ETV Bharat / bharat

'EVMలపై సుప్రీం తీర్పు విపక్షాలకు గట్టి చెంపదెబ్బ'- 'ఇప్పటి వరకు 40 సార్లు ఇలా!' - SC EVMs Verdict - SC EVMS VERDICT

Modi On SC EVMs Verdict Today : ఈవీఎం- వీవీప్యాట్ క్రాస్ వెరిఫికేషన్​పై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును ప్రధాని మోదీ స్వాగతించారు. ఈ తీర్పు ఇండియా కూటమి పార్టీలకు పెద్ద ఎదురుదెబ్బని అన్నారు. మైనార్టీలకు రిజర్వేషన్లపై సైతం మరోసారి కాంగ్రెస్ పార్టీపై మోదీ విమర్శలు గుప్పించారు.

Modi On SC EVMs Verdict Today
Modi On SC EVMs Verdict Today
author img

By ETV Bharat Telugu Team

Published : Apr 26, 2024, 3:39 PM IST

Modi On SC EVMs Verdict Today : ఈవీఎంలలో నమోదైన ఓట్లతో 100 శాతం వీవీప్యాట్ల స్లిప్పులను సరిపోల్చి లెక్కించాలంటూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ప్రధాని నరేంద్ర మోదీ స్వాగతించారు. ఓట్ల క్రాస్ వెరిఫికేషన్​పై సుప్రీంకోర్టు తీర్పును కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమికి గట్టి ఎదురుదెబ్బగా అభివర్ణించారు. ఈవీఎంలపై అపనమ్మకం సృష్టించినందుకు ప్రతిపక్షాలు ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. శుక్రవారం బిహార్​లోని ఆరారియాలో ఎన్నికల ర్యాలీలో ప్రధాని మోదీ విపక్షాలపై మండిపడ్డారు.

తమ అభిమాన ఓటు బ్యాంకు కోసం (మైనార్టీలను ఉద్దేశించి) ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ ఇచ్చిన రిజర్వేషన్లను దోచుకోవడానికి ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయని ప్రధాని మోదీ ఆరోపించారు. 'కాంగ్రెస్, ఆర్జేడీ, ఇండియా కూటమి పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు బూత్ క్యాప్చర్ ద్వారా పేదలు, వెనుకబడిన, దళితుల ఓట్లను తొలగించేవారు. ఈవీఎంలను ప్రవేశపెట్టడం వల్ల ఎవరూ ఓట్లను కోల్పోలేదు. అందుకే ఈవీఎంలపై ఇండియా కూటమి పార్టీలు అవిశ్వాసం వ్యక్తం చేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న కర్ణాటకలో ఓబీసీల రిజర్వేషన్లను ముస్లింలకు బదిలీ చేసింది. తన మిత్రపక్షం ఇలా చేస్తే బిహార్ కు చెందిన ఆర్జేడీ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఇప్పుడు బిహార్ సహా దేశంలోని మిగిలిన ప్రాంతాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను మైనార్టీలకు ఇచ్చేందుకు కుట్ర చేస్తోంది. నేను ఓబీసీని. అందుకే నాకు వెనుకబడిన తరగతుల వారు పడుతున్న కష్టాలు తెలుసు' అని ప్రధాని కాంగ్రెస్​పై విమర్శలు గుప్పించారు.

కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో ముస్లిం లీగ్ ముద్ర!
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లింలకు రిజర్వేషన్ల కోసం అంగీకారం తెలిపిందని మోదీ విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టోలో ముస్లిం లీగ్ ముద్ర ఉందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ హిందువుకు చేస్తున్న అన్యాయం మరోసారి బట్టబయలైందని ప్రధాని మోదీ విమర్శించారు. అమెరికాలో వారసత్వ పన్నుపై కాంగ్రెస్ నేత శామ్ పిట్రోడా చేసిన వ్యాఖ్యలపై సైతం మోదీ స్పందించారు. ప్రజల ఆస్తిని తమ పిల్లలకు అప్పగించాలని కాంగ్రెస్ కోరుకోవడం లేదని అన్నారు.

సుప్రీం తీర్పుపై కాంగ్రెస్ స్పందన
ఈవీఎంల్లో నమోదైన ఓట్లతో 100 శాతం వీవీప్యాట్ల స్లిప్పులను సరిపోల్చి లెక్కించాలన్న అంశాన్ని కాంగ్రెస్ పార్టీ మళ్లీ లేవనెత్తుతుందని ఆ పార్టీ నేత జైరాం రమేశ్ తెలిపారు. ఎన్నికల ప్రక్రియలో ప్రజల విశ్వాసాన్ని పెంపొందించేందుకు వీవీప్యాట్​ల వినియోగంపై కాంగ్రెస్ తన రాజకీయ ప్రచారాన్ని కొనసాగిస్తుందని తేల్చిచెప్పారు. ఈవీఎం- వీవీప్యాట్ వెరిఫికేషన్ వ్యవహారంలో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో జైరాం రమేశ్ ఎక్స్​లో ఈమేరకు పోస్ట్ చేశారు.

'ఇప్పటి వరకు 40 సార్లు పిటిషన్లను తిరస్కరించాయి'
ఇప్పటి వరకు దాదాపు 40 సార్లు ఈవీఎంలపై దాఖలైన పిటిషన్లను కోర్టులు తిరస్కరించాయని ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు. ఈవీఎం- బ్యాలెట్ వెరిఫికేషన్ వ్యవహారంపై దాఖలైన పిటిషన్లు సుప్రీంకోర్టు తిరస్కరించిన రోజే ఈసీ అధికారులు ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

మీ వద్ద ఓటింగ్ స్లిప్ లేదా? ఈజీగా ఆన్​లైన్​లో డౌన్ లోడ్ చేసుకోండిలా! - lok sabha elections 2024

చెవుల్లోకి దూరుతూ వింత పురుగుల బీభత్సం- ఇళ్లు విడిచి వెళ్తున్న ప్రజలు- ఎక్కడో తెలుసా? - strange insects in assam

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.