Find the Difference in Pooja Hegde Images: "ఒక లైలా కోసం" సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన పూజా హెగ్డే.. బుట్టబొమ్మగా తార స్థాయికి చేరుకుంది. టాలీవుడ్లో టాప్ స్టార్స్‌తో నటించి ఓ వెలుగు వెలిగింది. అయితే.. కొంత కాలంగా ఈ అమ్మడిని పరాజయాలే పలకరిస్తున్నాయి. రాధేశ్యామ్, బీస్ట్, ఆచార్య, బాలీవుడ్లో 'కిసీ కా భాయ్ కిసీ కి జాన్'.. ఇలా వరుస చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. ఆ తర్వాత మహేష్ బాబు 'గుంటూరు కారం'లో ఆఫర్ వచ్చినప్పటికీ.. అనివార్య కారణాలతో తప్పుకుంది. దీంతో.. ఇప్పుడు ఈ బ్యూటీ చేతిలో ఏ సినిమా కూడా లేకుండా పోయింది.
అయితే.. తాజాగా ఓ ప్రాజెక్ట్ గురించిన వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 'ఒక లైలా కోసం' సినిమాతో సూపర్ పెయిర్ అనిపించుకున్న నాగచైతన్య - పూజా హెగ్డే మరోసారి ప్రేక్షకులను అలరించనుందని దాని సారాంశం. దాంతోపాటు నందినీరెడ్డి - సిద్దూ జొన్నలగడ్డ కాంబోలో రానున్న సినిమాలోనూ పూజా హెగ్డే మెరవనుందని టాక్. వీటిపై ఇంతవరకు అఫీషియల్‌గా అనౌన్స్మెంట్ రాలేదు.
చేతిలో సినిమాలు లేకపోయినప్పటికీ.. సోషల్ మీడియా వేదికా ఫ్యాన్స్‌ను అలరిస్తూనే ఉంది పూజా. భారీగా ఫాలోవర్లున్న పూజా.. ఏ పోస్ట్ చేసినా తెగ వైరల్ అవుతుంటాయి. ఇటీవల పోస్ట్ చేసిన ఓ పిక్‌ను మీ కోసం తీసుకొచ్చాం. ఇందులో మొత్తం 6 తేడాలు ఉన్నాయి. మీరు 8 సెకన్లలో వీటిని ఫైండ్ చేస్తే మీ బ్రెయిన్ షార్ప్ అని ఒప్పుకోవాల్సిందే.
బ్రెయిన్ షార్ప్ గురించే కాకుండా.. కాస్త రిలాక్స్ అవ్వడానికి, ప్రాబ్లమ్స్ నుంచి మైండ్ డైవర్ట్ చేసుకోవడానికి కూడా ఇలాంటి ఆప్టికల్ ఇల్యూజన్, ఫైండ్ ద డిఫరెన్స్ టాస్క్‌లు చక్కగా పనిచేస్తాయి. మైండ్‌కు చక్కటి విశ్రాంతిని ఇస్తాయి. టెన్షన్స్, ప్రాబ్లమ్స్ అనేవి రోజూ ఉండేవే. కాబట్టి.. వాటిని కాసేపు లైట్ తీస్కొని.. ఓ సారి బుట్టబొమ్మను చూసి.. తేడాలు కనిపెట్టండి.
ఇచ్చిన టైమ్‌లో కనిపెట్టిన వారి దృష్టి షార్ప్‌గా ఉందని అర్థం. ఒకవేళ మీకు ఎంత వెతికినా ఈ రెండు ఫొటోల మధ్య ఉన్న అన్ని తేడాలు కనిపించకపోతే.. ఆన్సర్ల కోసం కింది ఫొటోను చూడండి. కనిపెట్టిన వారు కూడా.. మీరు గమనించిన తేడాలు సరైనవో కాదో చెక్ చేసుకోండి. తేడాలు కనిపెట్టలేకపోయిన వారు ఫీల్ అవ్వాల్సిన పని లేదు. ఇలాంటి పజిల్స్‌ను రోజూ ప్రాక్టీస్ చేస్తే మీరు కూడా ఛాంపియన్ అవుతారు. సో ఈసారికి ఆల్ ది బెస్ట్.
ఈ బొమ్మలో 6 తేడాలున్నాయి - 10 సెకన్లలో కనిపిడితే మీరు ఖతర్నాక్ ! - Optical Illusion Test In Telugu