ETV Bharat / bharat

విపక్షాలకు పాకిస్థాన్​పై ఎందుకా ప్రేమ? భారత సైన్యంపై ద్వేషమెందుకు?: మోదీ - lok sabha elections 2024

PM Modi Attacks INDIA Bloc : విపక్ష ఇండి కూటమిపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర విమర్శలు గుప్పించారు. పాకిస్థాన్ అంటే విపక్ష పార్టీలకు ఎందుకింత ప్రేమ, భారత సైన్యం అంటే ఎందుకింత ద్వేషమని విమర్శించారు. విపక్షాలకు జాతీయ ప్రయోజనాల గురించి ఆందోళన లేదని ఎద్దేవా చేశారు.

PM Narendra Modi
PM Narendra Modi (ANI)
author img

By ETV Bharat Telugu Team

Published : May 7, 2024, 12:12 PM IST

Updated : May 7, 2024, 1:30 PM IST

PM Modi Attacks INDIA Bloc : కాంగ్రెస్, ఇండి కూటమికి పొరుగు దేశం పాకిస్థాన్​పై ప్రేమ ఉందని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. ఇండియా కూటమిలోని పార్టీలకు జాతీయ ప్రయోజనాల గురించి ఆందోళన లేదని అన్నారు. దేశ వ్యతిరేక ప్రకటనలు చేయడానికి వారి మధ్య పోటీ ఉందని ఎద్దేవా చేశారు. మధ్యప్రదేశ్​లోని ఖార్గోన్​లో జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రధాని మోదీ విపక్షాలకు చురకలంటించారు.

"లోక్​సభ ఎన్నికల పోలింగ్ విడతలు పెరుగుతున్నకొద్దీ కాంగ్రెక్​కు పాకిస్థాన్​పై ప్రేమ పెరుగుతోంది. భారత సైన్యం ఉగ్రదాడులు చేస్తోందని, పాక్ సైన్యం సైలెంట్​గా ఉందని ఓ కాంగ్రెస్ సీఎం అన్నారు. ముంబయి ఉగ్రదాడుల వెనుక పాకిస్థాన్‌ హస్తం లేదని మరో కాంగ్రెస్‌ నేత ఇటీవల వ్యాఖ్యానించారు. ఈ ప్రకటనలు చేస్తున్న ఇండియా కూటమి నేతల ఉద్దేశం ఏంటని యువరాజు(రాహుల్ గాంధీని ఉద్దేశించి)ను అడగాలనుకుంటున్నాను. ఎందుకు ఇండియా కూటమికి పాకిస్థాన్​పై ఇంత ప్రేమ. భారత సైన్యంపై ఇంత ద్వేషం. కాంగ్రెస్ ఉద్దేశాలు ఎంత ప్రమాదకరమైనవో తెలుసుకోవాలంటే 20-25 ఏళ్లు ఆ పార్టీలో ఉండి ఇప్పుడు వీడిన వారి మాటలు వినాలి. ఇప్పుడు వారు స్వచ్ఛమైన గాలిని పీల్చుకుంటున్నట్లు భావిస్తున్నారు. మీ ఒక్క ఓటు భారతదేశాన్ని ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మార్చింది. మీ ఒక్క ఓటు వల్ల ఆర్టికల్ 370 రద్దు సాధ్యమైంది. మీ ఒక్క ఓటు ఆదివాసీ మహిళను భారత రాష్ట్రపతిని చేసింది. మీ ఒక్క ఓటు అవినీతిపరులను జైలుకు పంపింది. మీ ఒక్క ఓటు శక్తి ఎంతటిదంటే 500 ఏళ్ల నిరీక్షణ (రామ మందిరం ప్రాణ ప్రతిష్ఠ) ముగిసింది" అని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు.

'వారసత్వాన్ని కాపాడుకోవడానికే ఎన్నికల్లో పోటీ'
ప్రతిపక్ష కూటమి తమ వారసత్వాన్ని కాపాడుకోవడానికి ఎన్నికల్లో పోరాడుతోందని ప్రధాని మోదీ ఎద్దేవా చేశారు. ఇండియా కూటమికి ప్రజల భవిష్యత్ గురించి బెంగలేదని విమర్శించారు. ప్రజల కృషి వల్లే దేశం ముందుకు సాగుతుందన్నారు. ప్రజలు వేసే ఓటు జిహాద్ కోసం పనిచేస్తుందా లేదంటే రామరాజ్యం కోసమా అనేది ఆలోచించుకోవాలని ఓటర్లను ప్రధాని మోదీ కోరారు.

'ఆదివాసీలను బీజేపీ విస్మరించింది'
మధ్యప్రదేశ్​లోని ఆదివాసీలను బీజేపీ నేతృత్వంలోని ఎన్​డీఏ సర్కార్ విస్మరించిందని కాంగ్రెస్ ఆరోపించింది. కేంద్ర బడ్జెట్‌లో ఆదివాసీలకు కాషాయ పార్టీ మొండి చెయ్యి చూపించిందని విమర్శించింది. మధ్యప్రదేశ్​లో గిరిజనులు ఎక్కువగా ఉన్న జిల్లాల్లో రైలు కనెక్టివిటీని మెరుగుపరచడంలో బీజేపీ ఎందుకు విఫలమైంది? మోదీ కా పరివార్​లో చాలా మందికి ఆదివాసీలంటే ఎందుకు ఇష్టం ఉండదు? అని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ ప్రధాని మోదీకి ప్రశ్నలు సంధించారు.

'హింస లేకుండా రెండు విడతల ఎన్నికలు'- ఈసీపై మోదీ ప్రశంసలు- ప్రధానికి రాఖీ కట్టిన బామ్మ - lok sabha elections 2024

కుటుంబపోషణ కోసం కల్లు గీస్తున్న 'షీజా'- రాష్ట్రంలో తొలి మహిళగా రికార్డ్!- చకచకా చెట్లు ఎక్కుతూ!! - First Woman Toddy Tapper in Kerala

Last Updated : May 7, 2024, 1:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.