PM Modi IMC 2024 : ప్రపంచవ్యాప్తంగా సాంకేతిక పరిజ్ఞాన వినియోగం విషయంలో నిబంధనలను రూపొందించాల్సిన అవసరం ఉందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. అందుకోసం అంతర్జాతీయ సంస్థలు కలిసి పని చేయాలని పిలుపునిచ్చారు. నాలుగేళ్లకు ఒకసారి జరిగే వరల్డ్ టెలీకమ్యూనికేషన్ స్టాండర్డైజేషన్ అసెంబ్లీ-2024 (WTSA 2024)ను దిల్లీలోని భారత్ మండపంలో ప్రధాని మోదీ మంగళవారం ప్రారంభించారు. అలాగే దేశీయ ఆవిష్కరణలు ప్రదర్శించేందుకు నిర్వహించే ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ ఈవెంట్ 8వ ఎడిషన్‌ను కూడా ఈ కార్యక్రమంలోనే నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విమానయాన రంగానికి గ్లోబల్ కమ్యూనిటీ సమగ్రమైన ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందించినట్లే, డిజిటల్ ప్రపంచానికి కూడా నియమాలు, నిబంధనలు అవసరమని అన్నారు.
'భారతదేశంలో 120 కోట్ల మొబైల్, 95 కోట్ల ఇంటర్నెట్ వినియోగదారులు ఉన్నారు. ప్రపంచంలోనే 40 శాతానికి పైగా డిజిటల్ లావాదేవీలు భారతదేశంలో జరుగుతున్నాయి. డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను విజయవంతంగా నిర్మించడంలో భారతదేశం తన అనుభవాన్ని ఇతర దేశాలతో పంచుకోవడానికి సిద్ధంగా ఉంది. కేవలం పదేళ్లలోనే ఏర్పాటు చేసిన ఆప్టికల్ ఫైబర్- భూమి, చంద్రుని మధ్య దూరం కంటే ఎనిమిది రెట్లు ఎక్కువ. రెండు సంవత్సరాల క్రితం మొబైల్ కాంగ్రెస్‌లోనే 5జీ సేవలను ప్రారంభించాం. దేశంలోని ప్రతి జిల్లాను 5జీ సేవలతో అనుసంధానం చేశాం. ఇప్పుడు ప్రపంచంలోనే రెండో అతిపెద్ద 5జీ మార్కెట్‌గా భారతదేశం అవతరించింది. ప్రస్తుతం 6జీ టెక్నాలజీ కోసం తీవ్రంగా కృషి చేస్తున్నాం.' అని మోదీ తెలిపారు.
#WATCH | Delhi: At ITU World Telecommunication Standardization Assembly, PM Narendra Modi says, " ...today india is one of the most happening countries in the world in terms of telecom and related technology. india, where there are 120 crore mobile phone users, 95 crore internet… pic.twitter.com/jyqnFxwOvQ
— ANI (@ANI) October 15, 2024
#WATCH | Delhi: At ITU World Telecommunication Standardization Assembly (WTSA), PM Narendra Modi says, " ...in just ten years, the length of the optical fibre that india has laid is eight times the distance between the earth and the moon. i will give you an example of india's… pic.twitter.com/pro4MF9FQn
— ANI (@ANI) October 15, 2024
'మేడిన్ ఇండియా మొబైల్స్ అందించాలి'
భారతదేశం గత దశాబ్దంలో దిగుమతిదారుడి నుంచి మొబైల్ ఫోన్స్ ఎగుమతిదారుగా మారిందని ప్రధాని మోదీ అన్నారు. '2014లో దేశంలో రెండు మొబైల్ తయారీ యూనిట్లు మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు ఆ సంఖ్య 200పైకి చేరింది. ఇంతకుముందుకు విదేశాల నుంచి ఫోన్లను దిగుమతి చేస్తున్నాం. ప్రస్తుతం ఏకంగా ఆరు రెట్లు మొబైల్స్‌ను తయారు చేస్తున్నాం. చిప్‌లతో మాత్రమే ఆగిపోలేదు. ప్రపంచానికి మేడిన్ ఇండియా మొబైల్స్ అందిచడంలో నిమగ్నమై ఉన్నాం. సెమీ కండక్టర్స్ రంగంలో భారీ పెట్టుబడులు పెడుతున్నాం. ఎగుమతులు కూడా గణనీయంగా పెరిగాయి. సాంకేతికత వినియోగంపై అప్రమత్తంగా ఉండాలి. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌ను మంచి కోసమే వినియోగించాలి' అని ప్రధాని మోదీ అన్నారు.
#WATCH | Delhi: At ITU World Telecommunication Standardization Assembly (WTSA), PM Narendra Modi says, " ...in 2014, there were only two mobile manufacturing units in india and today there are more than 200. earlier we used to import most of the phones from abroad, today we are… pic.twitter.com/LmKBe3fe2x
— ANI (@ANI) October 15, 2024