ETV Bharat / bharat

'కాంగ్రెస్​లో చేరి నిర్వీర్యమయ్యే బదులు NDAతో కలవండి'- పవార్​, ఠాక్రేకు మోదీ ఓపెన్ ఆఫర్! - PM Modi Offer To Sharad Pawar - PM MODI OFFER TO SHARAD PAWAR

PM Modi Offer To Sharad Pawar Uddhav Thackeray : బీజేపీ నేతృత్వంలోని ఎన్​డీఏతో కలవాలని శరద్​పవార్, ఉద్ధవ్​ ఠాక్రేకు ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. కాంగ్రెస్​లో పార్టీలను విలీనం చేసి నిర్వీర్యం అయ్యే బదులు అజిత్​ పవార్, ఏక్​నాథ్​ శిందేతో కలవాలని సూచించారు.

PM Narendra Modi
PM Narendra Modi (IANS)
author img

By ETV Bharat Telugu Team

Published : May 10, 2024, 2:09 PM IST

PM Modi Offer To Sharad Pawar Uddhav Thackeray : బీజేపీ నేతృత్వంలోని ఎన్​డీఏలో చేరాలని శరద్​ పవార్​, ఉద్ధవ్​ ఠాక్రేకు ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. కాంగ్రెస్​లో చేరి నిర్వీర్యం అయ్యే బదులు అజిత్​ పవార్​, ఏక్​నాథ్​ శిందేతో కలవాలని హితవు పలికారు. జూన్​ 4 తర్వాత చిన్న పార్టీలు మనుగడ కోసం కాంగ్రెస్​లో విలీనమవుతాయని జోస్యం చెప్పారు. నకిలీ శివసేన, నకిలీ ఎన్​సీపీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్​లో విలీనం కావాలని భావిస్తున్నట్లు మోదీ ఆరోపించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం మహారాష్ట్రలో పర్యటించిన మోదీ నందర్భర్​లో నిర్వహించిన బహిరంగ సభలో ఈ మేరకు ప్రసంగించారు.

"గత 40-50 ఏళ్లుగా రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్న ఓ పెద్ద నాయకుడు, బారామతి లోక్​సభ స్థానంలో పోలింగ్​ తర్వాత ఏమవుతుందో అని ఆందోళన చెందుతున్నారు. జూన్​ 4 తర్వాత చిన్న పార్టీలు మనుగడ కోసం కాంగ్రెస్​లో విలీనమవుతాయి. అయితే కాంగ్రెస్​లో​ విలీనం చేసి నిర్వీర్యం అయ్యే బదులు, అజిత్​ పవార్​, ఏక్​నాథ్​ శిందేతో కలవండి." అని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. అయితే రానున్న రెండేళ్లలో పలు ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్​తో మరింత సన్నిహితంగా మెలగుతాయని, లేదా తమ పార్టీకి మంచిదని భావిస్తే కాంగ్రెల్​ విలీనం చేసే అవకాశం ఉందని శరద్​ పవార్​ ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ప్రధాని మోదీ ఎన్​సీపీ(శరద్​ ), శివసేన(యూబీటీ​)పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

నన్ను సజీవంగా పాతేస్తారట : మోదీ
హిందూ ధర్మాన్ని కాంగ్రెస్​ అంతం చేయాలని అనుకుంటోందని ప్రధాని మోదీ ఆరోపించారు. రామ మందిరం, రామనవమి ఉత్సవాలు భారత్​ ఆలోచనలకు విరుద్ధమని కాంగ్రెస్ రాజకుమారుడి(రాహుల్​ను ఉద్దేశిస్తూ) గురువు అమెరికాకు చెప్పారని అన్నారు. 'మొఘల్​ చక్రవర్తి ఔరంగాజేబులా, మహారాష్ట్రలో తనను కూడా సజీవంగా పాతిపెడతామని నకిలీ శివసేనకు చెందిన వారు(సంజర్​ రౌత్​ను ఉద్దేశిస్తూ) మాట్లాడుతున్నారు. వారి ఓటు బ్యాంకుకు నచ్చేలా నన్ను వారు దుర్భాషలాడారు. మత ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించడం మన రాజ్యాంగ విలువలు, సూత్రాలకు విరుద్ధం. మోదీ బతికున్నంత కాలం దళితులు, ఆదివాసీలు, ఓబీసీల రిజర్వేషన్లు ముస్లింలకు మత ప్రాతిపదికన ఇవ్వడానికి నేను అనుమతించను.' అని ప్రధాని మోదీ అన్నారు.

'అలాంటి వారితో నేను కలవను'
ఎన్​డీఏలో చేరడంపై ప్రధాన మంత్రి మోదీ చేసిన వ్యాఖ్యలపై స్పందించారు ఎన్​సీపీ(ఎస్​పీ) అధ్యక్షుడు శరద్ పవార్​. ప్రధాని మోదీ వల్ల ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యం పట్ల నమ్మకం లేని వ్యక్తులతో తాను కలవబోనని స్పష్టం చేశారు. "దిల్లీ సీఎం కేజ్రీవాల్​, ఝార్ఖండ్​ సీఎం హేమంత్ సోరెన్​ను అరెస్ట్ చేసి జైళ్లో పెట్టారు. కేంద్ర ప్రభుత్వం పాత్ర లేకుండా ఇవి జరగవు. ప్రజాస్వామ్య వ్యవస్థపై వారికి ఎంత నమ్మకం ఉందో ఇవి చూస్తే అర్థం అవుతాయి." అని పవార్​ అన్నారు.

ప్రజ్వల్ రేవణ్ణ కేసులో ట్విస్ట్- మహిళను బెదిరించి ఫిర్యాదు చేయించారట! - Prajwal Revanna Issue

మైనర్​ తల నరికి తీసుకెళ్లిపోయిన వరుడు- మ్యారేజ్ లేట్ అవుతుందనే కోపంతో! - Young Man Murdered Girl

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.