ETV Bharat / bharat

శబరిమల స్పాట్ బుకింగ్ రద్దుపై విమర్శలు- పునరుద్ధరణకు విపక్షాల డిమాండ్

అయ్యప్ప దర్శనానికి స్పాట్‌ బుకింగ్‌ లేదు - కేరళ దేవాదాయ శాఖ మంత్రి ప్రకటన - భగ్గుమన్న విపక్షాలు

author img

By ETV Bharat Telugu Team

Published : 3 hours ago

Sabarimala
Sabarimala (ANI)

Halt Spot Booking At Sabarimala : శబరిమల అయ్యప్ప దర్శనం కోసం వచ్చే భక్తులు స్పాట్‌ బుకింగ్‌ చేసుకునే సదుపాయాన్ని నిలిపివేస్తూ కేరళ సర్కార్ తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. తీర్థయాత్రల సీజన్​లో భక్తులకు అంతరాయం కలగకుండా స్పాట్ బుకింగ్​లను పునరుద్ధరించాలనే డిమాండ్​లు పెరుగుతున్నాయి. అలాగే అధికార పార్టీ సీపీఎం మిత్రపక్షాలు కూడా స్పాట్ బుకింగ్స్​పై ప్రభుత్వం తన నిర్ణయాన్ని పునః పరిశీలించాలని కోరుతున్నాయి.

'ఆర్ఎస్ఎస్​కు అవకాశం ఇవ్వద్దు'
శబరిమలలో అయ్యప్ప భక్తుల కోసం ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న ఆన్​లైన్ విధానంతో పాటు స్పాట్ బుకింగ్స్​ను తిరిగి తీసుకురావాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి బినోయ్ విశ్వం ప్రభుత్వాన్ని కోరారు. ఈ పరిస్థితిని రాజకీయ లబ్ది కోసం ఆర్ఎస్ఎస్ ఉపయోగించుకోవడానికి వీలు కల్పించొద్దని విజ్ఞప్తి చేశారు. విశ్వాసం ముసుగులో భక్తులను తప్పుదోవ పట్టించడం, ప్రభుత్వానికి వ్యతిరేకంగా వివాదాన్ని రెచ్చగొట్టడానికి చాలా మంది ప్రయత్నిస్తారని ఆయన అన్నారు. "వర్చువల్ బుకింగ్​తో పాటు భక్తులందరి సౌకర్యార్థం స్పాట్ బుకింగ్​ను కూడా ప్రభుత్వం తీసుకురావాలి. అయ్యప్ప భక్తులు దీక్షలు చేసి దర్శనం చేసుకోకుండా తిరిగి వెళ్లే పరిస్థితి వస్తే ఆర్ఎస్ఎస్ దాన్ని రాజకీయంగా వాడుకోవాలని చూస్తోంది" అని బినోయ్ విశ్వం విమర్శించారు.

'స్పాట్ బుకింగ్​లను మళ్లీ తీసుకురావాలి'
స్పాట్ బుకింగ్ రద్దును పునఃపరిశీలించారని కోరుతూ సీఎం పినరయి విజయన్, దేవాదాయ శాఖ మంత్రి వీఎన్ వాసవన్​కు ఇటీవలే కేరళ ప్రతిపక్ష నేత వీడీ సతీశన్ లేఖ రాశారు. ఆన్​లైన్ బుకింగ్​పై ప్రత్యేకంగా ఆధారపడటం వల్ల యాత్రికులు, ప్రత్యేకించి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులు, సాంకేతికత గురించి తెలియని వారు తీవ్ర ఇబ్బందులు పడతారని లేఖలో పేర్కొన్నారు.

"ఉపవాసం చేసి, చాలా దూరం ప్రయాణించి వచ్చిన భక్తులు ఆన్​లైన్ బుకింగ్ లేక దర్శనం చేసుకోకుండా వెనుదిరగడం చాలా నిరుత్సాహంగా ఉంది. ఆన్​లైన్, స్పాట్ బుకింగ్ రెండింటినీ అనుమతించే విధంగా వ్యవస్థను ఏర్పాటు చేయాలి. ప్రతి ఒక్కరికీ దర్శనం కల్పించాలి." అని వీడీ సతీశన్ లేఖలో రాసుకొచ్చారు.

మరోసారి దేవస్థానం బోర్డు సమావేశం
మకరవిళక్కు సీజన్​లో వర్చువల్ క్యూ బుకింగ్ పద్ధతి ద్వారా మాత్రమే శబరిమల అయ్యప్ప దర్శనానికి భక్తులను అనుమతించాలని కేరళ ప్రభుత్వం కొన్నాళ్ల క్రితం నిర్ణయించింది. రోజుకు గరిష్ఠంగా 80 వేల మందిని మాత్రమే దర్శనానికి అనుమతిస్తామని చెప్పింది. ఈ నిర్ణయాన్ని ట్రావెన్‌ కోర్‌ దేవస్థానం బోర్డు (టీడీబీ) సమర్థించింది. అయితే స్పాట్ బుకింగ్​పై ప్రస్తుతం వివాదం చెలరేగుతున్న నేపథ్యంలో టీడీబీ మరోసారి సోమవారం సమావేశం కానుంది. స్పాట్ బుకింగ్ రద్దుపై విపక్షాల విమర్శల నేపథ్యంలో ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

భక్తుల రద్దీ నేపథ్యంలో!
గతేడాది డిసెంబర్​లో మండల పూజల సమయంలో శబరిమలకు భక్తులు పోటెత్తారు. దీనితో భక్తుల రద్దీని నియంత్రించడంలో దేవస్థానం బోర్డు విఫలమైంది. భక్తులకు కనీస వసతులు కల్పించలేక ఇబ్బందులు పడింది. కొందరు భక్తులు అయ్యప్ప దర్శనం చేసుకోకుండానే తిరిగి స్వగృహాలకు పయనమయ్యారు. అప్పట్లో దేవస్థానం బోర్డుపై విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో భక్తుల రద్దీ దృష్ట్యా ఈ ఏడాది మండల పూజలు, మకరవిళక్కు ఉత్సవాల సమయంలో స్పాట్ బుకింగ్​ లను రద్దు చేసింది. అయితే స్పాట్ బుకింగ్​లను మళ్లీ పునరుద్ధరించాలని విపక్షాలు కోరుతున్నాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.