Rameswaram Cafe Blast : కర్ణాటక బెంగళూరులోని ప్రముఖ రామేశ్వరం కేఫ్‌లో జరిగిన పేలుడు తీవ్ర కలకలం రేపింది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది గాయపడినట్లు పోలీసులు తెలిపారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించినట్లు చెప్పారు. కుందనహళ్లిలోని రామేశ్వరం కేఫ్‌లో ప్రమాదం జరిగినట్లు సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక దళాలు, పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. ఈ ప్రమాదం మధ్యాహ్నం రెండు గంటలకు జరిగినట్లు చెప్పారు.
-
#WATCH | Karnataka | An explosion occurred at The Rameshwaram Cafe in Whitefield, Bengaluru. Injuries reported. Details awaited.
— ANI (@ANI) March 1, 2024
Whitefield Fire Station says, "We received a call that a cylinder blast occurred in the Rameshawaram cafe. We reached the spot and we are analysing… pic.twitter.com/uMLnMFoHIm
మరోవైపు ప్రమాదానికి గ్యాస్ సిలిండర్ కారణం కాదని తేలటం వల్ల వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. కుందనహళ్లిలోని రామేశ్వరం కేఫెలో గ్యాస్ లీక్ అయినట్లు మధ్యాహ్నం 1.08గంటలకు సమాచారం అందినట్లు అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. తమ అధికారులు, సిబ్బందితో కలిసి ఘటనాస్థలానికి వచ్చే సరికి మంటలు లేవని అగ్నిమాపక శాఖ డైరెక్టర్ తెలిపారు. కేఫెలో ఆరుగురు కస్టమర్లతో కలిసి కూర్చున్న మహిళ వెనకాల బ్యాగ్ పేలిపోయిందన్నారు. హ్యాండ్‌బ్యాగ్‌లోని అనుమానిత పదార్థం వల్లనే పేలుడు జరిగి ఉంటుందని అనుమానిస్తున్నట్లు అగ్నిమాపక శాఖ డైరెక్టర్ తెలిపారు. అయితే ఆ బ్యాగ్ ఎవరిది అనే విషయం తెలియదన్నారు. గ్యాస్ సిలిండర్ వల్ల కచ్చితంగా పేలుడు జరగలేదన్నారు. తన బృందంతో కలిసి ఘటనాస్థలాన్ని పూర్తిగా పరిశీలించినట్లు అగ్నిమాపక శాఖ డైరెక్టర్ చెప్పారు. ఎక్కడా కూడా సిలిండర్ నుంచి గ్యాస్ లీక్ అయిన ఆనవాళ్లు లేవన్నారు. టీ, కాఫీ తయారీ కోసం వాడే మరో గ్యాస్ సిలిండర్‌ను కూడా పరిశీలించినట్లు చెప్పారు. దాని నుంచి కూడా గ్యాస్ లీక్ కాలేదన్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం కేఫెలోని గ్యాస్ సిలిండర్లు ప్రమాదానికి కారణం కాదని అగ్నిమాపక శాఖ డైరెక్టర్ స్పష్టం చేశారు.
కేఫె వంటగదిలో మహిళ హ్యాండ్ బ్యాగ్ లభించటం వల్ల వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. పేలుడుకు కారణాలు తేల్చేపనిలో ఫోరెన్సిక్, బాంబ్ స్క్వాడ్ బృందాలు నిమగ్నమయ్యాయి. సీసీ టీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు. వైట్‌ఫీల్డ్‌లోని రామేశ్వరం కేఫె లోపల, పరిసరాల్లో అనుమానిత కదలికలను పరిశీలిస్తున్నారు. కేఫె ప్రాంతాన్ని పూర్తిగా దిగ్బంధించారు. కర్ణాటక డీజీపీ అలోక్ మోహన్, బెంగళూరు పోలీసు కమిషనర్ దయానందసహా ఇతర ముఖ్య అధికారులు ఘటనాస్థలానికి పరిశీలించారు. NIA, IB అధికారులకు కూడా సమాచారం ఇచ్చినట్లు డీజీపీ తెలిపారు. ఈ ప్రమాదంలో గాయపడిన 9మందిని ఆస్పత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు. గాయపడినవారిలో ఇద్దరు కేఫ్ సిబ్బంది కాగా ఏడుగురు కస్టమర్లు అని చెప్పారు
ప్లాస్టిక్ వ్యర్థాలతో సీసీరోడ్డు నిర్మాణం- కాలేజీ పరిశోధనకు పేటెంట్
ఇంట్లోనే మ్యూజియం- బ్రిటిష్ కాలంనాటి వస్తువుల సేకరణ! రిటైర్డ్ ప్రొఫెసర్ ఆసక్తి