తుంది. ముందుగా ఒక బకెట్​లో వేడి నీళ్లు పోసి.. అందులో కొన్ని చుక్కల లిక్విడ్‌ సోప్‌ వేయండి. తర్వాత ఆ బకెట్​లో స్టిక్కర్స్‌ ఉన్న బాటిల్స్‌, ప్లేట్లు వేసి నానబెట్టండి. అరగంట తర్వాత తీసేస్తే గిన్నెలపైన ఉన్న స్టిక్కర్‌లు ఈజీగా వస్తాయి. 2019లో "జర్నల్ ఆఫ్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ సేఫ్టీ" జర్నల్‌లో ప్రచురించిన అధ్యయనం ప్రకారం.. సబ్బు నీరు సాధారణ పేపర్ లేబుల్స్‌ను తొలగించడంలో చాలా ప్రభావవంతంగా ఉందని పరిశోధకులు గుర్తించారు. ఈ పరిశోధనలో అమెరికాలోని డాక్టర్‌ డేవిడ్ డబ్ల్యూ. జాన్సన్ పాల్గొన్నారు.

సూపర్ టిప్స్ : ఎండాకాలం తర్వాత కూలర్​ ఇలా భద్రపరచండి - కొన్ని ఏళ్లపాటు చక్కగా పనిచేస్తుంది!

నెయిల్ పాలిష్ రిమూవర్‌‌ :
ముందుగా కొత్త గిన్నెలు, సీసాలపై ఉన్న స్టిక్కర్‌ను వీలైనంత వరకు తొలగించండి. తర్వాత ఒక స్పాంజ్‌పై కొద్దిగా నెయిల్‌ పాలిష్‌ పోసి.. సున్నితంగా స్క్రబ్‌ చేయండి. ఈ చిట్కాను గాజు, స్టీల్‌ పాత్రలకు మాత్రమే వాడాలని నిపుణులు సూచిస్తున్నారు.

నూనె, బేకింగ్‌ సోడా :
ఒక గిన్నెలో బేకింగ్‌ సోడా, నూనె సమానంగా వేసుకుని బాగా మిక్స్ చేయండి. ఈ మిశ్రమాన్ని స్టిక్కర్‌లున్న పాత్రలపై అప్లై చేయండి. కొద్దిసేపటి తర్వాత స్క్రబ్‌ చేయండి. తర్వాత నీళ్లతో గిన్నెలను శుభ్రం చేస్తే సరిపోతుంది. ఇలా చేస్తే స్టిక్కర్‌లను ఈజీగా తొలగించుకోవచ్చు.

హెయిర్ డ్రైయర్‌ :
హెయిర్‌ డ్రైయర్‌తో సులభంగా గాజు సీసాలు, స్టీల్‌ గిన్నెలపై ఉన్న స్టిక్కర్‌లను తొలగించవచ్చు. ముందుగా హెయిర్‌ డ్రైయర్‌ను హై హీట్‌లో ఆన్‌చేసి.. స్టిక్కర్‌ ఉన్నచోట కొద్దిసేపు పట్టుకోండి. హీట్‌ కారణంగా స్టిక్కర్‌కు ఉన్న గమ్‌ కరుగుతుంది. దీంతో ఈజీగా స్టిక్కర్‌ వస్తుంది.

వైట్ వెనిగర్ :
ఒక బకెట్‌లో వేడి నీళ్లను పోసి అందులో అరకప్పు వైట్‌ వెనిగర్‌ వేయండి. ఇందులో స్టిక్కర్‌ తీయాల్సిన పాత్రలు, సీసాలను అరగంట సేపు నానబెట్టండి. తర్వాత చేతితో ఈజీగా స్టిక్కర్‌లను తొలగించండి.

పాత్రలను వేడి చేయండి :
కొత్త స్టీల్‌ గిన్నెలు, ప్లేట్లకు ఉన్న స్టిక్కర్‌లను ఈజీగా తీయడానికి, కొద్దిసేపు గ్యాస్‌ మంట చిన్నగా పెట్టి పాత్రలను వేడి చేయండి. తర్వాత నెమ్మదిగా స్టిక్కర్‌లను తొలగించుకోవచ్చు.

దోశలు క్రిస్పీగా రావడం లేదా? - ఈ టిప్స్​ పాటిస్తూ చేస్తే హోటల్​ స్టైల్​ గ్యారెంటీ!

ఎంత తోమినా గిన్నెల మీద జిడ్డు పోవడం లేదా? - ఇలా చేస్తే చాలు చిటికెలో మాయం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.