ETV Bharat / bharat

'కోటా ఆత్మహత్యలను ప్రస్తావించొద్దు'- నీట్​ కేసులో పిటిషనర్లకు సుప్రీం మందలింపు! - SC On NEET UG 2024 Exam - SC ON NEET UG 2024 EXAM

SC On NEET UG 2024 Exam : నీట్​ కోచింగ్​కు ప్రసిద్ధి చెందిన రాజస్థాన్​లోని కోటాలో జరిగిన వరుస ఆత్మహత్యలకు నీట్‌ ఫలితాలతో సంబంధం లేదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఆ వాదనను తేవొద్దని పిటిషనర్లకు సున్నితంగా మందలించింది. అసలేం జరిగిందంటే?

SC On NEET UG 2024 Exam
SC On NEET UG 2024 Exam (ANI / ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Jun 14, 2024, 3:15 PM IST

SC On NEET UG 2024 Exam : ఎంబీబీఎస్, బీడీఎస్‌ తదితర వైద్య కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించిన జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష (నీట్‌)- యూజీ 2024పై సుప్రీంకోర్టులో మరో పిటిషన్‌ దాఖలైంది. నీట్‌ పరీక్షలో పేపర్‌ లీక్‌, ఇతర అక్రమాలపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సీబీఐ) దర్యాప్తు చేపట్టాలని పిటిషనర్‌ అభ్యర్థించారు. ఈ విచారణ సందర్భంగా కోటా ఆత్మహత్యల ప్రస్తావన తీసుకువచ్చారు. దీనిపై స్పందించిన అత్యున్నత న్యాయస్థానం సున్నితంగా మందలించింది.

నీట్‌-యూజీ 2024 పరీక్షలో అక్రమాల ఆరోపణలపై సీబీఐ దర్యాప్తు కోరుతూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు వెకేషన్‌ బెంచ్‌ శుక్రవారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా పిటిషనర్‌ తరఫున వాదనలు వినిపించిన ఓ న్యాయవాది రాజస్థాన్‌లోని కోటా నగరంలో విద్యార్థుల వరుస ఆత్మహత్యల అంశాన్ని ప్రస్తావించారు. దీనికి ధర్మాసనం అభ్యంతరం వ్యక్తం చేసింది. "కోటాలో ఆత్మహత్యలకు నీట్‌ యూజీ 2024 ఫలితాలతో సంబంధం లేదు. ఇలాంటి అనవసర, భావోద్వేగ వాదనలు ఇక్కడ చేయొద్దు" అని సూచించింది.

అనంతరం ఈ పిటిషన్‌పై రెండు వారాల్లోగా తమ స్పందన తెలియజేయాలని కేంద్ర ప్రభుత్వం, నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్​టీఏ)కి సర్వోన్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. వీటితో పాటు సీబీఐ, బిహార్‌ ప్రభుత్వానికి కూడా ధర్మాసనం నోటీసులిచ్చింది. ఈ విషయంపై తదుపరి విచారణను జులై 8వ తేదీకి వాయిదా వేసింది. నీట్‌ పరీక్షకు సంబంధించి దాఖలైన ఇతర పెండింగ్‌ పిటిషన్లతో కలిపి దీన్ని విచారిస్తామని క్లారిటీ ఇచ్చింది. బిహార్‌లో ఇటీవల నీట్ ప్రశ్నాపత్నం లీకైనట్లు ఆరోపణలు వచ్చాయి.

ఈ ఏడాది నీట్‌ ఎంట్రన్స్ ఎగ్జామ్​ మే 5న దేశవ్యాప్తంగా 4,750 కేంద్రాల్లో జరిగింది. దాదాపు 24లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి 67మంది విద్యార్థులు 720కి 720 మార్కులు సాధించారు. హరియాణాలోని ఒకే పరీక్షా కేంద్రానికి చెందిన ఆరుగురు విద్యార్థులకు తొలి ర్యాంక్‌ వచ్చింది. దీంతో అనుమానాలు వచ్చాయి. ఇంత మంది టాప్‌ ర్యాంకును పంచుకోవడం వెనుక గ్రేస్‌ మార్కులు కారణమని ఇటీవల విద్యార్థులు ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలోనే 1563 మంది విద్యార్థులకు కేటాయించిన గ్రేస్‌ మార్కులను రద్దు చేస్తున్నట్లు గురువారం కేంద్రం సుప్రీంకోర్టు తెలిపింది.

'ప్రధాని మోదీ ఎందుకు మౌనం వహిస్తున్నారు?'
నీట్ పరీక్ష విషయమై ఇప్పటికే ప్రశ్నలతో ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న కాంగ్రెస్, మరోసారి విరుచుకుపడింది. ఈ వ్యవహారంపై ప్రధాని నరేంద్ర మోదీ ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించింది. సుప్రీం కోర్టు పర్యవేక్షణలో జరిగే ఫొరెన్సిక్ దర్యాప్తు మాత్రమే నిజా నిజాలు నిగ్గుతేల్చగలదని, లక్షల మంది యువ విద్యార్థుల భవిష్యత్తును కాపాడగలదని చెప్పింది. మరోవైపు ఇదే విషయంపై కోటా కలెక్టరేట్​ ముందు ఎన్​ఎస్​యూఐ సభ్యులు నిరసనకు దిగారు.

వయనాడ్​కు రాహుల్ బై, రాయబరేలీకి జై?- ఉపఎన్నికకు ప్రియాంక సై! - Priyanka Gandhi Lok Sabha

అడవుల రక్షణ కోసం జీవితం అంకితం- ఎన్నో అవార్డులు అందుకున్న ఈయన​ గురించి తెలుసా? - Kerala Man Planted Mangrove Plants

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.