Rajasthan Murder Case : రాజస్థాన్‌లోని ఝాలావాఢ్లో దారుణం జరిగింది. ఇద్దరు సోదరులు సహా ఐదుగురిపై లారీ ఎక్కించి హత్య చేశారు. ఓ వివాదంపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. అనంతరం నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇదీ జరిగింది
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం శనివారం అర్థరాత్రి బిన్యాగా గ్రామంలో రెండు వర్గాల మధ్య గొడవ జరిగింది. గొడవ కాస్త పెద్ద వివాదంగా మారింది. దీంతో ఈ విషయంపై ఫిర్యాదు చేసేందుకు భరత్ సింగ్, ధీరాజ్ సింగ్, తుఫాన్ సింగ్, గోవర్ధన్ సింగ్, బాలు సింగ్ పగారియా పోలీస్ స్టేషన్‌కు రెండు బైక్‌లపై వెళ్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న మరో వర్గానికి చెందిన ఇద్దరు వ్యక్తులు లారీతో వచ్చి ఆ ఐదుగురు వ్యక్తులపైకి ఎక్కించారు. దీంతో నలుగురు వ్యక్తులు అక్కడిక్కడే మృతి చెందారు. ఆస్పత్రికి తరలిస్తుండగా మరో వ్యక్తి మరణించారు. ఈ ఘటన అనంతరం నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. పరారీలో ఉన్న నిందితులపై కేసు నమోదు చేశారు. వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. అలాగే గ్రామంలో ఎలాంటి వివాదాలు జరగుకుండా పోలీసులను మోహరించినట్లు చెప్పారు. అయితే వివాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉందని వివరించారు.
హత్యకు ప్రతీకారంగా మరో హత్య
Jharkhand Double Murder Case : రాజస్థాన్‌లో పలాము జిల్లాలో భూవివాదం కారణంగా రెండు హత్యలు జరిగాయి. ఒక హత్యకు ప్రతీకారంగా వెంటనే మరో హత్య జరిగింది. చౌన్పుర్ పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన రాజేశ్ కుమార్, బౌధ అనే ఇద్దరు వ్యక్తుల మధ్య తరుచూ భూవివాదాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఆదివారం ఉదయం కోయెల్ నది దగ్గరికి వెళ్లాడు. ఇంతలో బౌధ అనే వ్యక్తి వచ్చి రాజేశ్‌పై కత్తితో దాడి చేసి చంపేశాడు. అయితే ఈ విషయం తెలుసుకున్న రాజేశ్ సన్నిహితులు కోపంతో నిందితుడిని వెంబడించారు. టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో బౌధను గొంతు నులిమి చంపేశాడు. మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకుని కేసును నమోదు చేశారు.
ఎన్నికల వేళ కల్తీ మద్యం కలకలం- 20కి చేరిన మృతుల సంఖ్య! - Punjab Hooch Tragedy
కుప్పకూలిన దేశంలోనే అతిపెద్ద వంతెన- ఒకరు మృతి- 9మందికి గాయాలు - Bridge Collapsed In Bihar