ETV Bharat / bharat

పార్సిల్​లో షాకింగ్ ఐటెమ్- ప్రొడక్ట్​తోపాటు 'పాము' డెలివరీ- చిప్స్ ప్యాకెట్​లో కప్ప! - Snake In Amazon Package

author img

By ETV Bharat Telugu Team

Published : Jun 19, 2024, 6:18 PM IST

Updated : Jun 19, 2024, 6:37 PM IST

Snake In Amazon Package: ఆన్​లైన్​లో షాపింగ్ చేస్తే ప్రొడక్ట్​తోపాటు పాము కూడా డెలివరీ అయ్యింది. బెంగళూరులోని ఓ జంటకు ఈ భయంకర అనుభవం ఎదురైంది. మరోవైపు, పిల్లలు ఇష్టంగా తిందామని కొనుగోలు చేసిన చిప్స్‌ ప్యాకెట్‌లో కుళ్లిన కప్పను చూసి గుజరాత్‌కు చెందిన ఓ వ్యక్తి నిర్ఘాంతపోయాడు.

Snake In Amazon Package
Snake In Amazon Package (Getty images)

Snake In Amazon Package: ప్రముఖ ఈ-కామర్స్ యాప్​ అమెజాన్​లో ఓ ప్రాడక్ట్ ఆర్డర్ చేసిన జంటకు భయంకరమైన అనుభవం ఎదురైంది. బెంగళూరుకు చెందిన ఓ జంట ఇటీవల అమెజాన్​లో Xbox కంట్రోలర్‌ను ఆర్డర్ చేసింది. తాజాగా డెలివరీ అయిన అమెజాన్ ఆర్డర్​ను విప్పడానికి ప్రయత్నించగా అందులోంచి పాము బయటకు వచ్చింది. దీంతో ఆ జంట ఒక్కసారిగా భయాందోళనకు గురైంది. అయితే ప్యాకింగ్​కు ఉన్న టేప్ పాముకు చుట్టుకోవడం వల్ల అది బయటకు రాలేకపోయింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్​గా మారింది.

అయితే డెలివరీ పట్ల అమెజాన్ నిర్లక్ష్యం వహించడం వల్లే తమ ప్రాణాలకు ముప్పు ఏర్పడే పరిస్థితి ఎదురైందని ఆ జంట ఆగ్రహం వ్యక్తం చేసింది. భద్రతా చర్యలను సరిగ్గా పాటించకపోవడం వల్లే ఇలా జరిగిందని తెలిపింది. అయితే దీనిపై అమెజాన్​కు ఫిర్యాదు చేయగా డబ్బు రిఫండ్ చేశామని చెప్పారని కానీ, ఎలాంటి క్షమాపణలు తెలుపలేదని సదరు కస్టమర్ మండిపడ్డారు.

ఇక ఈ వీడియో వైరల్ కావడం వల్ల నెటిజన్లు సైతం దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. పలువురు నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. 'క్యాష్ ఆన్ డెలివరీ (COD) పెడితే కోబ్రా ఆన్ డెలివరీ ఇచ్చారు', 'అమెజాన్​లో ఆర్డర్​ పెడితే, అమెజాన్ ఫారెస్ట్ నుంచి తీసుకొచ్చినట్లున్నారు', 'బాక్స్ విత్ పైతాన్ ప్రోగ్రామ్' అంటూ కొందరు ఫన్నీ కామెంట్స్ చేశారు. అయితే వీడియో​ వైరల్‌ అవ్వడం వల్ల అమెజాన్ స్పందించింది. ఈ ఘటనలో తమ తప్పిదానికి క్షమాపణలు కోరింది. ఆర్డర్‌ వివరాలు తెలిపితే ప్రాడక్ట్‌ను మళ్లీ డెలివరీ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు పేర్కొంది.

చిప్స్ ప్యాకెట్​లో కప్ప!
మరోవైపు, పిల్లలు ఇష్టంగా తిందామని కొనుగోలు చేసిన చిప్స్‌ ప్యాకెట్‌లో కుళ్లిన కప్పను చూసి గుజరాత్‌కు చెందిన ఓ వ్యక్తి నిర్ఘాంతపోయాడు. జామ్‌నగర్‌కు చెందిన జాస్మిన్‌ పటేల్‌ తన నాలుగేళ్ల మేనకోడలు మంగళవారం సాయంత్రం ఓ దుకాణంలో ఆలు చిప్స్‌ ప్యాకెట్‌ను కొనుగోలు చేసింది. ఇంటికి వచ్చిన తర్వాత తన 9 నెలల కుమార్తె ఆ ప్యాకెట్‌లోని కొన్ని చిప్స్‌ను తిన్నట్లు ఆ వ్యక్తి చెప్పారు. అనంతరం అందులో కప్ప కళేబరాన్ని గుర్తించిన తన మేనకోడలు ఆ ప్యాకెట్‌ను నేలపై పడవేసినట్లు తెలిపారు. తనతో జరిగిన విషయం చెప్పగా మొదట నమ్మలేదని, కానీ కప్పను చూసి తాను భయానికి గురైనట్లు పటేల్‌ వెల్లడించారు. ఈ విషయంపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు. ఈ ఘటనపై విచారణ చేపట్టిన అధికారులు కుళ్లిన స్థితిలో ఉన్న కప్ప కళేబరాన్ని పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపినట్లు తెలిపారు.

Last Updated : Jun 19, 2024, 6:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.