ETV Bharat / bharat

రాహుల్​ గాంధీ ప్రత్యర్థిపై 243 క్రిమినల్ కేసులు- కేరళలోనే అత్యధికంగా! - K Surendran Criminal Cases - K SURENDRAN CRIMINAL CASES

K Surendran Criminal Cases : కేరళలోని హై ప్రొఫైల్ వయనాడ్​లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై పోటీ చేస్తున్న ఆ రాష్ట్ర బీజేపీ చీఫ్ సురేంద్రన్​పై 243 క్రిమినల్ కేసులు ఉన్నాయి. దీంతో కేరళలోనే అత్యధికంగా క్రిమినల్​ కేసులు ఉన్న అభ్యర్థిగా సురేంద్రన్ నిలిచారు.

K Surendran Criminal Cases
K Surendran Criminal Cases
author img

By ETV Bharat Telugu Team

Published : Apr 5, 2024, 10:20 AM IST

K Surendran Criminal Cases : కేరళలోని వయనాడ్‌లో రాహుల్‌గాంధీపై పోటీ చేస్తున్న భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అభ్యర్థి కె.సురేంద్రన్‌పై 243 కేసులు ఉన్నాయి. దీంతో కేరళలోనే అత్యధిక క్రిమినల్ కేసులు కలిగిన అభ్యర్థిగా ఆయన నిలిచారు. ఈ కేసుల్లో అత్యధికంగా చట్టవిరుద్ధంగా సమావేశాలు నిర్వహించడం, అల్లర్లు, అధికారులను అడ్డుకోవడం వంటివి ఉన్నాయి. ప్రజా ఆస్తుల విధ్వంసం, నిబంధనలు అతిక్రమించడం, హత్యాయత్నం వంటి కేసులు కూడా సురేంద్రన్‌పై నమోదయ్యాయి.

వీటిలో ఎక్కువ కేసులు 2018, 2019లోనే నమోదయ్యాయి. అప్పట్లో వివాదాస్పదమైన శబరిమల ఆందోళనల్లోనూ సురేంద్రన్‌పై కేసులు నమోదయ్యాయి. 2004 లోక్‌సభ ఎన్నికల్లో కె సురేంద్రన్​పై మూడు కొత్త కేసులు నమోదయ్యాయి. అయితే ఈ కేసుల్లో ఒక్కదాంట్లోనూ సురేంద్రన్‌కు శిక్ష పడలేదు. ఈ మేరకు బుధవారం సురేంద్రన్​ నామినేషన్ వేయగా, అఫిడవిట్​ ద్వారా ఈ కేసుల వివరాలు బయటకు వచ్చాయి.

సురేంద్రన్ దాఖలు చేసిన అఫిడవిట్​ ప్రకారం, ఆయన ఆదాయం 2022-23 సంవత్సరానికి గాను రూ. 2,26,800గా ఉంది. ఆయన వద్ద రూ.15 వేలు నగదు, సురేంద్రన్ భార్య దగ్గర రూ.10 వేల నగదు ఉంది. సురేంద్రన్ బ్యాంకు డిపాజిట్లు మొత్తం రూ.66,455. సురేంద్రన్ వద్ద 10 షేర్లు ఉన్నాయి. ఆయన LIC పాలసీ విలువ రూ.3,25,000. ఆయన వద్ద 8 గ్రాముల బంగారం ఉండగా, సురేంద్రన్ భార్యకు 32 గ్రాముల బంగారు ఉంది. వారి మొత్తం భూమి ఆస్తి అంచనా విలువ రూ. 21,75,000.

సురేంద్రన్‌ 2019 లోక్​సభ ఎన్నికల్లో పత్తనంతిట్ట నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో సురేంద్రన్ కాంగ్రెస్, కమ్యూనిస్టుల తర్వాత మూడో స్థానంలో నిలిచారు. 2016 అసెంబ్లీ ఎన్నికల్లో మంజేశ్వరం నియోజకవర్గం నుంచి పోటీ చేసి కేవలం 89 ఓట్లతో ఓడిపోయారు. 2019 ఉపఎన్నికల్లో కూడా ఓటమిపాలయ్యారు. 2020లో కేరళ బీజేపీ అధ్యక్షుడిగా సురేంద్రన్ నియమితులయ్యారు. శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశానికి వ్యతిరేకంగా చేసిన పోరాటంలో ప్రజలకు బాగా దగ్గరయ్యారు. ఈసారి సీపీఐ తరఫున యానీ రాజా ఇక్కడ పోటీ చేస్తున్నారు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్- వామపక్షాలు ఒకే కూటమిలో ఉన్నప్పటికీ కేరళలో మాత్రం విడివిడిగానే పోటీ చేస్తున్నాయి.

అక్కడ మాజీ సీఎం- ఇక్కడ కేంద్రమంత్రి- లోక్​సభ ఎన్నికలకు జోరుగా నామినేషన్లు - Lok Sabha Polls 2024

99శాతం ఇండిపెండెంట్లకు డిపాజిట్లు గల్లంతు- ఇదీ ఈసీ లెక్క - Independent Candidates deposits

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.