ETV Bharat / bharat

ఫర్నీచర్‌ కొనాలనుకుంటున్నారా..? ఈ రెండింటిలో ఏది బెటరో తెలుసుకోండి!

Furniture Buying Tips: ఎంత మంచి ఫర్నీచర్‌ ఉంటే ఇంటికి అంత అందం వస్తుంది. అయితే, అందరికీ వీటిని కొనడం సాధ్యం కాదు. ఇలాంటి వారు ఫర్నీచర్‌ను అద్దెకు తీసుకోవచ్చు. అయితే చాలా మందికి ఫర్నీచర్‌ను అద్దెకు తీసుకుంటే మంచిదా ? లేదా కొనుగోలు చేస్తే మంచిదా ? అనే డౌట్​ వస్తుంది. దానికి సమాధానం ఈ స్టోరీలో తెలుసుకుందాం.

Rental Furniture And Own Furniture Which Is Better

author img

By ETV Bharat Telugu Team

Published : Jan 31, 2024, 1:06 PM IST

Rental Furniture And Buying Furniture Which Is Better : ఇంట్లో ఫర్నీచర్‌ ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కానీ, అందరికి వాటిని కొనడం సాధ్యం కాకపోవచ్చు. ఇలాంటి వారి అభిరుచికి తగ్గట్లుగా నేడు మార్కెట్లో రెంటల్‌ ఫర్నీచర్‌లు అందుబాటులో ఉన్నాయి. ఆన్‌లైన్‌లో లేదా ఆఫ్‌లైన్‌లో నచ్చిన ఫర్నీచర్‌ను రెంట్‌కు తీసుకుంటే చాలు నిర్వాహకులే ఇంటికి డోర్‌ డెలివరీ చేస్తున్నారు. నచ్చిన ఫర్నిచర్‌ను ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు తగినంత రెంట్‌ పే చేసి ఉపయోగించుకోవచ్చు. అయితే, మనలో చాలా మందికి ఫర్నీచర్‌ను రెంట్‌కు తీసుకోవడం మంచిదా ? లేదా కొనడం మంచిదా ? అనే సందేహాం కలుగుతుంది. ఈ రెండింటిలో ఏది బెస్ట్‌ ఆప్షన్‌ అవుతుందో ఇప్పుడు చూద్దాం.

ఫర్నీచర్‌ను రెంట్‌కు తీసుకోవడం వల్ల కలిగే లాభాలు..

  • ఫర్నిచర్‌ కొనడానికి డబ్బులు లేకపోతే అద్దెకు తీసుకోవడం బెస్ట్ ఆప్షన్‌ అవుతుంది.
  • తరచూ ఇళ్లు మారాల్సి వస్తే అద్దెకు ఉన్న ఫర్నీచర్‌ను ట్రాన్స్‌పోర్ట్‌ చేయాల్సిన అవసరం లేదు.
  • ఫర్నీచర్‌కు అయ్యే రిపేర్‌ ఖర్చులను రెంటల్ సంస్థలే చూసుకుంటాయి. మనకు సంబంధం ఉండదు.
  • ఒక ప్రాంతంలో కొన్ని రోజులు ఉండాలనుకునే వారు ఫర్నీచర్‌ను కొనుగోలు చేయడం కంటే అద్దెకు తీసుకోవడం మంచిది.
  • కొత్తగా మార్కెట్లోకి వచ్చే ఫర్నీఛర్‌ను రెంట్‌కు తీసుకుని ఉపయోగించుకోవచ్చు.
  • కొద్ది మొత్తంలో రెంట్‌ను చెల్లించడం వల్ల మనకు ఆర్థిక సౌలభ్యం లభిస్తుంది. లేదంటే ఒక్కసారే పెద్ద మొత్తంలో డబ్బు చెల్లిస్తే ఫైనాన్షియల్‌గా ఇబ్బందులు కలగొచ్చు.
  • కొన్ని సంస్థలు ట్రయల్ పీరియడ్‌లను అందిస్తున్నాయి. ఫర్నీచర్​ను చెక్​ చేసేందుకు కొన్ని రోజులు వాడుకోవడానికి ఈ సంస్థలు మీకు పర్మిషన్​ ఇస్తాయి.

ఫర్నీచర్‌ను కొనుగోలు చేయడం వల్ల కలిగే లాభాలు..

  • ఒక కొత్త ఫర్నీచర్‌ను కొనుగోలు చేసి మీ ఇంట్లోకి తీసుకొని వస్తే అది మీ ఆస్తిలో భాగంగా చేరిపోతుంది. దీనివల్ల తర్వాత మీ పిల్లలు కూడా వారసత్వంగా వాడుకోవచ్చు.
  • ఫర్నీచర్‌ను కొనడం వల్ల అది మన సొంతం అనే భావన కలుగుతుంది. ఇది అద్దె ఫర్నిచర్‌ వల్ల కలగదు.
  • ఒకవేళ మనకు ఫర్నీచర్‌ పాతగా అనిపించి.. కొత్తది తీసుకోవాలనుకుంటే దాన్ని అమ్మేయవచ్చు. దీనివల్ల కొంత డబ్బు తిరిగి వస్తుంది.
  • సొంత ఇళ్లు ఉన్న వారు రెంటల్‌ ఫర్నిచర్‌ తీసుకోవడం కంటే కొనుగోలు చేయడమే మంచిదని నిపుణులు చెబుతున్నారు.
  • ఒకేసారి డబ్బు ఖర్చు పెట్టి ఫర్నిచర్‌ కొనడం వల్ల.. నెల నెలా అద్దెను చెల్లించాల్సిన అవసరం ఉండదు.
  • కొంత మంది తమకు నచ్చినట్టుగా ఫర్నిచర్‌ను డిజైన్ చేయించుకోవాలని అనుకుంటారు. ఇలాంటి వారు ఫర్నీచర్‌ను కొనుగోలు చేయడం మంచిది.

చివరిగా..: మీరు ఇళ్లు అద్దెకు తీసుకుని ఉంటే ఫర్నీచర్‌ను అద్దెకు తీసుకోవడం మంచిది. దీనివల్ల మీ ఖర్చులు తగ్గుతాయి. ఒకవేల మీకు సొంత ఇళ్లు ఉండి, నచ్చిన ఫర్నీచర్‌ను డిజైన్‌ చేయించుకుని ఉపయోగించుకోవాలనుకుంటే కొత్తవి కొనుక్కోవడం మంచిది. కాబట్టి.. రెంటల్​ ఫర్నీచర్​ ఉపయోగించాలా..? కొత్తవి కొనుక్కోవాలా అనేది మీ సౌలభ్యం, అవసరాలపై ఆధారపడి ఉంటుంది.

కిచెన్​లో ఈగలు, కీటకాల సమస్య ఎక్కువగా ఉందా? - ఈ టిప్స్​తో ఒక్కటి కూడా కనిపించదు!

బాత్‌రూమ్‌ టైల్స్‌ మురికిగా మారాయా ? ఈ నేచురల్​ క్లీనర్స్​తో మెరుపు గ్యారంటీ!

టూర్​కి వెళ్లొచ్చిన తర్వాత లగేజ్​ బ్యాగ్​ పక్కన పడేస్తున్నారా? ఈ టిప్స్​తో ఈజీగా క్లీన్ చేయండి​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.