ETV Bharat / bharat

ఉద్యోగులకు దీపావళి గిఫ్ట్స్​గా మారుతి, టాటా కార్లు- ఫ్యూయల్ ఛార్జ్​ కూడా!

దీపావళికి ఉద్యోగులకు అదిరిపోయే గిఫ్ట్- టాటా పంచ్, మారుతి గ్రాండ్ విటారా కార్లను ఇచ్చిన కంపెనీ

author img

By ETV Bharat Telugu Team

Published : 2 hours ago

Panchkula Pharma Company Diwali Bonus
Panchkula Pharma Company Diwali Bonus (ETV Bharat)

Panchkula Pharma Company Diwali Bonus : సంస్థ కోసం పాటు పడుతున్న ఉద్యోగుల కోసం పండగలు, ప్రత్యేక సందర్భాల్లో కానుకలు ఇస్తుంటాయి కంపెనీలు. అలాగే వార్షిక బోనస్, పండగ బోనస్ అంటూ ఇస్తారు. అయితే, తమ కంపెనీని విజయవంతంగా నడిపించడంలో ఉద్యోగులు చేస్తున్న కృషికి గుర్తింపుగా హరియాణాకు చెందిన ఓ ఫార్మా కంపెనీ ఓ అడుగు ముందుకేసి ఆశ్చర్యపోయే నిర్ణయం తీసుకుంది. దీపావళి కానుకగా తమ ఉద్యోగులకు లగ్జరీ కార్లను పంపిణీ చేసింది.

టాటా పంచ్, మారుతి గ్రాండ్ విటారా గిఫ్ట్స్
పంచకులలో ఉన్న ఓ ఫార్మా కంపెనీ యజమాని ఎన్​కే భాటియా తమ ఉద్యోగులకు దీపావళి కానుకగా టాటా పంచ్, మారుతి గ్రాండ్ విటారా కార్లను బహుమతిగా ఇచ్చారు. 'స్టార్‌ పెర్‌ఫార్మర్‌ ఆఫ్‌ ది ఇయర్‌'గా నిలిచిన 15 మంది కంపెనీ ఉద్యోగులకు ఈ గిఫ్ట్ ను అందించారు. గతేడాది కూడా కంపెనీలో అత్యుత్తమ పనితీరు కనబర్చిన ఉద్యోగులకు ఇలానే బహుమతులను అందించారు.

వారికే పెద్దపీట!
"కంపెనీలో 'స్టార్‌ పెర్‌ఫార్మర్‌ ఆఫ్‌ ది ఇయర్‌'గా నిలిచిన 15 మంది ఉద్యోగులకు అక్టోబర్ 14న కార్లను బహుమతిగా ఇచ్చాం. టాటా పంచ్, మారుతి గ్రాండ్ విటారా వాహనాలను ఉద్యోగులకు అందించాం. కంపెనీలో మంచి పనితీరు కనబరిచే ఉద్యోగులకు పెద్దపీట వేస్తాం. ఇలా ఉద్యోగులకు గిఫ్ట్ ఇచ్చి ప్రోత్సహిస్తున్నాం. దీంతో వారిలో కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. భవిష్యత్తులో మరింత బాగా పనిచేస్తారు. వారిని చూసి ఇతర ఉద్యోగులు కూడా బాగా పనిచేయాలని స్ఫూర్తి పొందుతారు" అని ఎన్​కే భాటియా తెలిపారు.

తమ కంపెనీలో ఎక్కువ మంది యువకులేనని యజమాని ఎన్​కే భాటియా తెలిపారు. అయితే కంపెనీ పేరు మీద కార్లు కొనుగోలు చేస్తామని చెప్పారు. అన్ని కార్లను ఫైనాన్స్​పై కొనుగోలు చేశామని, అయితే వాటి ఈఎంఐలను కంపెనీ చెల్లిస్తుందని పేర్కొన్నారు. "2023 నుంచి ఉద్యోగులకు దీపావళి కానుకగా గిఫ్ట్స్ ఇస్తున్నాం. గతేడాది దీపావళికి 12 మంది ఉద్యోగులకు కార్లను ఇచ్చాం. గతేడాది వాహనాలు పొందిన ఉద్యోగులు భవిష్యత్​లో మరింత మెరుగైన పనితీరు కనబరిచినట్లయితే వారి వాహనాలను అప్​గ్రేడ్ చేసే యోచనలో ఉన్నాం." అని భాటియా అన్నారు.

ఆఫీస్ పనిమీదైతే ఇంధనం ఖర్చు కంపెనీదే
అయితే, ఉద్యోగులకు ఇచ్చిన వాహనాలు కంపెనీ వద్దే ఉంటాయి. అయితే వాటిని ఉద్యోగులు ఉపయోగించుకోవచ్చు. కంపెనీ అవసరం కోసం వాటిని వాడితే ఇంధనం ఖర్చును సంస్థ భరిస్తుంది. వ్యక్తిగతంగా కారును వాడితే, ఉద్యోగే ఇంధన ఖర్చును పెట్టుకోవాలి.

ఉద్యోగులు హర్షం
గతేడాది దీపావళికి తనకు కారు బహుమతిగా లభించిందని ఫార్మా కంపెనీలో హెచ్ ఆర్​గా పనిచేస్తున్న ఆకృతి రైనా చెప్పారు. అయితే అప్పడు తనకు కారు నడపడం రాదని, ఆ తర్వాత నేర్చుకున్నానని తెలిపారు. తనకు టాటా పంచ్ కారును గిఫ్ట్ గా ఇచ్చారని ఆనందం వ్యక్తం చేశారు మరో ఉద్యోగి వీనస్.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.