ETV Bharat / bharat

ముగిసిన లోక్​సభ ఎన్నికల ఐదో విడత పోలింగ్​- 57.47% ఓటింగ్ నమోదు - Lok Sabha Elections 2024 - LOK SABHA ELECTIONS 2024

Lok Sabha Elections 2024 Phase 5 Live Updates : సార్వత్రిక సమరం ఐదో విడత పోలింగ్‌ జరుగుతోంది. ఈ విడతలో 6 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల పరిధిలోని 49 నియోజకవర్గాల్లో ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు.

Lok Sabha Elections 2024 phase 5 Live Updates
Lok Sabha Elections 2024 phase 5 Live Updates (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : May 20, 2024, 6:29 AM IST

Updated : May 20, 2024, 11:22 AM IST

  • 6.10 PM

ఐదో విడత లోక్​సభ ఎన్నికల పోలింగ్​లో భాగంగా సాయంత్రం 5 గంటల వరకు 57.47% శాతం ఓటింగ్​​ నమోదైంది.

  • బిహార్- 52.60%
  • జమ్ముకశ్మీర్- 54.49%
  • ఝార్ఖండ్- 63.00%
  • లద్దాఖ్-67.15%
  • మహారాష్ట్ర-48.88%
  • ఒడిశా-60.72%
  • ఉత్తర్​ప్రదేశ్-57.79%
  • బంగాల్-73.00%
  • 4.07 PM

ఐదో విడత లోక్​సభ ఎన్నికల పోలింగ్​లో భాగంగా మధ్యాహ్నం 3 గంటల వరకు 47.53 శాతం ఓటింగ్​​ నమోదైంది.

  • బిహార్- 45.33
  • జమ్ముకశ్మీర్- 44.90
  • ఝార్ఖండ్- 53.90
  • లద్దాఖ్-61.26
  • మహారాష్ట్ర-38.77
  • ఒడిశా-48.95
  • ఉత్తర్​ప్రదేశ్-47.55
  • బంగాల్-62.72
  • 1:59 PM

కొనసాగుతున్న సార్వత్రిక ఎన్నికల ఐదో విడత పోలింగ్‌

మధ్యాహ్నం ఒంటిగంట వరకు మొత్తం 36.73 శాతం పోలింగ్

రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతల వారిగా నమోదైన పోలింగ్‌ శాతాలు

  • బిహార్‌ 34.62 శాతం
  • జమ్ముకశ్మీర్ 34.79 శాతం
  • ఝార్ఖండ్‌ 41.89 శాతం
  • లద్దాఖ్‌ 52.02శాతం
  • మహారాష్ట్ర 27.78 శాతం
  • ఒడిశా 35.31 శాతం
  • ఉత్తర్‌ప్రదేశ్‌ 39.55 శాతం
  • బంగాల్‌ 48.41 శాతం

క్రికెట్ గాడ్ సచిన్ తెందుల్కర్, బాలీవుడ్ నటులు దీపికా పదుకొణె, రణ్​వీర్​ సింగ్, శిల్పా శెట్టి, రకుల్​ ప్రీత్ సింగ్ ముంబయిలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

  • 12:00 PM

6 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లోని 49 స్థానాలకు పోలింగ్‌

ఉదయం 11 గంటల వరకు నమోదైన పోలింగ్‌ శాతాలు

  • బిహార్‌ 21.11
  • జమ్ముకశ్మీర్ 21.37
  • ఝార్ఖండ్‌ 26.18
  • లద్దాఖ్‌ 27.87
  • మహారాష్ట్ర 15.93
  • ఒడిశా 21.07
  • ఉత్తర్‌ప్రదేశ్‌ 27.76
  • బంగాల్ 32.70
  • 11:16 AM

ముంబయిలో ఓటు వేసిన బీజేపీ ఎంపీ హేమమాలిని, ఆర్​బీఐ డిప్యూటీ గవర్నర్ మైఖేల్ పాత్ర

  • 10:13 AM

రక్షణ శాఖ మంత్రి రాజ్​నాథ్ సింగ్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్​నాథ్ శిందే తమ నియోజకవర్గాల్లో ఓటు హక్కును వినియోగించుకున్నారు.

  • 9:45 AM

ఉదయం 9 గంటల వరకు నమోదైన పోలింగ్‌ శాతాలు

  • బిహార్‌ 8.86
  • జమ్ముకశ్మీర్ 7.63
  • ఝార్ఖండ్‌ 11.68
  • లద్దాఖ్‌ 10.51
  • మహారాష్ట్ర 6.33
  • ఒడిశా 6.87
  • ఉత్తర్‌ప్రదేశ్‌ 12.89
  • బంగాల్‌ 15.35
  • ఓటు వేసిన హాకీ ఇండియా అధ్యక్షుడు, బీజేడీ నేత దిలీప్‌ టిర్కీ
  • ముంబయిలో ఓటు హక్కు వినియోగించుకున్న షాహిద్​ కపూర్, జాన్వీ కపూర్‌, శ్రియా శరణ్
  • అమేఠీ పోలింగ్ కేంద్రంలో ఓటు వేసిన బీజేపీ ఎంపీ స్మృతి ఇరానీ
  • 8 : 45 AM

ముంబయిలో కేంద్రమంత్రి పీయూశ్ గోయల్, ఆర్​బీఐ గవర్నర్ శక్తికాంత దాస్, హిమచల్​ప్రదేశ్​లోని హమీర్​పుర్​ పోలింగ్ బూత్​లో కేంద్ర మంత్రి సాధ్వీ నిరంజన్ జ్యోతి ఓటు వేశారు.

  • 7: 24 AM

లోక్​సభ ఎన్నికలు ఐదో విడతలో భాగంగా ప్రముఖులు ఓటు వేసేందుకు తరలివస్తున్నారు. బీఎస్​పీ అధినేత్రి మాయావతి, ప్రముఖ పారిశ్రామికవేత్త అనిల్ అంబానీ, బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

  • 7: 00 AM

పోలింగ్ ప్రారంభం
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఐదో విడత పోలింగ్‌ ప్రారంభమైంది. ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 49 నియోజకవర్గాల్లో పోలింగ్‌ జరుగుతోంది. మొత్తం 695మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 8 కోట్ల 95 లక్షల మంది ఓటర్లు కోసం ఈసీ 94,732 పోలింగ్‌ స్టేషన్లు ఏర్పాటు చేసింది. ఈ విడతలో పలువురు కేంద్రమంత్రులు, ప్రతిపక్ష పార్టీలకు చెందిన ప్రముఖ నేతలు బరిలో ఉన్నారు.

ఐదో దశ లోక్​సభ ఎన్నికల్లో ఓటర్లందరూ కొత్త రికార్డు సృష్టించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కోరారు. లోక్‌సభ ఎన్నికలు ఐదో విడతలో 8 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 49 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయని ఆయన తెలిపారు. ఈ ప్రజాస్వామ్య పండుగలో ఓటర్లు ఉత్సాహంగా పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు.

Lok Sabha Elections 2024 phase 5 Live Updates : కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల నడుమ దేశంలో మరో దశ పోలింగ్‌కు రంగం సిద్ధమైంది. సార్వత్రిక ఎన్నికల ఐదో విడతలో భాగంగా ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 49 నియోజకవర్గాలకు సోమవారం ఓటింగ్‌ జరగనుంది. వీటిలో మొత్తంగా 695 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఈ జాబితాలో రాజ్‌నాథ్‌ సింగ్, పీయూష్‌ గోయల్, స్మృతి ఇరానీ తదితర కేంద్ర మంత్రులతోపాటు కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ ఉపాధ్యక్షుడు ఒమర్‌ అబ్దుల్లా వంటి ప్రముఖులు ఉన్నారు. అత్యధికంగా ఉత్తర్‌ప్రదేశ్‌లో 14, మహారాష్ట్రలో 13, పశ్చిమ బెంగాల్‌లో 7, బిహార్‌లో 5, ఝార్ఖండ్‌లో 3, జమ్మూకశ్మీర్‌లో 1, లద్దాఖ్‌లో 1 స్థానానికి పోలింగ్‌ జరుగుతుంది. ప్రస్తుత సార్వత్రిక ఎన్నికలను ఏడు విడతల్లో నిర్వహిస్తున్నారు. దేశంలో మొత్తంగా 543 లోక్‌సభ నియోజకవర్గాలు ఉన్నాయి. ఐదో దశతో కలిపితే 428 సీట్లకు పోలింగ్‌ పూర్తవుతుంది.

రాయ్‌బరేలీ, అమేఠీలపై అందరి దృష్టి
ఉత్తర్‌ప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ, అమేఠీ స్థానాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ రెండూ కాంగ్రెస్‌కు కంచుకోటల్లాంటి సీట్లు. అయితే అయిదేళ్ల కిందట అమేఠీలో రాహుల్‌గాంధీపై స్మృతి ఇరానీ విజయం సాధించి సంచలనం సృష్టించారు. ప్రస్తుతం రాహుల్‌ రాయ్‌బరేలీలో పోటీ చేస్తున్నారు. అమేఠీలో స్మృతి ఇరానీపై గాంధీ కుటుంబ సన్నిహితుడు కిశోరీలాల్‌ శర్మను కాంగ్రెస్‌ బరిలో దించింది. లఖ్‌నవూలో హ్యాట్రిక్‌పై రాజ్‌నాథ్‌ సింగ్‌ గురిపెట్టారు.

500 మందికిపైగా శతాధిక వయస్కులు
జమ్మ కశ్మీర్‌లోని బారాముల్లా లోక్‌సభ నియోజకవర్గానికి ఈ విడతలో పోలింగ్‌ జరగనుంది. ఇక్కడ 17.37 లక్షల ఓటర్లు ఉన్నారు. అందులో 500 మందికిపైగా శతాధిక వయస్కులు కావడం గమనార్హం. బారాముల్లాలో మొత్తం 22 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. వారిలో 14 మంది స్వతంత్రులు. ఇక్కడ మాజీ సీఎం, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ ఉపాధ్యక్షుడు ఒమర్‌ అబ్దుల్లాకు మాజీ మంత్రి సజ్జాద్‌ లోన్‌ నుంచి గట్టి సవాలు ఎదురవుతోంది. జైల్లో ఉండి పోటీ చేస్తున్న అవామీ ఇత్తెహాద్‌ పార్టీ నేత అబ్దుల్‌ రషీద్‌ షేక్‌ అలియాస్‌ ఇంజినీర్‌ రషీద్‌నూ తక్కువగా అంచనా వేయలేం.

బంగాల్​లో ఏడు సీట్లకు ఈ దశలో పోలింగ్‌ జరగనుంది. రాష్ట్రంలో ఇప్పటివరకు ప్రతి విడతలోనూ ఘర్షణలు చోటుచేసుకున్నాయి. దీనికితోడు ఐదో విడతలోని 57% పోలింగ్‌ కేంద్రాలను సున్నితమైనవిగా గుర్తించడం వల్ల ముందుజాగ్రత్త చర్యగా 60 వేలకుపైగా కేంద్ర బలగాలతోపాటు 29,172 మంది రాష్ట్ర పోలీసులను మోహరించారు. ఒడిశాలో ఐదు లోక్‌సభ స్థానాలతోపాటు 35 అసెంబ్లీ నియోజకవర్గాలకు సోమవారం పోలింగ్‌ జరగనుంది.

Last Updated : May 20, 2024, 11:22 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.