ETV Bharat / bharat

ముంబయి స్ట్రీట్ స్టైల్ 'పావ్‌భాజీ' - ఇలా చేస్తే నిమిషాల్లోనే ప్రిపేర్! - పైగా టేస్ట్​ సూపర్​! - Pav Bhaji Recipe in Telugu

Mumbai Street Style Pav Bhaji Recipe : వీధుల్లో దొరికే తినుబండారాల్లో చిన్నా పెద్దా అందరికీ నచ్చేస్తుంది.. పావ్‌భాజీ. చాలా మంది దీనిని ఎంతో ఇష్టంగా తింటుంటారు. సాయంత్రం వేళ వేడి వేడిగా పావ్​భాజీని తింటుంటే.. ఆ ఫీలింగే వేరబ్బా! మరి, అలాంటి పావ్​భాజీని ఇంట్లోనే.. అదీ ముంబై స్ట్రీట్​ స్టైల్​లో ఈజీగా ఇలా ప్రిపేర్ చేసుకోండి.

Mumbai Street Style Pav Bhaji Recipe
PAV BHAJI RECIPE IN TELUGU (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Jul 10, 2024, 9:56 AM IST

How To Make Mumbai Street Style Pav Bhaji : పావ్‌భాజీ.. నోరూరించే స్ట్రీట్‌ ఫుడ్‌లో ఇదీ ఒకటి. పావ్‌ అంటే బన్ను, భాజీ అంటే కూరగాయలు. దేశంలో ఎక్కడికి వెళ్లినా కనిపిస్తుంటుంది ఈ వంటకం. ఇక ముంబయిలో అయితే పావ్‌భాజీ చాలా ఫేమస్‌. ముఖ్యంగా వర్షాకాలంలో చిన్న చిన్నగా చినుకులు పడుతుంటే.. వేడి వేడిగా పావ్​భాజీ తింటుంటే.. ఆహా.. ఎంత బాగుంటుందో! అయితే, పావ్​భాజీ తినడానికి ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే ఈజీగా.. అదీ ముంబయి స్టైల్లో పావ్​భాజీని ప్రిపేర్ చేసుకోండి. మరి ఇంకెందుకు ఆలస్యం ఈ రెసిపీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు.. తయారీ విధానం ఈ స్టోరీలో చూద్దాం..

పావ్​భాజీ తయారీకి కావాల్సినవి :

  • బన్నులు - 2
  • బటర్ - అర కప్పు
  • నూనె - 2 టేబుల్ స్పూన్లు
  • ఉల్లిపాయ ముక్కలు - ముప్పావు కప్పు
  • క్యాప్సికం తరుగు - ముప్పావు కప్పు
  • పచ్చి బఠాణీలు - ముప్పావు కప్పు
  • టమాట ముక్కలు - అర కప్పు
  • ఉడికించిన బంగాళ దుంప - 1(పెద్ద సైజ్​లో ఉండేది)
  • అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 టేబుల్ స్పూన్
  • కసూరి మేథి - 1 టీస్పూన్
  • పావ్‌భాజీ మసాలా పొడి - 2 టీస్పూన్లు
  • ఉప్పు - రుచికి సరిపడా
  • కాశ్మీరీ కారం - 1 టీస్పూన్
  • కొత్తిమీర తరుగు - 2 టేబుల్ స్పూన్లు
  • నిమ్మకాయ - 1

తయారీ విధానం :

  • ముందుగా స్టౌ మీద పాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల చొప్పున ఆయిల్, బటర్ వేసుకొని కరిగించుకోవాలి. ఇక్కడ బటర్​ ప్లేస్​లో నెయ్యి కూడా వాడుకోవచ్చు. తర్వాత అందులో కట్ చేసి పెట్టుకున్న ఉల్లి, క్యాప్సికం, పచ్చి బఠాణీలు వేసుకొని 3 నుంచి 4 నిమిషాల పాటు వేయించుకోవాలి. అంటే.. ఆనియన్స్ పచ్చి వాసన పోయేంత వరకు కుక్ చేసుకోవాలి.
  • అయితే, ఇక్కడ మీరు తాజాగా ఉండే పచ్చి బఠాణీలు యూజ్ చేస్తున్నట్లయితే వాటిని అరగంటపాటు వేడి నీటిలో నానబెట్టుకొని వేసుకోండి. అలా చేయడం ద్వారా బఠాణీలు త్వరగా ఉడుకుతాయి.
  • ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మరో నిమిషం పాటు వేయించుకోవాలి. ఆపై కట్ చేసి పెట్టుకున్న టమాట ముక్కలను వేసి మిశ్రమం పూర్తిగా ఉడికే వరకు కుక్ చేసుకోవాలి.

క్రిస్పీ పొటాటో లాలీపాప్స్​- ఇలా చేస్తే పిల్లలు ఇష్టంగా తినడం పక్కా!

  • అలా ఉడికించుకున్నాక అందులో రుచికి సరిపడా ఉప్పు, పావ్​భాజీ మసాలా, కసూరి మేథి, కాశ్మీరీ కారం వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అనంతరం ఉడికించుకున్న బంగాళదుంప(Potato) ముక్కలు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి.
  • తర్వాత పప్పు గుత్తి(మేషర్) తీసుకొని ఆ మిశ్రమాన్ని బాగా మెత్తగా మాష్ చేసుకోవాలి. ఎంత బాగా మాష్ చేసుకుంటే భాజీ అంత క్రీమీగా వస్తుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.
  • ఆ విధంగా మాష్ చేసుకున్నాక అందులో పావు లీటర్ వాటర్ యాడ్ చేసుకొని భాజీ క్రీమీగా వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. అయితే, భాజీ మరీ ముద్దగా మారితే మాత్రం మరికొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి.
  • తర్వాత కొత్తిమీర తరుగు, కాస్త బటర్ వేసి మధ్య మధ్యలో కలియతిప్పుతూ, మెదుపుతూ భాజీ దగ్గర పడే దాకా ఉడికించుకొని ఆపై దింపేసుకోవాలి.
  • ఇప్పుడు స్టౌపై పాన్ పెట్టుకొని బటర్, పావు చెంచా పావ్​భాజీ మసాలా వేసి బన్నులను సగానికి కట్ చేసి రెండు వైపులా వేయించుకోవాలి.
  • అప్పుడు భాజీతో పాటు.. పావ్​లను ప్లేట్​లోకి తీసుకొని నిమ్మ చెక్క, ఉల్లిపాయ ముక్కలతో వేడి వేడిగా వడ్డించుకుని తినండి. అంతే.. ఘుమఘుమలాడే ముంబై స్ట్రీట్ స్టైల్ పావ్‌భాజీ రెడీ!

సాయంత్రం వేళ - కరకరలాడే "చైనీస్ భేల్ పూరి" - నిమిషాల్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు! పైగా టేస్ట్​ సూపర్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.