ETV Bharat / bharat

40ఏళ్ల తర్వాత రేప్​ కేస్ నిందితుడు అరెస్ట్- ఆ టెక్నాలజీతోనే! - Man Arrested After 40 Years - MAN ARRESTED AFTER 40 YEARS

Man Arrested After 40 Years : పరారీలో ఉన్న ఓ రేప్ కేసు నిందితుడిని 40ఏళ్ల తర్వాత పోలీసులు అరెస్ట్ చేశారు. టెక్నాలజీని ఉపయోగించి ఆగ్రాలో నిందితుడు ఉన్నట్లు గుర్తించిన పోలీసులు, అతడిని అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపర్చారు. ఈ ఘటన మహారాష్ట్రలో జరిగింది.

Man Arrested After 40 Years
Man Arrested After 40 Years (Getty Images)
author img

By ETV Bharat Telugu Team

Published : May 8, 2024, 10:59 AM IST

Man Arrested After 40 Years : అత్యాచారం కేసులో ఆరోపణలు ఎదుర్కొని పరారీలో ఉన్న నిందితుడిని 40 ఏళ్ల తర్వాత ముంబయి పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు పాపా అలియాస్ దావూద్​ను పోలీసులు ఆగ్రాలో అదుపులోకి తీసుకున్నారు. పాపాపై క్రిమినల్ కేసు కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

అసలేం జరిగిందంటే?
మహారాష్ట్రలోని ముంబయిలో పాపా అలియాస్ దావూద్ బంధు ఖాన్ అనే వ్యక్తి 1984లో ఓ మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు. దావూద్​పై డీబీ మార్గ్ పోలీస్ స్టేషన్​లో ఐపీసీ సెక్షన్ 366, 376 కింద అత్యాచార నేరం కింద కేసు నమోదైంది. 1985లో ఈ కేసుపై బాంబే సెషన్స్ కోర్టులో విచారణ జరిగింది. ఈ విచారణకు పాపా హాజరుకాలేదు. దీంతో ఈ కేసులో ప్రధాన నిందితుడు పాపా అలియాస్ దావూద్ పరారీలో ఉన్నట్లు సెషన్స్ జడ్జి ప్రకటించారు. అతడిపై స్టాండింగ్ నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేశారు. అప్పటి నుండి దావూద్ పరారీలో ఉండడం వల్ల 40 ఏళ్లుగా ఈ కేసు కోర్టులో పెండింగ్​లో ఉండిపోయింది.

ఇల్లును అమ్మి ఆగ్రాకు పరార్
ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో పోలీస్ స్టేషన్ రికార్డుల్లో పరారీలో ఉన్న నిందితులను గుర్తించి అరెస్టు చేసేందుకు ముంబయి డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ మోహిత్ కుమార్ గార్గ్ స్పెషల్ డ్రైవ్​ను నిర్వహించారు. ఈ క్రమంలో ముంబయిలో బాపురావ్ రోడ్​లో ఉన్న పాపా ఇంట్లో తనిఖీలు చేపట్టినా అతడి అచూకీ లభించలేదు. నిందితుడి తండ్రి ముంబయిలో ఉన్న ఇంటిని అమ్మి కుటుంబంతో కలిసి ఉత్తర భారతదేశానికి వెళ్లిపోయాడని పోలీసులకు తెలిసింది. కచ్చితంగా ఎక్కడి వెళ్లారనే విషయం మాత్రం తెలియలేదు.

కాగా, మరింత లోతుగా విచారణ చేపట్టగా నిందితుడితో పరిచయమున్న ఓ వ్యక్తి, ఇన్ ఫార్మర్ల ద్వారా పోలీసులకు కీలక సమాచారం అందింది. ఈ క్రమంలో సాంకేతికతను ఉపయోగించి నిందితుడు పాపా ఆగ్రాలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అనంతరం ఎస్సై సంతోష్‌ కోయిండే బృందం ఆగ్రాకు చేరుకుని నిందితుడు పాపాను అరెస్ట్ చేశారు. అత్యాచార నిందితుడు పాపాను 40 ఏళ్ల తర్వాత పట్టుకోవడంలో కానిస్టేబుల్ రాణే కీలక పాత్ర పోషించారు.

నిందితుడిని స్టాండింగ్ నాన్ బెయిలబుల్ వారెంట్​పై ఆగ్రాలో ముంబయి పోలీసులు అరెస్ట్ చేశారు. అక్కడి నుంచి ముంబయికు తరలించి సెషన్స్ కోర్టు జడ్జి ముందు మంగళవారం హాజరుపరిచారు. నిందితుడు పాపా దాదాపు 25 ఏళ్ల క్రితం బాపురావ్ రోడ్డులోని తన ఇంటిని విక్రయించి, తన కుటుంబంతో కలిసి ఆగ్రాకు వెళ్లిపోయాడని డీబీ మార్గ్ పోలీస్ ఇన్ స్పెక్టర్ వినయ్ ఘోర్పడే తెలిపారు.

చేతులు లేకపోయినా రెండు కాళ్లతో డ్రైవింగ్- RTO నుంచి లైసెన్స్​- రాష్ట్రంలో తొలి వ్యక్తిగా రికార్డ్​! - Disabled Person Got Licence

'రాజకీయ' వారసుడిపై మాయావతి వేటు- 5నెలల్లో పదవి కోల్పోయిన ఆకాశ్- బీజేపీపై వ్యాఖ్యలు వల్లేనా? - Mayawati Successor

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.