Kolkata Doctor Case Protest : కోల్‌కతా జూనియర్ వైద్యురాలిపై జరిగిన హత్యాచార ఘటనకు నిరసనగా గురువారం అర్ధరాత్రి బంగాల్వ్యాప్తంగా వేలాది మహిళలు 'రీ క్లెయిమ్ ది నైట్' పేరుతో ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలని నినాదాలు చేశారు. సెల్‌ఫోన్ లైట్లతో నిరసన ర్యాలీ నిర్వహించారు. మరోవైపు కొందరు దుండగులు ట్రైనీ డాక్టర్‌పై హత్యాచారం జరిగిన ఆస్పత్రిలోకి చొరబడ్డారు. అక్కడి సామాగ్రిని నాశనం చేశారు.
#WATCH | West Bengal: Women hold protest against RG Kar Medical College and Hospital rape-murder incident, in Jadavpur, Kolkata. pic.twitter.com/qSSUGRO3te
— ANI (@ANI) August 14, 2024
#WATCH | West Bengal: Women hold protest against RG Kar Medical College and Hospital rape-murder incident, in Siliguri. pic.twitter.com/HDReo27CLh
— ANI (@ANI) August 14, 2024
'రీ క్లెయిమ్ ది నైట్' పేరుతో ర్యాలీ
బంగాల్లోని దుర్గాపూర్‌లో స్వాతంత్ర్య దినోత్సవాల నేపథ్యంలో సామాజిక మాధ్యమాల్లో ట్రెండ్ అవుతున్న 'రీ క్లెయిమ్ ది నైట్' పేరుతో మహిళలు అర్ధరాత్రి వేళ ఈ నిరసన కార్యక్రమం చేపట్టారు. సెల్‌ఫోన్ లైట్లు వేసి నిరసన ర్యాలీ చేశారు. తమకు న్యాయం చేయాలని నినాదాలు చేస్తూ, మహిళలపై జరుగుతున్న హింసను అరికట్టాలని డిమాండ్ చేశారు. మహిళలకు ఇది మరో కొత్త స్వాతంత్ర్య పోరాటం అనే ప్లకార్డులను ప్రదర్శించారు. వైద్యురాలిపై హత్యాచారం చేసిన హంతకులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. మరోవైపు ఈ ఘటనను నిరసిస్తూ దేశవ్యాప్త ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. కోల్‌కతా సహా పలు నగరాలు, పట్టణ ప్రాంతాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టారు.
#WATCH | West Bengal: Protest held against RG Kar Medical College and Hospital rape-murder incident, in Shyambazar area of Kolkata. pic.twitter.com/TawExhkWtz
— ANI (@ANI) August 14, 2024
ఆస్పత్రి సామాగ్రి ధ్వంసం
కోల్‌కతా ఆర్జీ కర్ ప్రభుత్వాసుపత్రి వద్ద మహిళలు ధర్నా నిర్వహిస్తున్న సమయంలో కొందరు దుండగులు విధ్వంసం సృష్టించారు. ఆస్పత్రి ప్రాంగణంలోకి చొరబడిన దుండగులు అక్కడి సామాగ్రిని ధ్వంసం చేశారు. సుమారు 40 మంది ఆస్పత్రికి సంబంధించి ఆస్తులను ధ్వంసం చేశారని పోలీసులు వివరించారు. అక్కడ భద్రతగా ఉన్న పోలీసులపై రాళ్లు రువ్వారు. పోలీసులు భాష్పవాయు గోళాలను ప్రయోగించి దుండగులను చెదరగొట్టారు. దుండగులు అక్కడే ఉన్న పోలీసు వాహనంతోపాటు కొన్ని ద్విచక్ర వాహనాలను ధ్వంసం చేశారు. ఈ ఘటనలో కొందరు పోలీసు సిబ్బందికి గాయాలయ్యాయి. కోల్‌కతా పోలీసు కమిషనర్ వినీత్ గోయల్ రెండు గంటల సమయంలో ఘటనా స్థలానికి చేరుకొని, అక్కడి పరిస్థితిని పరిశీలించారు. దాడులకు పాల్పడిన వారు ఏ పార్టీవారైనా సరే 24 గంటల్లోగా కఠిన చర్యలు తీసుకోవాలని తృణమూల్ ఎంపీ అభిషేక్ బెనర్జీ పోలీసు కమిషనర్‌ను కోరారు.
VIDEO | Kolkata doctor rape-murder case: Enraged protesters entered the emergency ward of RG Kar Hospital last night and vandalised the property. Morning visuals from the hospital.
— Press Trust of India (@PTI_News) August 15, 2024
(Full video available on PTI Videos - https://t.co/n147TvqRQz) pic.twitter.com/zQUxwReogA
#WATCH | Visuals from RG Kar Medical College and Hospital where a mob enters the campus, vandalised protesting site, vehicles and public property
— ANI (@ANI) August 14, 2024
A protest was being held by the doctors in the campus of RG Kar Medical College and Hospital against the rape-murder of the trainee… pic.twitter.com/yY0bwMj9Zj
#WATCH | West Bengal | Police disperse the mob from RG Kar Medical College and Hospital where a scuffle led to vandalism of the protesting site, vehicles and public property
— ANI (@ANI) August 14, 2024
A protest was being held by the doctors in the campus of RG Kar Medical College and Hospital against the… pic.twitter.com/s64PXztADs
'ఆమె' బాడీలో 150మిల్లీ గ్రాముల వీర్యం! వైద్యురాలిపై గ్యాంగ్ రేప్ జరిగిందా? - Kolkata Doctor Case