Students punished Teacher In Karnataka : విద్యార్థులు స్కూల్‌కి లేటుగా వచ్చినా, హోం వర్క్ సరిగా చేయకపోయినా బెత్తంతో కొట్టడం లాంటివి చేసే ఉపాధ్యాయులను చూశాం. కానీ కర్ణాటకలోని ఓ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో మాత్రం అందుకు భిన్నంగా జరగుతోంది. విద్యార్థులు తప్పు చేస్తే వాళ్లతోనే ఉపాధాయుడు తిరిగి కొట్టించుకుంటారు.
శివమోగ్గ జిల్లాలోని హలందూర్ గ్రామంలో ఉన్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 8 మంది విద్యార్థులు ఉన్నారు. ఎస్ గోపాల్ అనే ఉపాధ్యాయుడు గత ఐదారేళ్లుగా బోధిస్తున్నారు. అయితే విద్యార్థులు తప్పు చేస్తే వారితో కొట్టించుకుంటారు గోపాల్. విద్యార్థుల్లో మార్పు తీసుకురావలని, మంచిగా చదువుకోవాలనే ఉద్దేశంతో ఇలా చేస్తున్నట్టు గోపాల్ చెబుతున్నారు.

'హలందూరు వెనకబడిన చిన్న గ్రామం. జనాభా కూడా తక్కువే. ప్రస్తుతం మా పాఠశాలలో ఉన్న విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఇక్కడ చదివినవారే. ఏదైనా తప్పు చేసినప్పుడు విద్యార్థులను శిక్షించటం కంటే వారినే తిరిగి నున్ను కొట్టండని చెబుతాను. అప్పుడే విద్యార్థులు ఎలాంటి పొరపాట్లు చేయకుండా పాఠాలు నేర్చుకుంటారు. నాకు ఇలా చేయటం చాలా ఆనందంగా ఉంటుంది' అని గోపాల్ తెలిపారు.
'విద్యార్థుల్లో చదువుకునే ఆస్తకి పెరిగింది'
గోపాల్ విద్యార్థులతో చేయిస్తున్న ఈ ప్రయోగానికి హలందూర్ ప్రాథమిక పాఠశాల అభివృద్ధి కమిటీ కూడా అంగీకరించింది. గోపాల్ సార్ లాంటి మంచి వ్యక్తులు మా ఊరి పిల్లలకు చదువును చెబుతున్నారని కమిటీ ఛైర్మన్ ఓంకార్ అన్నారు. 'గోపాల్ విభిన్న ఆలోచనల వల్ల పిల్లల్లో చదువు పట్ల ఆసక్తి పెరిగింది. విద్యార్థులు చేసిన తప్పులకు మాస్టారుని కొట్టాలి. ఈ షరుతు వల్ల విద్యార్థులు ఎలాంటి పొరపాట్లు చేయకుండా బాగా నేర్చుకుంటున్నారు' అని ఓంకార్ తెలిపారు.
7ఏళ్లకే UPSC, బీటెక్ స్టూడెంట్స్‌కు కోచింగ్
ఆ పిల్లాడి వయసు కేవలం 7 ఏళ్లే. కానీ అప్పుడే UPSC, బీటెక్ విద్యార్థులకు పాఠాలు బోధించే స్థాయికి ఎదిగాడు. అది కూడా ఒకటి, రెండు కాదు ఏకంగా 14 సబ్జెక్టుల్లో అభ్యర్థులకు విద్యను బోధిస్తున్నాడు. ఉత్తర్‌ప్రదేశ్ మథుర జిల్లాలోని బృందావన్ ప్రాంతానికి చెందిన గురు ఉపాధ్యాయ్ వీరికి పాఠాలు చెబుతూ గూగుల్ గురుగా ప్రసిద్ధి పొందాడు. పూర్తి కథనం కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి
బామ్మ, మనవరాలికి బస్సు జర్నీ ఫ్రీ- నాలుగు చిలుకలకు మాత్రం రూ.444 టికెట్ - RTC Bus Ticket For Parrots