ETV Bharat / bharat

ఆర్టీసీ బస్సును ఢీకొన్న ట్రక్కు- 8మంది స్పాట్​ డెడ్​- 22మందికి తీవ్ర గాయాలు - Bus Truck Accident - BUS TRUCK ACCIDENT

Maharashtra Road Accident News Today : ఆర్టీసీ బస్సును ట్రక్కు బలంగా ఢీకొట్టడం వల్ల 8 మంది అక్కడిక్కడే మరణించారు. మరో 22 మంది తీవ్రంగా గాయపడ్డారు. మహారాష్ట్రలో జరిగిందీ ఘటన.

Maharashtra Road Accident News Today
Maharashtra Road Accident News Today
author img

By ETV Bharat Telugu Team

Published : Apr 30, 2024, 11:42 AM IST

Updated : Apr 30, 2024, 12:43 PM IST

Maharashtra Road Accident News Today : మహారాష్ట్రలోని నాశిక్ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మంది మరణించారుయ. మరో 22 మంది తీవ్రంగా గాయపడ్డారు. ముంబయి-ఆగ్రా హైవేపై ఆర్టీసీ బస్సును ట్రక్కు ఢీకొట్టడం వల్ల ఈ ఘటన జరిగింది. దీంతో జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ స్తంభించిపోయింది.

చందవాడ్​ సమీపంలోని రాహుద్ ఘాట్ వద్ద మంగళవారం ఉదయం బస్సు, ట్రక్కు ఢీకొన్నాయి. దీంతో 8 మంది ప్రయాణికులు అక్కడికక్కడే మరణించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. గాయపడిన వారిని చికిత్స స్థానిక ఆస్పత్రిలో చేర్పించారు. మృతదేహాలను శవపరీక్షల కోసం తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

అయితే రాహుద్ ఘాట్​లో నిత్యం ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. గతంలో కూడా ఓ ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. అనేక మంది ప్రాణాలు కూడా కోల్పోయారు. ఆ ప్రాంతాన్ని బ్లాక్ స్పాట్​గా అధికారులు గుర్తించారు. భవిష్యత్తులో ఇకపై ఎలాంటి ప్రమాదాలు జరగకుండా కట్టుదిట్టమైన చర్చలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

జీపు- ట్రక్కు ఢీ, ఐదుగురు మృతి
మరోవైపు, బిహార్​లోని భాగల్​పుల్ జిల్లాలో జీపును ట్రక్కు బలంగా ఢీకొట్టడం వల్ల వివాహ వేడుకకు వెళ్తున్న ఆరుగురు చనిపోయారు. ముగ్గురు గాయపడ్డారు. సోమవారం రాత్రి ఆమాపుర్ గ్రామంలో ఈ ప్రమాదం జరిగింది. సమచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. క్షతగాత్రులను సమీప ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతదేహాలను శవపరీక్షల కోసం పంపారు. మృతులను సత్యం మండల్ (32), సంచిత్ కుమార్ (18), అభిషేక్ కుమార్ (12), పంకజ్ కుమార్ సింగ్ (35),అమిత్ దాస్ (16), పరిమళ్ దాస్ (42)గా పోలీసులు గుర్తించారు.

కేరళలో కన్నూర్​ల్​ జరిగిన ఘోర ప్రమాదంలో చిన్నారి సహా ఐదుగురు మృతి చెందారు. అందులో ఒక మహిళతో సహా నలుగురు పెద్దలు అక్కడికక్కడే మృతి చెందగా, తొమ్మిదేళ్ల చిన్నారి పరియారంలోని బోధనాస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయింది. మృతులను కారు నడుపుతున్న కేఎన్ పద్మకుమార్ (59), సుధాకరన్ (52), సుధాకరన్ భార్య అజిత (35), బావ కోజుమ్మల్ కృష్ణన్ (65), అజిత మేనల్లుడు ఆకాశ్(9)గా గుర్తించారు. తొలుత కారును వెనుక నుంచి లారీ ఢీకొట్టిందని, ఆ తర్వాత గ్యాస్ సిలిండర్లతో వెళ్తున్న మరో లారీని కారు ఢీకొనడం వల్ల ఈ విషాదం జరిగిందని పోలీసులు తెలిపారు.

'బీజేపీకి 400 సీట్లు పక్కా! ఓటమి భయంతో ప్రతిపక్షాలు'- ఈటీవీ భారత్​తో అమిత్ షా ఎక్స్​క్లూజివ్​ - lok sabha election 2024

'కంట్రోల్​ కోల్పోయిన అమిత్​ షా హెలికాప్టర్, గాల్లో ఊగిసలాట'- క్లారిటీ ఇచ్చిన కేంద్ర హోం శాఖ - Amit Shah Helicoptor Loses Control

Last Updated : Apr 30, 2024, 12:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.