ETV Bharat / bharat

2047 వికసిత్ భారత్ కోసం పెద్ద ప్రణాళికలు- ఎవరూ భయపడాల్సిన అవసరంలేదు : మోదీ - Modi Interview Lok Sabha Polls - MODI INTERVIEW LOK SABHA POLLS

Modi Interview Lok Sabha Polls : లోక్​సభ ఎన్నికల తర్వాత బీజేపీ అధికారంలో వస్తే చేయాల్సిన పనుల గురించి ప్రధాని మోదీ తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఎలక్టోరల్​ బాండ్ల నుంచి టెస్లా కార్ల వరకు ప్రతి విషయం గురించి మాట్లాడారు.

Modi Interview Lok Sabha Polls
Modi Interview Lok Sabha Polls
author img

By ETV Bharat Telugu Team

Published : Apr 15, 2024, 5:48 PM IST

Updated : Apr 15, 2024, 7:52 PM IST

Modi Interview Lok Sabha Polls : సార్వత్రిక ఎన్నికల తర్వాత బీజేపీ అధికారంలో వస్తే దేశాభివృద్ధి కోసం తమ వద్ద పెద్ద ప్రణాళికలు ఉన్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. అలాగే 2047 నాటికి భారత్​ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చడానికి పెట్టుకున్న లక్ష్యాల గురించి మోదీ తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఎలక్టోరల్​ బాండ్ల దగ్గర నుంచి భారతదేశంలో టెస్లా కార్ల వరకు అనేక విషయాలు గురించి మోదీ మాట్లాడారు. 'నా దగ్గర పెద్ద ప్రణాళికలు ఉన్నాయని చెప్పినప్పుడు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు. నేను ఎవరినీ భయపెట్టడానికి లేదా పారిపోవడానికి నిర్ణయాలు తీసుకోను. దేశ అభివృద్ధి కోసమే నిర్ణయాలు తీసుకుంటా. నేను చేయాల్సింది చాలా ఉంది' అని మోదీ అన్నారు.

జమిలి ఎన్నికలతో ప్రయోజనం
"మీరు సరైన అంశాన్ని లేవనెత్తారు. ఒకే దేశం ఒకే ఎన్నికలనేది మా నిబద్ధత. మేము పార్లమెంట్‌లో మాట్లాడాం. ఒక కమిటీని కూడా ఏర్పాటు చేశాం. కమిటీ నివేదిక కూడా వచ్చింది. ఒకే దేశం-ఒకే ఎన్నికల పరంగా దేశంలో చాలా మంది తమ సలహాలను కమిటీకి అందించారు. చాలా సానుకూలమైన, వినూత్నమైన సూచనలు వచ్చాయి. మేము ఈ నివేదికను అమలు చేయగలిగితే దేశానికి ఎంతో మేలు జరుగుతుంది." అని మోదీ అన్నారు.

నిబద్దత ఉండాలి
"అభ్యర్థులే కాదు ఎన్నికల్లో ప్రతీ మద్దతుదారుడు చాలా ముఖ్యం. ఎన్నికల్లో బూత్‌ లెవల్‌ కార్యకర్త కూడా చాలా ముఖ్యం. దురదృష్టవశాత్తు ఈ రోజుల్లో ఒక పదం పట్ల నిబద్ధత, బాధ్యత ఉండడం లేదు. ఒక నాయకుడి ఇప్పటి ఆలోచనకు విరుద్ధగా ఉన్న పాత వీడియోలను ప్రస్తుతం సోషల్‌ మీడియాలో చలామణి అవుతున్నాయి. ఆ నాయకుడి అప్పటి ఆలోచనలు, ఇప్పటి ఆలోచనలు పూర్తి విరుద్ధంగా ఉన్నాయి. ఇటీవలే ఓ నాయకుడు నేను ఒక్క దెబ్బతో పేదరికాన్ని నిర్మూలిస్తాను అని అన్నారు. వీరికి అయిదు, ఆరు దశాబ్దాలు అధికారంలో ఉండే అవకాశం వచ్చింది. అయినా ఏం చేయని వారు ఇప్పుడు పేదిరకాన్ని ఒక్క దెబ్బతో నిర్మూలిస్తానని ప్రకటిస్తున్నారు. ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఏం మాట్లాడుతున్నారని దేశం అనుకుంటోంది. ఇలాంటి రాజకీయ నాయకత్వాన్ని ప్రశ్నార్థకం చేస్తున్నాయని నాకు అనిపిస్తోంది. మనం ఏం మాట్లాడుతున్నామో దానికి మనం బాధ్యత తీసుకోవాలి. అది చేస్తాం ఇది చేస్తాం అనే మాటలు చెల్లవు. నేను అన్న మాటకు కట్టుబడి ఉంటాను. దానికి పూర్తి బాధ్యత వహిస్తాను. 370 అధికరణను ఉపసంహరిస్తామని బీజేపీ పుట్టినప్పటి నుంచి చెప్తున్నాం. దీనికోసం శ్యామా ప్రసాద్‌ ముఖర్జీ ప్రాణత్యాగం చేశారు. నాకు అవకాశం వచ్చింది. 370 ఆర్టికల్‌ను ఉపసంహరించాం. ఇవాళ జమ్ముకశ్మీర్‌లో మార్పు వచ్చింది. మనం ముందుకు వెళ్లాలంటే బాధ్యతగా ఉండాలి" అని మోదీ తెలిపారు.

ఎలక్టోరల్ బాండ్ల తప్పుడు నిర్ణయమా?
'ఎలక్టోరల్ బాండ్లు లేకపోతే డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో? ఎవరు? ఎలా ఇచ్చారు? అనే విషయాలు తెలుసుకునే అధికారం ఉండేది కాదు. ఇది ఎలక్టోరల్ బాండ్​ల విజయగాథ. అందుకే మీకు డబ్బు దొరుకుతోంది. నిర్ణయం తీసుకోవడంలో లోపాలు లేవని నేను ఎప్పడూ చెప్పను. నిర్ణయాధికారం, మనం నేర్చుకుని, మెరుగుపరచడం చాలా సాధ్యమే. కానీ ఎన్నికల సమయంలో దేశం పూర్తిగా నల్లధనం వైపునకు నెట్టివేశారు. దీంతో ప్రతిపక్షాలు నిజాయితీగా ఆలోచించినప్పుడు, ప్రతి ఒక్కరూ పశ్చాత్తాపపడతారు. బీజేపీకి 37% శాతం నిధులు ఎలక్టోరల్ బాండ్ల ద్వారా వస్తే ప్రతిపక్షానికి 63% శాతం వచ్చింది' అని మోదీ పేర్కొన్నారు.

సనాతన ధర్మం వివాదం వల్ల ప్రజలు బీజేపీ వైపు మొగ్గు చూపారా?
'ఇది కాంగ్రెస్‌ను అడగాలి. ఒకప్పుడు మహాత్మా గాంధీ తనకు తానుగా అనుబంధం కలిగి ఉన్న పార్టీ కాంగ్రెస్. ఇందిరా గాంధీ బహిరంగంగా మెడలో రుద్రాక్షమాల వేసుకునేవారు. సనాతన ధర్మంపై ఇంత విషం చిమ్ముతున్న వారితో బలవంతంగా కూర్చోవాల్సిన అవసరమేముందని కాంగ్రెస్‌ని అడగాలి. తన రాజకీయాలను అసంపూర్తిగా వదిలేస్తుందా? కాంగ్రెస్ మైండ్ సెట్‌లో ఈ వక్రబుద్ధి ఏంటన్నది ఆ పార్టీలోనే ఆందోళన కలిగిస్తోంది. డీఎంకే బహుశా ఈ ద్వేషంలోనే పుట్టిందేమో మెల్ల మెల్లగా ప్రజలు ఆ ద్వేషాన్ని కూడా స్వీకరించట్లేదు. అందుకే వాళ్లు కొత్త కొత్త విషయాలతో విమర్శలు చేస్తున్నారు. ప్రశ్న వాళ్ల గురించి కాదు. ఇది కాంగ్రెస్ లాంటి పార్టీ గురించి. కాంగ్రెస్ పార్టీ దాని ప్రాథమిక స్వభావాన్ని కోల్పోయిందా? రాజ్యాంగం సనాతన ధర్మానికి గౌరవం ఇచ్చింది. ఈ రోజు సనాతన ధర్మాన్ని దూషించే ధైర్యం ఒకరికి ఉందంటే, డీఎంకేతో కాంగ్రెస్ ఎన్నికలకు వెళ్తుందంటే, వేదికను పంచుకుంటుందంటే ఇది దేశానికి ఆందోళన కలిగించే విషయం' అని వెల్లడించారు.

భారతదేశాన్ని రెండు భాగాలు చేస్తారా?
'భారతదేశం భిన్నత్వంతో కూడిన దేశం. భారతదేశాన్ని వేర్వేరు యూనిట్లుగా చూడడం బుద్ధిహీనత ఫలితం. దేశంలోని రాముడి పేరుతో ఎక్కువ గ్రామాలు ఉన్న రాష్ట్రం తమిళనాడు దానిని ప్రత్యేక యూనిట్ అని ఎలా అంటారు? వైవిధ్యం ఉంది. నాగాలాండ్‌కు చెందిన వ్యక్తి పంజాబ్‌కు చెందిన వ్యక్తిలా ఉండడు. కశ్మీర్‌కు చెందిన వ్యక్తి గుజరాతీలా ఉండడు. వైవిధ్యమే మన బలం. దానిని మనం వేడుకలా జరుపుకోవాలి' మోదీ అన్నారు

స్టార్‌ లింక్‌, టెస్లా వంటి కంపెనీలను భారత్‌లో చూస్తామా?
'ప్రపంచస్థాయి కంపెనీ భారత్​లో పెట్టుబడులు పెట్టాలనే నేను కోరుకుంటా. ఇక్కడ ఎవరూ పెట్టుబడి పెట్టారనేది ముఖ్యం కాదు. కానీ ఆ కంపెనీ ఉత్పత్తులు భారతీయుల చేతుల్లోనే తయారు కావాలి. అప్పుడే మన యువతకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. వాస్తవానికి టెస్లా అధినేత ఎలాన్ మస్క్ వాస్తవానికి భారత్​కు మద్దతుదారు. 2015లో నేను టెస్లా ఫ్యాక్టరీని సందర్శించినప్పుడు ఆయన తన కార్యక్రమాలను రద్దు చేసుకుని మరీ నాతో సమావేశమయ్యారు. తన ఫ్యాక్టరీ మొత్తాన్ని చూపించారు. ఆయన దృక్పథం ఏంటో నాకు అర్థమైంది' అని మోదీ తెలిపారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

'తీర్పులను వారికి అనుకూలంగా మార్చుకుంటున్నారు, కోర్టులపై తీవ్ర ఒత్తిడి'- సీజేఐకి లేఖలో మాజీ జడ్జిల ఆందోళన - Retired Judges Letter to CJI

'2024లో సాధారణం కంటే ఎక్కువ వర్షాలు'- IMD గుడ్​న్యూస్​ - Monsoon Prediction 2024 IMD

Last Updated : Apr 15, 2024, 7:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.