ETV Bharat / bharat

రాయ్​బరేలీ నుంచి బరిలో రాహుల్ గాంధీ- మరి అమేఠీ నుంచి ఎవరంటే? - Lok Sabha Elections 2024 - LOK SABHA ELECTIONS 2024

Lok Sabha Polls Amethi Raebareli : ఉత్తర్‌ప్రదేశ్‌లోని అమేఠీ, రాయ్‌బరేలీ స్థానాలకు కాంగ్రెస్‌ అభ్యర్థులు ఖరారయ్యారు. రాయ్​బరేలీలో నుంచి ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ బరిలోకి దిగుతున్నారు. అమేఠీలో గాంధీ కుటుంబ విధేయుడు కేఎల్ శర్మ పోటీ చేయనున్నారు.

Lok Sabha Polls Amethi Raebareli
RAHUL GANDHI (ANI SOURCE)
author img

By ETV Bharat Telugu Team

Published : May 3, 2024, 7:50 AM IST

Updated : May 3, 2024, 11:42 AM IST

Lok Sabha Polls Amethi Raebareli : ఓవైపు దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతుండగా, మరోవైపు ఆ రెండు స్థానాలపైనే అందరి దృష్టి నెలకొంది. అవే యూపీలోని అమేఠీ, రాయ్‌బరేలీ. ఒకప్పుడు కాంగ్రెస్​ కంచుకోటగా ఉన్న ఈ స్థానాలకు ఎట్టకేలకు ఆ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. రాయ్​బరేలీ నుంచి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పోటీ చేస్తున్నారు. అమేఠీ నుంచి గాంధీ కుటుంబ విధేయుడు కిశోరీ లాల్ శర్మ బరిలో దిగనున్నారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ అధికారికంగా వెల్లడించింది.

అయితే రాయ్​బరేలీ, అమేఠీ నియోజకవర్గాల్లో నామినేషన్ల దాఖలుకు శుక్రవారంతో గడువు ముగియనుంది. దీంతో మరికొద్ది గంటల్లో రాహుల్ గాంధీ, కిశోరీ లాల్ శర్మ నామినేషన్లను దాఖలు చేయనున్నారు. ఇక ప్రియాంకా గాంధీ ఈ ఎన్నికల్లో కూడా పోటీ చేయడం లేదని స్పష్టమైంది. రాహుల్ గాంధీ నామినేషన్ ప్రక్రియకు కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియాగాంధీ హాజరయ్యే అవకాశం కూడా ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి.

కాగా, సోనియాగాంధీ 2004 నుంచి 2024 వరకు రాయ్​బరేలీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. ఇప్పుడు సోనియా రాజ్యసభకు ఎన్నికయ్యారు. 2019 లోకసభ ఎన్నికల్లో సోనియాగాంధీ చేతిలో ఓడిపోయిన ప్రతాప్​ సింగ్​నే మరోసారి బరిలోకి దించింది భారతీయ జనత పార్టీ. మరోవైపు 2019 ఎన్నికల్లో అమేఠీ నుంచి బీజేపీ అభ్యర్థి స్మృతి ఇరానీ చేతిలో రాహుల్ గాంధీ ఓటమిపాలయ్యారు. ఈసారి ఈ నియోజకవర్గం నుంచి గాంధీ కుటుంబ విధేయుడు కిశోరీ లాల్​ను బరిలోకి దింపింది కాంగ్రెస్.

ఇక తన తల్లి సోనియాగాంధీకి కలిసి వచ్చిన నియోజకవర్గం కావడం వల్ల రాహుల్ గాంధీ రాయ్​బరేలీ నుంచి పోటీ చేసేందుకు సిద్ధమయ్యినట్లు తెలుస్తోంది. ఇప్పటికే వయనాడ్​ నుంచి కూడా పోటీ చేశారు రాహుల్. ఇటీవల అక్కడ పోలింగ్ జరిగింది. అయితే అమేఠీకి గాంధీ కుటుంబానికి మధ్య బంధం చాలా బలంగా ఉందని ఆ పార్టీ నాయకుడు దీపక్ సింగ్ తెలిపారు. ఆ బంధం ఎప్పటికీ అలాగే ఉంటుందని చెప్పారు.

Last Updated : May 3, 2024, 11:42 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.