Sitaram Yechury Passed Away : ప్రముఖ రాజకీయవేత్త, వామపక్ష యోధుడు, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి (72) కన్నుమూశారు. ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్‌తో దిల్లీ ఎయిమ్స్‌లో కొద్ది వారాలుగా చికిత్స పొందిన ఆయన ఆరోగ్యం విషమించడం వల్ల తుదిశ్వాస విడిచారు. గురువారం మధ్యాహ్నం 3.03 గంటలకు ఆయన ప్రాణాలు విడిచారు. ఈ మేరకు ఆస్పత్రితోపాటు సీపీఎం పార్టీ వర్గాలు తెలిపాయి.
న్యుమోనియా వ్యాధితో బాధపడుతున్న సీతారాం ఏచూరి, ఆగస్టు 19న చికిత్స కోసం దిల్లీ ఎయిమ్స్ ఆస్పత్రిలో చేరారు. సెప్టెంబర్ 12న తుదిశ్వాస విడించారు. అయితే సీతారాం ఏచూరి భౌతిక కాయాన్ని ఆయన కుటుంబసభ్యలు దిల్లీ ఎయిమ్స్‌కు దానం చేశారు. బోధనతోపాటు పరిశోధన ప్రయోజనాల కోసం ఏచూరి భౌతికకాయాన్ని డొనేట్ చేసినట్లు దిల్లీ ఎయిమ్స్ ప్రకటించింది.
CPI(M) General Secretary Sitaram Yechury, aged 72, passed away at 3:05 pm today. The family has donated his body to AIIMS, New Delhi for teaching and research purposes: AIIMS pic.twitter.com/dSl7v3QZrv
— ANI (@ANI) September 12, 2024
గళం వినిపించారు : రాష్ట్రపతి ముర్ము
సీతారాం ఏచూరి మృతిపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము సంతాపం వ్యక్తం చేశారు. " ఆయన మృతిపై విచారం వ్యక్తం చేస్తున్నాను. మొదట విద్యార్థి నాయకుడిగా, ఆ తర్వాత జాతీయ రాజకీయాల్లో, పార్లమెంటేరియన్‌గా తన స్వరం వినిపించారు. నిబద్ధత ఉన్న సిద్ధాంతకర్త అయినప్పటికీ అన్ని వర్గాల్లో స్నేహితులను సంపాదించుకున్నారు. అతని కుటుంబ సభ్యులతో పాటుగా సహచరులకు నా హృదయపూర్వక సానుభూతిని తెలియజేస్తున్నాను" అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఒక పోస్ట్‌లో పేర్కొన్నారు.
Saddened to learn about the demise of CPI (M) general secretary Shri Sitaram Yechury. First as a student leader and then in national politics and as a parliamentarian, he had a distinct and influential voice. Though a committed ideologue, he won friends cutting across the party…
— President of India (@rashtrapatibhvn) September 12, 2024
ఆయన మరణ వార్త నన్ను బాధించింది : ప్రధాని మోదీ
సీపీఎం ప్రధాన కార్యదర్శి ఏచూరి మృతిపై ప్రధాని మోదీ సంతాపం వ్యక్తం చేశారు. "సీతారాం ఏచూరి మృతి నన్ను బాధించింది. వామపక్షాలలో ఆయనో గొప్ప వ్యక్తి. వామపక్షాలకు ఆయన ఓ మార్గదర్శి. సమర్థవంతమైన పార్లమెంటేరియన్‌గా ఆయన గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ క్లిష్ట సమయంలో నా ఆలోచనలన్నీ ఆయన కుటుంబసభ్యులపైనే ఉన్నాయి." అని అన్నారు.
Sitaram Yechury ji was a friend.
— Rahul Gandhi (@RahulGandhi) September 12, 2024
A protector of the Idea of India with a deep understanding of our country.
I will miss the long discussions we used to have. My sincere condolences to his family, friends, and followers in this hour of grief. pic.twitter.com/6GUuWdmHFj
భారతదేశ ఆలోచనలకు రక్షకుడు : రాహుల్ గాంధీ
అయితే సీతారాం ఏచూరి మరణం పట్ల ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలిపారు. "సీతారాం ఏచూరి నాకు ఒక స్నేహితుడు. లోతైన అవగాహనతో భారతదేశ ఆలోచనలకు రక్షకుడు. ఆయనతో జరిపిన సుదీర్ఘ చర్చలను కోల్పోయాను. ఈ దుఃఖ సమయంలో ఆయన కుటుంబ సభ్యులకు, స్నేహితులకు, అనుచరులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను" అని పోస్ట్ చేశారు.
సీపీఎంకు మూలస్తంభం!
సీపీఎంకు సీతారాం ఏచారి మూలస్తంభంగా వర్ణించారు కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్. "మా ఇద్దరి మధ్య మూడు దశాబ్దాల అనుబంధం ఉంది. ఆయనకు రాజకీయ రంగం అంతటా స్నేహితులు ఉన్నారు. ఆయన అత్యంత ఆకర్షణీయమైన వ్యక్తిత్వాన్ని ఎందరో మెచ్చుకున్నారు. మీరు చాలా తొందరగా మమ్మల్ని విడిచిపెట్టారు. కానీ ప్రజా జీవితాన్ని ఎనలేని సుసంపన్నం చేసుకున్నారు" అని రమేశ్ ట్వీట్ చేశారు.
జాతీయ రాజకీయాలకు తీరని లోటు!
సీతారాం ఏచూరి కన్నుమూయడం బాధాకరమని బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ట్వీట్ చేశారు. "ఆయన తుదిశ్వాస విడవడం జాతీయ రాజకీయాలకు తీరని లోటని నాకు తెలుసు. ఆయన కుటుంబ సభ్యులకు, మిత్రులకు, సహచరులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను" అని దీదీ పోస్ట్ పెట్టారు. సీతారాం ఏచూరి మరణం పట్ల కేరళ సీఎం పినరయి విజయన్ సంతాపం తెలిపారు. ఆయన్ను కమ్యూనిస్టు ఉద్యమంలో అసమాన నాయకుడిగా విజయన్ అభివర్ణించారు. సీతారం ఏచూరి మరణంతో దిల్లీలోని సీపీఎం కార్యాలయంలో పార్టీ జెండాను అవనతం చేశారు.
VIDEO | CPI(M) flag hoisted at half-mast at its Delhi office after the demise of its leader #SitaramYechury.
— Press Trust of India (@PTI_News) September 12, 2024
(Full video available on PTI Videos - https://t.co/n147TvqRQz) pic.twitter.com/2fsqng10eS
Sad to know that Sri Sitaram Yechury has passed away. I knew the veteran parliamentarian that he was and his demise will be a loss for the national politics.
— Mamata Banerjee (@MamataOfficial) September 12, 2024
I express my condolences to his family, friends and colleagues.
"దేశంలో మొత్తం కమ్యూనిస్ట్ వామపక్ష ఉద్యమాలకుతీరని లోటు. ఏచూరితో నాకు దశాబ్దాలుగా అనుబంధం ఉంది. వివిధ సమస్యలపై మేము కలిసి పని చేశాము. అనంతరం ఏచూరి సీపీఎం జనరల్ సెక్రటరీ అయ్యారు.''
-- రాజా, సీపీఐ లీడర్
''సీపీఎమ్‌కు ఇది తీరని నష్టం. ఈ దేశంలోని మొత్తం వామపక్ష, ప్రగతిశీల ఉద్యమాలకు ఆయన మృతి ఎదురుదెబ్బ. ఆయన అందరికీ అందుబాటులో ఉండే నాయకుడు. ''
--యానీ రాజా, సీపీఐ నాయకురాలు
"సీతారాం ఏచూరి మృతి చాలా బాధాకరం. నేను రాజ్యసభకు వచ్చినప్పుడు ఆయన ఎంపీగా ఉన్నారు. ఆయన చాలా ప్రశాంతంగా ఉండేవారు. దేశం కోసం తన జీవితాంతం అర్పించారు. మా సిద్ధాంతాలు వేరైనప్పటికీ, మేమిద్దరం స్నేహితులం. నేను ఆయన నుంచి చాలా నేర్చుకున్నాను.''
--పీయూష్ గోయల్, కేంద్ర మంత్రి