Road Accident In West Bengal : బంగాల్లో లారీని అంబులెన్స్ ఢీకొన్న ఘటనలో ఆరుగురు మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. సిమెంట్ లోడుతో వెళ్తున్న లారీని ఓ అంబులెన్స్ ఢీ కొనడం వల్ల ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.
ఇదీ జరిగింది
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, కొద్ది రోజుల క్రితం కడుపు నొప్పితో ఘటల్ ఆస్పత్రిలో చేరిన ఓ రోగిని శుక్రవారం రాత్రి మేదీనిపుర్కు అంబులెన్స్‌లో తరలిస్తున్నారు. కేశపుర్ పంచమి సమీపంలోకి రాగానే అంబులెన్స్, సిమెంట్ లోడుతో వెళ్తున్న లారీని ఢీ కొట్టింది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సహా ఆరుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. వారిలో ముగ్గురు మహిళలు ఉన్నారు. సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. శవ పరీక్ష నిమిత్తం మృతదేహాలను ఆస్పత్రికి పంపించారు.
అంబులెన్స్‌లో డ్రైవర్‌తో సహా మొత్తం 8 మంది ఉన్నారని పోలీసులు తెలిపారు. రోగితో సహా మరో ఇద్దరికి తీవ్రంగా గాయపడ్డారని వారి ఆస్పత్రికి తరలించామని పేర్కొన్నారు. మృతుల్లో నలుగురిని గుర్తించినట్లు, మరో ఇద్దరు వివరాలు తెలియాల్సి ఉందని చెప్పారు. ప్రమాదానికి కారణాలు తెలియరాలేదు. డ్రైవర్ మద్యం మత్తులో ఏమైనా ఉన్నాడా అనే కోణంలో విచారణ జరుపుతున్నామని పోలీసులు తెలిపారు.
పాల ట్యాంకర్‌ను ఢీకొన్న డబుల్ డెక్కర్ బస్సు- 18 మంది స్పాట్ డెడ్
UP Road Accident News Today : ఇటీవల ఉత్తర్‌ప్రదేశ్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 18 మంది మరణించారు. మరో 30 మంది గాయపడ్డారు. పాల ట్యాంకర్‌ను వెనుక నుంచి డబుల్ డెక్కర్ బస్సు ఢీకొట్టడం వల్ల ఈ ప్రమాదం జరిగింది. జులై 10న బిహార్ నుంచి దిల్లీకి వెళ్తుండగా ఉన్నావ్ ప్రాంతంలో ఉదయం 5.15 గంటలకు లఖ్‌నవూ- ఆగ్రా ఎక్స్‌ప్రెస్‌వేపై ఈ ప్రమాదం జరిగింది. పూర్తి కథనం కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి.
అసెంబ్లీ ఉప ఎన్నికల ఫలితాల్లో 'ఇండియా' హవా- ఎన్డీఏకు తప్పని నిరాశ - Assembly Bypoll results
జమ్ముకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్‌కు మరిన్ని అధికారాలు- ఆయన గ్రీన్ సిగ్నల్ ఇస్తేగానీ!