Noodles Samosa: నూడుల్స్ అనగానే ఎవరికైనా టేస్ట్ చేయాలనిపిస్తుంది. ఇక పిల్లలైతే వాటిని ఎంతో ఇష్టంగా తింటారు. వెజ్ నూడుల్స్, ఎగ్‌నూడుల్స్, చికెన్ నూడుల్స్.. ఇలా రకరకాలుగా చేసుకుంటారు. చేసుకోవడం రాని వారైతే బయట ఫాస్ట్‌ఫుడ్ సెంటర్స్ నుంచి తెప్పించుకుని తింటారు. అయితే నూడుల్స్ అంటే కేవలం ఇవి మాత్రమే కావు.. ఎన్నో రకాలు ఉన్నాయి. వాటితో సమోసాలు చేసుకోవచ్చు. సూప్ తయారుచేసుకుని లాగించొచ్చు. రొయ్యలతో కలిపి రుచి చూడొచ్చు. మరి, మీరు కూడా ఇలాంటి వంటలను ట్రై చేయాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడే ఈజీగా ఇలా తయారుచేసుకోండి..
నూడుల్స్ సమోసా:
కావలసిన పదార్థాలు:
- నూడుల్స్- ఒక బౌల్(ఉడికించినవి)
- నూనె - సరిపడా
- వెల్లుల్లి రెబ్బలు - రెండు
- ఉల్లిపాయ - ఒకటి
- క్యాప్సికం - ఒకటి
- క్యారెట్ - ఒకటి
- క్యాబేజీ తురుము - ఒక కప్పు
- ఉప్పు - రుచికి తగినంత
- సోయా సాస్ - రెండు టీ స్పూన్లు
- వెనిగర్ - ఒక టేబుల్‌స్పూన్
- మైదా - రెండు కప్పులు
- గోధుమపిండి - ఒక కప్పు
- వాము - ఒక టీస్పూన్
- నీళ్లు - కొద్దిగా..
పనీర్‌తో ఈ స్నాక్స్ ట్రై చేయండి- పిల్లలు నుంచి పెద్దల వరకు ఆహా అనడం ఖాయం!
తయారీ విధానం:
- ముందుగా ఉల్లిపాయలు, వెల్లుల్లి, క్యారెట్, క్యాప్సికం, క్యాబేజీని సన్నగా తురుముకోవాలి.
- ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి కొద్దిగా నూనె వేసి వేడి అయ్యాక వెల్లుల్లి రెబ్బలు, తరిగిన ఉల్లిపాయలు వేసి వేగించుకోవాలి.
- ఆ తరువాత క్యారెట్, క్యాప్సికం ముక్కలు, క్యాబేజీ తురుము వేసి మరికాసేపు వేయించుకోవాలి.
- ఇప్పుడు తగినంత ఉప్పు వేసి, సోయాసాస్, వెనిగర్, ఉడికించిన నూడుల్స్ వేసి కలుపుకుని.. కాసేపు ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి.
- ఇప్పుడు ఒక గిన్నెలో మైదా, గోధుమపిండి వేసి, తగినంత ఉప్పు, వాము, నూనె వేసి తగినన్ని నీళ్లు పోసుకుంటూ చపాతీ ముద్దలా కలుపుకోవాలి. ఈ పిండిని అరగంటపాటు పక్కన పెట్టాలి.
- అరగంట తర్వాత పిండిని కొద్ది కొద్దిగా తీసుకుంటూ చపాతీల్లా చేసుకోవాలి. తర్వాత సమోసా షేప్‌లో చేసుకుని.. మధ్యలో నూడుల్స్ మిశ్రమం పెట్టి చివర్లు నూనె లేదా నీటితో అద్దుతూ మూసేయాలి.
- ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టి నూనె పోసి వేడి అయ్యాక సమోసాలు వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే ఎంతో టేస్టీగా ఉండే.. నూడుల్స్ సమోసా రెడీ!
ప్రాన్స్ నూడుల్స్
కావాల్సిన పదార్థాలు:
- వెల్లుల్లి- 4 టీస్పూన్
- పచ్చిమిరపకాయలు- 2
- రెడ్ చిల్లీ ఫ్లేక్స్- 2 టీస్పూన్లు,
- నూనె- 3 టీస్పూన్లు,
- శుభ్రం చేసిన రొయ్యలు- 12,
- నూడుల్స్- కప్పు (ఉడకబెట్టినవి),
- ఉప్పు- రుచికి తగినంత
- సోయాసాస్- టీ స్పూన్,
- రెడ్ చిల్లీ సాస్- ఒకటిన్నర టీస్పూన్,
- బ్లాక్‌పెప్పర్ పౌడర్- 1 టీస్పూన్,
- వెనిగర్- టీస్పూన్,
- తరిగిన కొత్తిమీర- 1 స్పూన్,
తయారీ విధానం:
- ముందుగా ఒక కప్పులో రొయ్యలు తీసుకుని అందులోకి రెండు టీ స్పూన్ల సన్నగా తరిగిన వెల్లుల్లితో పాటు రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసి ఆ తర్వాత ఉప్పు వేసి బాగా కలియబెట్టాలి.
- ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి నూనె వేయాలి. అది కాస్త వేడయ్యాక రొయ్యలు వేసుకోవాలి. వాటిని బాగా వేయించిన తర్వాత ఒక ప్లేట్‌లో వేసుకుని పక్కనబెట్టుకోవాలి.
- ఆ తర్వాత మరో ప్యాన్‌లో నూనె వేసి పచ్చి మిరపకాయలు వేసి వేయించాలి. తర్వాత వెల్లుల్లి, కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. వెల్లుల్లి గోల్డ్ కలర్ వచ్చాక నూడుల్స్ వేయాలి.
- తర్వాత సోయాసాస్, రెడ్ చిల్లీసాస్ కొద్దిగా వేయాలి. పెప్పర్ పౌడర్ వేసి మిక్స్ చేస్తుండాలి.
- ఇప్పుడు అందులో ముందుగానే ఫ్రై చేసుకున్న రొయ్యలు కలపాలి. ఆ తర్వాత వెనిగర్ వేసి.. ప్లేట్లోకి తీసుకుని తింటే స్పైసీ.. ప్రాన్స్ నూడుల్స్ రెడీ.
స్నాక్స్‌లో ఆయిల్ ఫుడ్ వద్దు - ఇవి తింటే అదుర్స్ - రుచికి రుచీ ఆరోగ్యానికి ఆరోగ్యం!
క్రిస్పీ పొటాటో లాలీపాప్స్- ఇలా చేస్తే పిల్లలు ఇష్టంగా తినడం పక్కా!