ETV Bharat / bharat

ఏప్రిల్​ 16న లోక్​సభ ఎన్నికలు? వార్తలపై ఎన్నికల సంఘం క్లారిటీ

Lok Sabha Election 2024 Date ECI : సార్వత్రిక ఎన్నికల తేదీపై వస్తున్న వార్తలపై దిల్లీ ఎన్నికల సంఘం స్పష్టత ఇచ్చింది. 2024 ఏప్రిల్​ 16న లోక్​సభకు ఎన్నికలు అంటూ ఉత్తర్వుల్లో పేర్కొన్న తేదీ తాత్కాలికమేనని తేల్చిచెప్పింది.

Lok Sabha Election Date ECI
Lok Sabha Election Date ECI
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 23, 2024, 7:27 PM IST

Updated : Jan 23, 2024, 8:02 PM IST

Lok Sabha Election 2024 Date ECI : లోక్​సభ ఎన్నికల తేదీపై వచ్చిన వార్తలపై స్పష్టత ఇచ్చింది దిల్లీ ఎన్నికల సంఘం. 2024 ఏప్రిల్​ 16న లోక్​సభకు ఎన్నికలు అంటూ తాము ఇచ్చిన తేదీ తాత్కాలికేమనని వెల్లడించింది. ఎన్నికలకు సంబంధించి ముందస్తు కార్యకలాపాలను పూర్తి చేసేందుకు ఆ తేదీని ఓ లక్ష్యంగా పెట్టుకున్నామని వివరించింది. ఈ మేరకు సోషల్​ మీడియాలో ప్రకటన చేసింది.

"లోక్​సభ ఎన్నికల కోసం ముందుగా అనేక పనులు ఉంటాయి. వీటన్నింటిని పూర్తి చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఓ తాత్కాలిక తేదీని నిర్ణయిస్తుంది. దీనికి అనుగుణంగా మిగిలిన కార్యక్రమాల ప్రారంభ, ముగింపు తేదీలు నిర్ణయించుకుని ఎన్నికల కార్యకలాపాలను పూర్తి చేస్తాం. వీటిలో అధికంగా జిల్లా ఎన్నికల అధికారులు, రిటర్నింగ్​ ఆఫీసర్ల ఆధ్వర్యంలో జరుగుతాయి. ఈ క్రమంలోనే 2024 ఏప్రిల్​ 16న తాత్కాలిక తేదీగా నిర్ణయిస్తూ 2024 జనవరి 19న ఉత్తర్వులు జారీ చేశాం. ఈ తేదీ పూర్తిగా లోక్​సభ ఎన్నికల ముందస్తు ప్రణాళిక కోసం మాత్రమే. కేవలం ఎన్నికల అధికారుల ఒక సూచనగా జారీ చేశాం. లోక్​సభ ఎన్నికల తేదీని భారత ఎన్నికల సంఘం సరైన సమయంలో ప్రకటిస్తుంది."

--దిల్లీ ఎన్నికల సంఘం

ఈసారి కూడా ఏప్రిల్​లోనే!
మరికొద్ది నెలల్లో జరగబోయే సార్వత్రిక ఎన్నికల నిర్వహణ కోసం కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే కసరత్తు మొదలుపెట్టింది. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో పర్యటనలు చేపట్టింది. లోక్‌సభ ఎన్నికల నిర్వహణకు ముందు ఈసీ రాష్ట్రాల్లో పర్యటించడం సాధారణంగా ప్రతిసారీ జరిగే అధికారిక ప్రక్రియనే. ఇందులో భాగంగా ఆయా రాష్ట్రాల్లోని రాజకీయ పార్టీలు, పాలనా విభాగ అధికారులు, సీనియర్‌ పోలీసులు, క్షేత్రస్థాయిలో ఎన్నికల విధులు నిర్వర్తించే సిబ్బందితో ఎన్నికల సంఘం సమీక్షలు నిర్వహిస్తుంది. ఈసీ దేశవ్యాప్త పర్యటన పూర్తయిన అనంతరం, లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ వెలువడే అవకాశముంది. అంతకుముందు 2019లో మార్చి 10వ తేదీన ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించగా, ఏప్రిల్‌ 11 నుంచి మే 19 వరకు ఏడు దశల్లో పోలింగ్‌ నిర్వహించారు. మే 23న ఫలితాలను ప్రకటించారు. ఈసారి కూడా ఏప్రిల్‌-మే నెలల్లోనే ఎన్నికలు నిర్వహించే అవకాశాలు కన్పిస్తున్నాయి.

  • Some media queries are coming referring to a circular by @CeodelhiOffice to clarify whether 16.04.2024 is tentative poll day for #LSElections2024
    It is clarified that this date was mentioned only for ‘reference’for officials to plan activities as per Election Planner of ECI.

    — CEO, Delhi Office (@CeodelhiOffice) January 23, 2024 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

Last Updated : Jan 23, 2024, 8:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.