Junior Doctors Rally Kolkata : కోల్‌కతా జూనియర్ వైద్యురాలిపై హత్యాచార ఘటన దేశాన్ని కుదిపేస్తోంది. బాధితురాలికి న్యాయం చేయాలని, నగర సీపీ వినీత్ గోయల్ రాజీనామాకు డిమాండ్ చేస్తూ జూనియర్ డాక్టర్లు లాల్ బజార్‌లోని పోలీస్ హెడ్ క్వార్టర్స్ వద్దకు ధర్నాగా వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే పోలీసులు అప్రమత్తమై వీరిని అడ్డుకున్నారు. దీంతో జూనియర్ డాక్టర్లు బీబీ గంగూలీ వీధిలో గత 12 గంటల నుంచి శాంతియుత నిరసన చేపడుతున్నారు. సోమవారం రాత్రంతా రోడ్డుపైనే గడిపారు. సీపీకి వ్యతిరేకంగా ప్లకార్డులు పట్టుకుని ఆందోళనలు చేస్తున్నారు.
అర కిలోమీటర్ మేర నిరసనకారులు
సోమవారం మధ్యాహ్నం మొదలైన ధర్నా మంగళవారం ఉదయం కూడా కొనసాగుతోంది. వివిధ వైద్య కళాశాలలకు చెందిన జూనియర్ డాక్టర్లు చేపట్టిన ఈ ధర్నాలో సామాన్యులు, ఇతర విద్యా సంస్థల విద్యార్థులు సైతం చేరారు. దీంతో లాల్ బజార్ నుంచి అర కిలోమీటరు దూరంలో ఉన్న బీబీ గంగూలీ వీధి వరకు జనసమూహం ఏర్పడింది. వీరందరూ సోమవారం రాత్రంతా శాంతియుత నిరసన చేపట్టారు. వైద్యులకు రక్షణ కల్పించాలని నినాదాలు చేశారు.
#WATCH | Kolkata, West Bengal: Junior Doctors continue to sit at the protest site in the Lalbazar area. They have been demanding justice for a woman doctor who was raped and murdered at RG Kar Medical College and Hospital on August 9. pic.twitter.com/HZ7mfOxAE2
— ANI (@ANI) September 3, 2024
బారికేడ్లు ఏర్పాటు చేసిన పోలీసులు
కాగా, ధర్నా చేసేందుకు వచ్చినవారికి కట్టడి చేసేందుకు కోల్‌కతా పోలీసులు భారీ బారికేడ్లను ఏర్పాటు చేశారు. అలాగే గొలుసులతో దారిని మూసేశారు. మరోవైపు, జూనియర్ డాక్టర్లు బారికేడ్‌పై ఫొటో, ఎర్ర గులాబీలను ఉంచి నిరసన తెలియజేశారు. "కోల్‌కతా పోలీసులు మమ్మల్ని ఆపడానికి 9 అడుగుల ఎత్తైన బారికేడ్‌ను వేస్తారని మాకు తెలియదు. లాల్ బజార్‌కు చేరుకుని సీపీని కలిసే వరకు మా ఆందోళన కొనసాగుతోంది. అప్పటి వరకు ఇక్కడే కూర్చుంటాం" అని నిరసనల్లో పాల్గొన్న ఓ జూనియర్ వైద్యురాలు తెలిపారు.
కాగా, సీపీ వినీత్ గోయల్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ జూనియర్ డాక్టర్లు సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు కోల్‌కతా పోలీస్ హెడ్ క్వార్టర్స్ కు ర్యాలీగా బయలుదేరారు. ఈ క్రమంలో ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బీబీ గంగూలీ వీధిలో వారిని పోలీసులు అడ్డుకోవడం వల్ల సీపీ దిష్టిబొమ్మను దహనం చేశారు. జూనియర్ డాక్టర్ హత్యాచారం కేసు దర్యాప్తును కలకత్తా హైకోర్టు సీబీఐకి అప్పగించకముందు పోలీసుల విచారణ సరిగ్గా చేయలేదని జూనియర్ డాక్టర్లు ఆరోపిస్తున్నారు. అందుకే సీపీ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
బీజేపీ ఎంపీ మద్దతు
మరోవైపు, జూనియర్ డాక్టర్లు చేపట్టిన ఈ నిరసనలో బీజేపీ ఎంపీ అభిజిత్ గంగోపాధ్యాయ పాల్గొన్నారు. జూనియర్ డాక్టర్లకు మద్దతు తెలిపారు. "కోల్‌కతా పోలీసు కమిషనర్ వచ్చి నిరసన తెలుపుతున్న జూనియర్ వైద్యుల్ని కలవాలి. సీపీ ఎందుకు రావట్లేదు? నిరసన తెలుపుతున్నవారు డాక్టర్లు, పోకిరీలు కాదు. కమిషనర్ డాక్టర్లను ఇంత కాలం ఎందుకు వేచి ఉంచారు?" అని ప్రశ్నించారు.
#WATCH | West Bengal: Slogans of 'Abhijit Ganguly go back' were raised during the protest held by junior doctors over RG Kar Medical College and Hospital rape-murder case, in Kolkata last night.
— ANI (@ANI) September 3, 2024
Slogans were raised when BJP MP Abhijit Gangopadhyay reached the protest site… https://t.co/kMZkm7nHSP pic.twitter.com/mOkUzKv3kY
కోల్‌కతా ఆర్జీ కర్ ఆస్పత్రి మాజీ ప్రిన్సిపల్‌ను అరెస్ట్ చేసిన CBI - CBI Arrests Sandip Ghosh