ETV Bharat / bharat

సండే స్పెషల్​ - టేస్టీ "రాజుగారి కోడి పులావ్​" - ఇలా చేస్తే ఆహా అనాల్సిందే! - Raju Gari Kodi Pulao Making Process

Raju Gari Kodi Pulao: చికెన్​లో ఎన్ని వెరైటీలు ఉన్నా రాజుగారి కోడి పులావ్​కు ఉన్న డిమాండ్​ వేరు. కారణం ఇది ఎంతో టేస్టీగా ఉంటుంది. బిర్యానీ కన్నా కూడా దీని టేస్ట్​ సూపర్​గా ఉంటుంది. మరి అంతటి టేస్టీ పులావ్​ను ఎలా చేసుకోవాలి? దానికి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు చూద్దాం..

Raju Gari Kodi Pulao
Raju Gari Kodi Pulao Making Process (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Jun 23, 2024, 7:00 AM IST

Raju Gari Kodi Pulao Making Process: సండే వచ్చిదంటే.. నాన్​వెజ్​ ప్రియులకు పండగ అన్నట్టే. చికెన్​, మటన్​, రొయ్యలు అంటూ నచ్చినట్లుగా చేసుకుంటుంటారు. ఇక చికెన్​తో చేసే రెసిపీలకు లెక్కేలేదు. అయితే చికెన్​తో ఎన్ని వంటకాలు ఉన్నా రాజుగారి కోడి పులావ్​ లెక్కే వేరు. ఈ పులావ్​ ముందు బిర్యానీ కూడా దిగదిడుపే అనేది పలువురి మాట. కారణం అంత టేస్ట్​ ఉంటుందట. అయితే ఈ రెసిపీ అన్ని రెస్టరెంట్లలో దొరకదు. కొన్ని చోట్ల మాత్రమే దీనిని వండుతారు. మరి అలాంటి రాజుగారి కోడి పులావ్​ ఈ టిప్స్​తో ఇంట్లో చేస్తే మళ్లీ మళ్లీ చేసుకుంటారు. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఈ స్టోరీలో చూద్దాం..

కావలసిన పదార్థాలు:

  • బాస్మతి బియ్యం - రెండు కప్పులు
  • చికెన్ - అరకిలో
  • జీడిపప్పులు - 10
  • ఉల్లిపాయలు - 2(సన్నగా కట్​ చేసుకోవాలి)
  • నిమ్మరసం - అర స్పూను
  • నూనె - తగినంత
  • నెయ్యి - మూడు స్పూన్లు
  • పెరుగు - పావు కప్పు
  • యాలకులు - రెండు
  • లవంగాలు - మూడు
  • దాల్చిన చెక్క - చిన్న ముక్క
  • అనాసపువ్వు - 1
  • షాజీరా - అర స్పూను
  • బిర్యానీ ఆకులు - రెండు
  • జాపత్రి - అర స్పూన్​
  • కరివేపాకు - గుప్పెడు
  • పచ్చిమిర్చి - ఐదు
  • పచ్చిమిర్చి పేస్ట్ - ఒక స్పూన్
  • అల్లం వెల్లుల్లి పేస్టు - ఒక స్పూను
  • పుదీనా ఆకులు - అరకప్పు
  • కొత్తిమీర తరుగు - అర కప్పు
  • ఉప్పు - రుచికి సరిపడా
  • కారం - 1 స్పూన్​
  • నీరు - సరిపడినంత
  • గరం మసాలా - ఒక స్పూను

సండే స్పెషల్‌ - చికెన్ ఫ్రై విత్‌ మామిడికాయ పచ్చిపులుసు - కాంబినేషన్ అద్దిరిపోద్ది - మీరూ ఓ సారి ట్రై చేయండి! - Chicken Fry Recipe

రాజుగారి కోడి పులావ్ రెసిపీ తయారీ విధానం:

  • చికెన్ శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. బాస్మతి బియ్యాన్ని కడిగి నానబెట్టుకోవాలి.
  • ఇప్పుడు స్టవ్ ఆన్​ చేసి కుక్కర్ పెట్టి మూడు స్పూన్ల నెయ్యి, రెండు స్పూన్ల నూనె వేయాలి. అందులో జీడిపప్పులను దోరగా వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి.
  • అదే కుక్కర్లో కొన్ని ఉల్లిపాయ ముక్కలను వేసి బంగారు రంగు వచ్చేవరకు వేయించి.. ఆ తర్వాత వాటిని కూడా తీసి పక్కన పెట్టుకోవాలి.
  • ఇప్పుడు మిక్సీ గిన్నెలో వేయించిన ఉల్లిపాయలు, పెరుగు, వేయించిన జీడిపప్పులు వేసి మెత్తగా గ్రైండ్​ చేసుకోవాలి.
  • ఇప్పుడు ఒక గిన్నెలో చికెన్​ వేసుకుని అందులోకి కొద్దిగా ఉప్పు, కారం, నిమ్మరసం, అర టీస్పూన్​ గరం మసాలా, పచ్చిమిర్చి పేస్ట్​, ఉల్లి పెరుగు కలిపి చేసిన పేస్టును వేసి బాగా కలిపి ఒక పావుగంట పాటు పక్కకు పెట్టుకోవాలి.
  • ఇప్పుడు ముందుగానే స్టవ్ మీద పెట్టుకున్న కుక్కర్లో నూనె, నెయ్యి ఇంకా మిగిలే ఉంటుంది. అందులో యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, అనాసపువ్వు, షాజీరా, జాపత్రి, బిర్యాని ఆకు వేసి వేయించుకోవాలి.
  • అందులోనే మిగిలిన ఉల్లిపాయల తరుగు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించుకోవాలి.
  • ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు వేసి వేయించాలి. తర్వాత పుదీనా ఆకులు, కొత్తిమీర తరుగు వేసి బాగా వేయించుకోవాలి.
  • ఇవన్నీ వేగాక ముందుగా మ్యారినేట్ చేసిన చికెన్​ను వేసి బాగా కలుపుకుని.. చిన్నమంట మీద ఉడికించుకోవాలి.
  • కొద్దిసేపటి తర్వాత అందులో గరం మసాలా పొడి, రుచికి సరిపడా ఉప్పు కూడా వేసి బాగా కలుపుకోవాలి.
  • ఆ తర్వాత నానబెట్టిన బాస్మతీ బియ్యం వేసి.. బియ్యం ఉడకడానికి సరిపడా నీటిని పోసి బాగా కలుపుకోవాలి.
  • ఆపైన ఒక స్పూన్ నెయ్యిని వేయాలి. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ మూత పెట్టి మూడు విజిల్స్ వచ్చేవరకు ఉడికించుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్​ చేసి.. కుక్కర్ ఆవిరి పోయాక మూత తీయాలి.
  • అంతే ఎంతో టేస్టీ రాజుగారి కోడి పులావ్ రెడీ. దీన్ని చికెన్ కర్రీతో తింటే రుచి అదిరిపోతుంది.

వీకెండ్​ స్పెషల్​ - చింతచిగురు మటన్​ ! ఇలా చేస్తే సూపర్​ అనాల్సిందే! - Tamarind Leaves chicken

సండే స్పెషల్ : జింజర్ పెప్పర్ చికెన్ రెసిపీ - ఆహా ఏమి రుచి అంటారంతే! - Ginger Pepper Chicken Recipe

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.