Monsoon Prediction 2024 IMD : దేశంలో ఈఏడాది సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదు అవుతుందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. దీర్ఘకాల సగటు LPAతో పోలిస్తే వచ్చే రుతుపవనాల సీజన్‌లో 106 శాతం వర్షపాతం నమోదు కావచ్చని తెలిపింది. వచ్చే సీజన్‌లో LPA 87 సెంటీమీటర్లగా అంచనా వేసింది. లానినా పరిస్థితులు వర్షాలకు అనుకూలంగా ఉండడం వల్ల ఆగస్టు- సెప్టెంబరు నాటికి ఎక్కువ వర్షపాతం నమోదు కావచ్చని వెల్లడించింది.
'భారత్లో 9 సార్లు సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం!'
వాయవ్య, తూర్పు, ఈశాన్య రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాలు మినహా దేశంలోని చాలా ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. 1951 నుంచి 2023 వరకు ఎల్ నినో తర్వాత లానినా వచ్చిన సందర్భాల్లో భారత్లో 9 సార్లు సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదైందని ఐఎండీ తెలిపింది.
-
#WATCH | Delhi: M Ravichandran, Secretary, Ministry of Earth Sciences says, "According to the rainfall data from 1971 till 2020, we have introduced new long-period average and normal...According to this normal, from June 1 to 30 September, the average of the total rainfall of the… pic.twitter.com/4q7c5VxkKB
— ANI (@ANI) April 15, 2024
మంచి వర్షాలు కురుస్తాయ్!
జూన్ నాటికి ఎల్‌నినో బలహీనపడనుందని భారత వాతావరణ శాఖ చీఫ్ మృత్యుంజయ్ మహపాత్ర వెల్లడించారు. మే నెల నాటికి ఎల్‌నినో మరింత బలహీనపడి, జూన్ నాటికి పూర్తిగా తగ్గి తటస్థ పరిస్థితులు ఏర్పడతాయని పేర్కొన్నారు. జులై నెలాఖరు నాటికి లానినా పరిస్థితులు ఏర్పడనున్నందున మంచి వర్షాలు కురుస్తాయని ఆయన తెలిపారు. ఇండియన్ ఓషన్ డైపోల్ పరిస్థితులు, ఉత్తరార్ధగోళంలో తగ్గిన మంచు విస్తృతి వల్ల ఈసారి నైరుతి రుతుపవనాలకు అనుకూలంగా ఉన్నాయని వెల్లడించారు.
స్కైమెట్ అంచనాలు ఇలా!
ఇటీవల, జూన్ నుంచి సెప్టెంబర్ వరకు ఈసారి దేశంలో సాధారణ వర్షపాతం నమోదు అవుతుందని ప్రైవేటు వాతావరణ సంస్థ స్కైమెట్ ఇటీవల అంచనా వేసింది. నాలుగు నెలల సుదీర్ఘ కాలానికి దీర్ఘ కాల సగటు 868.6 మిల్లీమీటర్లలో 102 శాతం వర్షపాతం నమోదు అవుతుందని చెప్పింది. మధ్య, పశ్చిమ ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఉత్తర, దక్షిణ ప్రాంతాల్లో సాధారణ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఈశాన్య భారతం, తూర్పు ప్రాంతాల్లో సాధారణం కంటే తక్కువ వర్షాలు పడతాయని అంచనా వేసింది. ఈ పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
గుడ్ న్యూస్- ఈసారి నైరుతి రుతుపవనాలకు అన్నీ గ్రీన్ సిగ్నల్స్! - monsoon forecast 2024 india