ETV Bharat / bharat

ఐఐటీ మద్రాస్ దేశంలోనే బెస్ట్​- వరుసగా ఆరోసారి- టాప్​ కాలేజీల లిస్ట్​ ఇదే! - NIRF Ranking 2024

author img

By ETV Bharat Telugu Team

Published : Aug 12, 2024, 5:05 PM IST

Updated : Aug 12, 2024, 5:21 PM IST

NIRF Ranking 2024 : దేశంలో అత్యుత్తమ విద్యాసంస్థల జాబితాను సోమవారం కేంద్ర విద్యాశాఖ విడుదల చేసింది. ఉన్నత విద్యాసంస్థల జాబితాలో ఐఐటీ మద్రాస్ వరుసగా ఆరో ఏడాది మొదటి స్థానంలో నిలిచింది. ఉత్తమ యూనివర్సిటీగా ఐఐఎస్​సీ బెంగళూరు నిలిచింది. వివిధ రంగాల్లోని విద్యాసంస్థల ర్యాంకులను విద్యాశాఖ వెల్లడించింది. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

NIRF Ranking 2024
NIRF Ranking 2024 (ETV Bharat)

NIRF Ranking 2024 : దేశంలో అత్యుత్తమ ఉన్నత విద్యాసంస్థల జాబితాలో ఐఐటీ మద్రాస్ వరుసగా ఆరోసారి అగ్రస్థానంలో నిలిచింది. ఉత్తమ విశ్వవిద్యాలయాల విభాగంలో ఇండియన్ ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ సైన్స్(IISc) బెంగళూరు మొదటి స్థానాన్ని సంపాదించింది. మొత్తం ఉన్నత విద్యాసంస్థల్లో ఐఐఎస్​సీ బెంగళూరు రెండో స్థానంలో ఉండగా, ఐఐటీ బాంబే, ఐఐటీ దిల్లీ వరుసగా మూడు, నాలుగో స్థానాల్లో నిలిచాయి. టాప్-10 ఉన్నత విద్యాసంస్థల జాబితాలో మొత్తం 8 ఐఐటీలు, దిల్లీ ఎయిమ్స్, జవహర్​లాల్ నెహ్రూ యూనివర్సిటీ చోటు దక్కించుకున్నాయి. ఈ మేరకు నేషనల్ ఇన్​స్టిట్యూషనల్ ర్యాకింగ్ ఫ్రేమ్‌ వర్క్‌(NIRF) కింద కేంద్ర విద్యాశాఖ సోమవారం ఈ జాబితాను విడుదల చేసింది.

మేనేజ్​మెంట్ విభాగంలో ఐఐఎం అహ్మదాబాద్ టాప్
అత్యుత్తమ ఇంజినీరింగ్​ విద్యాసంస్థల్లో ఐఐటీ మద్రాస్​ వరుసగా తొమ్మిదో సారి అగ్రస్థానం సంపాదించింది. ఐఐటీ దిల్లీ, ఐఐటీ బాంబే వరుసగా రెండు, మూడో స్థానాల్లో నిలిచాయి. ఎన్​ఐటీ తిరుచురాపల్లి మాత్రమే అత్యుత్తమ ఇంజినీరింగ్ విద్యాసంస్థల టాప్-10 జాబితాలో చోటు దక్కించుకుంది. మేనేజ్​మెంట్ విభాగంలో ఐఐఎం అహ్మదాబాద్ మొదటి స్థానంలో నిలిచింది. ఐఐఎం బెంగళూరు, ఐఐఎం కోజీకోడ్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఐఐటీ బాంబే, ఐఐటీ దిల్లీ టాప్-10 జాబితాలో స్థానం సంపాదించుకున్నాయి.

  • ఫార్మసీలో జామియా హమ్‌ దర్ద్‌ ఉత్తమ విశ్వవిద్యాలయంగా నిలిచింది. గతేడాది ఈ యూనివర్సిటీ రెండో స్థానంలో ఉండేది. 2023లో తొలిస్థానంలో ఉన్న హైదరాబాద్​లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాసూటికల్‌ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్‌ ఈ ఏడాది రెండో స్థానానికి పడిపోగా, బిట్స్ పిలానీ మూడో స్థానంలో నిలిచింది.
  • ఉత్తమ కళాశాలగా దిల్లీ యూనివర్శిటీలోని హిందూ కళాశాల ఎంపికైంది. మిలాండా హౌస్, సెయింట్ స్టీఫెన్స్ కళాశాల వరుసగా రెండు, మూడో స్థానాల్లో నిలిచాయి.
  • వైద్య విద్యలో దిల్లీలోని ఎయిమ్స్‌ మొదటి స్థానంలో నిలిచింది. చండీగఢ్​లోని పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ఇన్​స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌ (పీజీఐఎంఈఆర్‌), వేలూరులోని క్రిస్టియన్‌ మెడికల్‌ కాలేజీ తర్వాతి స్థానాల్లో నిలిచాయి.
  • ఆర్కిటెక్చర్​లో ఐఐటీ రూర్కీ అగ్రస్థానాన్ని సంపాదించింది. ఐఐటీ ఖరగ్​పుర్, ఎన్ఐటీ కాలికట్ తర్వాతి స్థానాల్లో నిలిచాయి.
  • ఉత్తమ రాష్ట్ర విశ్వవిద్యాలయంగా చెన్నైలోని అన్నా యూనివర్సిటీ నిలిచింది. కోల్​కతాలోని జాదవ్​పుర్ యూనివర్సిటీ రెండో స్థానాన్ని సంపాదించింది.
  • న్యాయ విద్యలో బెంగళూరులోని నేషనల్‌ లా స్కూల్‌ ఆఫ్‌ ఇండియా యూనివర్సిటీ, దిల్లీలోని నేషనల్‌ లా యూనివర్సిటీ, హైదరాబాద్​లోని నల్సార్‌ యూనివర్సిటీ ఆఫ్‌ లా తొలి మూడు స్థానాల్లో నిలిచాయి.
  • పరిశోధన విభాగంలో ఐఐఎస్​సీ బెంగళూరు మొదటి స్థానంలో నిలిచింది. ఐఐటీ మద్రాస్, ఐఐటీ దిల్లీ వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి.

దేశంలోనే టాప్ విద్యాసంస్థగా ఐఐటీ మద్రాస్​.. హెచ్​సీయూ ర్యాంక్ ఎంతంటే...

రవాణా రంగంలో 'హైస్పీడ్​' రివల్యూషన్! అసియాలోనే అతిపెద్ద 'హైపర్​లూప్​' ట్యూబ్​ను​ నిర్మించిన మద్రాస్ ఐఐటీ - Hyperloop Train

Last Updated : Aug 12, 2024, 5:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.