Hyderabad Style Irani Chai Making Process: హైదరాబాద్‌లో దమ్ బిర్యానీ ఎంత ఫేమసో.. ఘుమఘుమలాడే ప్రత్యేక వాసన, రుచి కలిగి ఉండే ఇరానీ చాయ్ అంతే ఫేమస్. పింగాణీ కప్పు, సాసర్‌లో పొగలు కక్కుతున్న చాయ్ తాగుతుంటే ఆ ఫీలింగ్ వేరే లెవల్. రోజులో ఒక్కసారైనా దీనిని తాగని వారని వేళ్ల మీద లెక్కేసుకోవచ్చు. అంతగా పాపులర్ ఈ చాయ్. అంతేనా మహా నగరానికి వచ్చే పర్యాటకులు, అతిథులు తప్పనిసరిగా చాయ్ రుచి చూస్తారు. నలుగురు స్నేహితులు కలిసి మాట్లాడుకుంటున్నారంటే చేతిలో చాయ్ గ్లాసు ఉండాల్సిందే. మరి ఇంత ఫేమస్ అయిన ఇరానీ చాయ్‌ను ఇంట్లో ఎప్పుడైనా తయారు చేశారా? అబ్బే మాకు రాదంటారా? నో టెన్షన్.. మేము చెప్పే ఈ టిప్స్ పాటిస్తే హోటల్ స్టైల్ పక్కా గ్యారెంటీ! మరి దీనిని ఎలా ప్రిపేర్ చేయాలి? అసలు ఇరానీ చాయ్ వెనక ఉన్న చరిత్ర ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం..
ఇరానీ చాయ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు:
- పాలు - అర లీటర్
- కండెన్స్డ్ మిల్క్ - 1 టేబుల్ స్పూన్
- యాలకుల పొడి పావు టీ స్పూన్
- టీ పొడి - 3 టేబుల్ స్పూన్లు
- పంచదార - 2 టేబుల్ స్పూన్లు
- నీరు - 2 కప్పులు(400 ml)
ఇరానీ చాయ్ తయారీ విధానం:
- ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టి అందులో నీళ్లు, టీ పొడి, పంచదార, యాలకుల పొడి వేసి గిన్నె పై భాగం అంచులను గోధుమపిండి ముద్ద లేదా క్లాత్ తీసుకుని సీల్ చేసి మూత పెట్టి.. మంటను సిమ్‌లో పెట్టి బాగా మరిగించుకోవాలి. ఇలా సీల్ చేయడం వల్ల డికాషన్ మరుగుతున్నప్పుడు ఆవిరి బయటకు వెళ్లకుండా ఉంటుంది. దీంతో చాయ్ చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే చాయ్ టేస్టీగా రావాలంటే చాయ్ పత్తీ కూడా బాగుండాలి. అందుకోసం క్వాలిటీ కలిగిన చాయ్ పత్తీని మాత్రమే ఉపయోగించాలి.
- మరోపక్క ఇంకో స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని పాలు పోసి అందులో కండెన్స్డ్ మిల్క్ వేసి బాగా మరిగించుకోవాలి. సాధారణంగా డికాషన్, పాలను ఎంత ఎక్కువ సేపు మరిగిస్తే ఈ చాయ్ అంత టేస్టీగా ఉంటుంది.
- ఇప్పుడు డికాషన్ రెడీ అయిన తర్వాత దానిని ఎంత కావాలో అంత జల్లెడలో పోసుకోవాలి.
- ఆ తర్వాత టీ గ్లాస్ తీసుకుని అందులో డికాషన్ పోసుకోవాలి. ఆ తర్వాత ఆ డికాషన్‌లో పాలు పోసి తాగితే సరి. ఎంతో ఘుమఘుమలాడే ఇరానీ చాయ్ రెడీ.
టిప్స్ : తీసుకున్న క్వాంటిటీని బట్టి పాలు, డికాషన్ మరిగించుకోవాలి. పైన చెప్పిన వాటిలో డికాషన్‌ను అరగంట సేపు లో-ఫ్లేమ్‌లో పెట్టి మరిగించుకోవాలి. పాలను ఓ 20 నిమిషాలు మరిగించుకోవాలి.
ఇవీ చదవండి:
ఈ టీ తాగితే - 300 ఉన్న షుగర్ కూడా నార్మల్కు రావడం పక్కా!
ఉప్మా అనగానే పిల్లలు విసుక్కుంటున్నారా? - చేసే పద్ధతి మార్చండి - లొట్టలేసుకుంటూ తింటారు!
ఘాటు తక్కువ, ఘుమాయింపు ఎక్కువ - "రెస్టారెంట్ స్టైల్ బటర్ చికెన్" - ఇలా ఈజీగా ప్రిపేర్ చేసుకోండి!