ETV Bharat / bharat

ఎప్పుడూ చికెన్​ బిర్యానీయేనా? - ఈ సారి పనసకాయ బిర్యానీ ట్రై చేయండి! - టేస్ట్​లో నాన్​వెజ్​ కూడా దిగదిడుపే! - Panasakaya Biryani Making Process

author img

By ETV Bharat Telugu Team

Published : Jul 13, 2024, 4:29 PM IST

Jackfruit Biryani: బిర్యానీ అంటే.. ఎప్పుడూ చికెన్, గుడ్డు, మటన్​తో చేసినవే మాత్రమే గుర్తొస్తాయి. అందుకే ఈ సారి అవేమి కాకుండా.. పనసకాయ బిర్యానీ ట్రై చేయండి! "ఏంటి.. పనసకాయతో బిర్యానీయా" అని ఆశ్చర్యపోతున్నారా? ఒక్కసారి ట్రై చేసి చూడండి. పక్కా నాన్ వెజ్ తరహాలోనే ఉంటుంది.

Jackfruit Biryani
Jackfruit Biryani (ETV Bharat)

Panasakaya Biryani Making Process: బిర్యానీ అంటే అందరికీ నాన్​ వెజ్​ మాత్రమే గుర్తొస్తుంది. కానీ.. పనసకాయతో కూడా అద్దిరిపోయే దమ్ బిర్యానీ తయారు చేయొచ్చని మీకు తెలుసా? పేరుకు వెజిటేరియన్​ వంటకం అయినా.. టేస్ట్​ మాత్రం నాన్​వెజ్​ తరహాలో ఉంటుంది. మరి, ఈ బిర్యానీ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం.

మసాలా పేస్ట్ కోసం..

  • మిరియాలు - 1 టేబుల్​ స్పూన్​
  • యాలకులు - 6
  • లవంగాలు - 6
  • అనాసపువ్వు - 2
  • దాల్చిన చెక్క - 1 ఇంచ్
  • జాపత్రి - 1
  • సోంపు - 1 టేబుల్​ స్పూన్​
  • జీలకర్ర - 1 టేబుల్​ స్పూన్​
  • ధనియాలు - 1 టేబుల్​ స్పూన్​
  • బిర్యానీ ఆకు -1
  • పత్తర్ ఫూల్ - 1
  • అల్లం - 1 ఇంచ్​
  • వెల్లుల్లి - 7

సండే స్పెషల్​ - నోరూరించే ప్రాన్స్​ బిర్యానీ! ఇలా చేశారంటే మళ్లీ మళ్లీ తినడం పక్కా!

బిర్యానీ కోసం..

  • పనసకాయ ముక్కలు - 300 గ్రాములు
  • డబుల్ బీన్స్ - 1 cup
  • 2.5 cups బాస్మతి బియ్యం
  • పనసకాయ ముక్కలు వేపడానికి నూనె - 4 టేబుల్​ స్పూన్లు
  • బిర్యానీకి నూనె - అర కప్పు
  • యాలకులు - 3
  • దాల్చిన చెక్క - 1 ఇంచ్
  • జీలకర్ర - 1 టీస్పూన్​
  • లవంగాలు - 4
  • అనాస పువ్వు - 1
  • సన్నగా కట్​ చేసిన ఉల్లిపాయలు - పావు కేజీ
  • పచ్చిమిర్చి చీలికలు - 4
  • టమాటా ముక్కలు - పావు కప్పు
  • పుదీనా తరుగు - గుప్పెడు
  • కొత్తిమీర తరుగు - గుప్పెడు
  • ఉప్పు - రుచికి సరిపడా
  • పసుపు - అర టీస్పూన్​
  • కారం- సరిపడా
  • నీళ్లు - 50 ml
  • పాలు - అరకప్పు
  • చిలికిన పెరుగు - అరకప్పు
  • వేడి నీళ్లు - 5 కప్పులు
  • నెయ్యి - పావు కప్పు
  • నిమ్మకాయ - 1

తయారీ విధానం:

  • ఉదయం పూట బిర్యానీ చేసుకోవాలనుకుంటే.. డబుల్​ బీన్స్​ను రాత్రంతా నీటిలో నానబెట్టుకోవాలి. సాయంత్రానికి చేసుకుంటే ఉదయం నానబెట్టుకుంటే సరిపోతుంది.
  • ముందుగా బాస్మతి బియ్యాన్ని కడిగి ఓ గంట సేపు నానబెట్టుకోవాలి. అలాగే పనస ముక్కలను కూడా మజ్జిగలో నానబెట్టుకుంటే ముక్కలు నల్లగా మారకుండా ఉంటాయి.
  • ఇప్పుడు స్టవ్​ ఆన్​ చేసి పాన్​ పెట్టి మసాలా పేస్ట్​ కోసం చెప్పిన పదార్థాలు(మిరియాలు, యాలకులు, లవంగాలు, అనాస పువ్వు, దాల్చిన చెక్క, జాపత్రి, సోంపు, జీలకర్ర, ధనియాలు, బిర్యానీ ఆకు) వేసి ఓ రెండు నిమిషాలు వేయించుకోవాలి. ఆ తర్వాత పత్తర్ ఫూల్​ వేసి మంచి వాసన వచ్చేవరకు వేయించుకుని పక్కకు పెట్టుకోవాలి.
  • ఇప్పుడు ఆ మసాలా దినుసులను మిక్సీజార్​లోకి తీసుకుని అందులోకి అల్లం, వెల్లుల్లి వేసి మెత్తని పేస్ట్​ పట్టుకోవాలి.
  • ఇప్పుడు స్టవ్​ ఆన్​ చేసి అదే పాన్​లో 4 టేబుల్​ స్పూన్ల నూనె వేసి వేడి చేసుకోవాలి. అది వేడెక్కాక పనసకాయ ముక్కలు వేసి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేపి తీసి పక్కకు పెట్టుకోవాలి.
  • ఇప్పుడు స్టవ్​ ఆన్​ చేసి అడుగు మందంగా ఉన్న గిన్నె పెట్టి నూనె పోసుకోవాలి. నూనె వేడెక్కాక యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, అనాసపువ్వు, జీలకర్ర వేసి వేపుకోవాలి.
  • ఆ తర్వాత సన్నగా కట్​ చేసిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కొద్దిగా ఉప్పు వేసి ఉల్లిపాయలు పచ్చి వాసన పోయి లైట్​ బ్రౌన్​ కలర్​ వచ్చేంతవరకు వేయించుకోవాలి. ఉల్లిపాయలు మెత్తబడ్డాక నానబెట్టిన డబుల్ బీన్స్ వేసి మెత్తగా అయ్యేదాక ఓ 5 నిమిషాల పాటు వేయించుకోవాలి.
  • ఆ తర్వాత టమాట ముక్కలు, పుదీనా, కొత్తిమీర తరుగు, పసుపు, రుచికి సరిపడా కారం, ఉప్పు, ముందే ప్రిపేర్​ చేసుకున్న మసాలా పేస్ట్, 50 ml నీరు పోసి.. నూనె పైకి తేలేదాక వేయించుకోవాలి.
  • ఇప్పుడు పనసకాయ ముక్కలు వేసి ఓ సారి కలిపి ఆ తర్వాత చిలికిన పెరుగు, పాలు కలుపుకోవాలి. ఆ తర్వాత నిమ్మకాయ రసం వేసి నూనె పైకి తేలేదాకా మూత పెట్టి మగ్గనివ్వాలి.
  • ఓ 5 నిమిషాలు.. అంటే నూనె పైకి తేలిన తర్వాత నానబెట్టిన బాస్మతి బియ్యం వేసి మెతుకు విరగకుండా నెమ్మదిగా మసాలాలు బియ్యానికి పట్టేలా కలుపుకోవాలి.
  • ఆ తర్వాత బియ్యంలో వేడి వేడి నీళ్లు పోసి కలిపి మూతపెట్టి హై ఫ్లేమ్ మీద 10 నిమిషాలు ఉడికించుకోవాలి.
  • 10 నిమిషాల తరువాత బిర్యానీ 80% కుక్ అయిపోతుంది. అప్పుడు నెమ్మదిగా గరిటెతో ఓ సారి కలుపుకోవాలి. ఆ తరువాత నెయ్యి వేసి మూతపెట్టేయాలి.
  • ఇప్పుడు వేరే స్టవ్​ ఆన్​ చేసి దాని మీద అట్ల పెనం పెట్టి, దాని మీద బిర్యానీ గిన్నె ఉంచి స్టవ్​ సిమ్​లో పెట్టి 10 నిమిషాలు ఉడికించుకోవాలి.
  • ఆ తర్వాత స్టవ్ ఆఫ్​ చేసి 30 నిమిషాలు కదపకుండా వదిలేయాలి. అంతే ఎంతో టేస్టీ అయినా పనసకాయ బిర్యానీ రెడీ అయిపోతుంది.
  • ఈ స్పైసీ బిర్యానీ చల్లని రైతాతో చాలా రుచికరంగా ఉంటుంది.

సండే ధమాకా - కీమా బిర్యానీ ఇలా ట్రై చేయండి! అద్దిరిపోద్ది!

సండే ధమాకా.. హైదరాబాదీ బిర్యానీ.. ట్రై చేయండిలా..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.