ETV Bharat / bharat

సండే లంచ్​ స్పెషల్​ : గ్రీన్​ మసాలా ఫిష్ ఫై - ఇలా చేస్తే ప్లేట్​ ఖాళీ కావాల్సిందే! - Green Masala Fish Fry

Green Masala Fish Fry: మీకు చేపలు అంటే ఇష్టమా? ఎప్పుడూ ఒకే రకం రెసిపీ స్టైల్​తో బోర్​ కొడుతుందా? అయితే ఈసారి వెరైటీగా ఈ చేపల ఫ్రై ట్రై చేయండి. రుచి అద్దిరిపోవాల్సిందే!

Green Masala Fish Fry Making Process
Green Masala Fish Fry (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : May 12, 2024, 9:27 AM IST

Green Masala Fish Fry Making Process: సండే వచ్చేసింది. చికెన్​, మటన్​, ఫిష్​, ప్రాన్స్​ అంటూ రకరకాలు వండుకుని తింటుంటారు నాన్​వెజ్​ ప్రియులు. అయితే మాంసాహారుల్లో ఫిష్ కర్రీకి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. చేపల పులుసు, ఫ్రై పేరు చెప్పగానే మౌత్ వాటరింగ్ అయిపోతుందంటే నమ్మాల్సిందే. మరి మీరు కూడా ఈ లిస్టులో ఉంటే.. ఈ సండే లంచ్​లోకి మెనూ కార్డ్​లో గ్రీన్​ మసాలా చేపల ఫ్రై చేర్చండి. తయారీ గురించి నో టెన్షన్​. అద్దిరిపోయేలా.. చేపల ఫ్రై ఎలా తయారు చేయాలో క్లారిటీగా మేం చెప్తాం. కరెక్టుగా చేస్తే.. ప్లేట్లు ఖాళీ కావాల్సిందే. మరి, ఈ ఫిష్ ఫ్రై కి కావాల్సిన ఐటమ్స్.. ఇంకా కుకింగ్ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం..

గ్రీన్​ మసాలా ఫిష్​ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు:

  • చేపలు: 1 kg
  • చిన్న ఉల్లిపాయలు - 10
  • పచ్చిమిర్చి - 5
  • కొత్తిమీర - గుప్పెడు
  • పుదీనా - గుప్పెడు
  • అల్లం - 1 చిన్న ముక్క
  • వెల్లుల్లి - 6 రెబ్బలు
  • మిరియాలు - 1/2 టేబుల్​ స్పూన్​
  • జీలకర్ర - 1/2 టీస్పూన్​
  • నిమ్మరసం - 1/2 టీ స్పూన్​
  • కారం - 1 టేబుల్ స్పూన్
  • ఉప్పు - రుచికి సరిపడా
  • కరివేపాకు - 2 రెమ్మలు
  • నూనె - వేయించడానికి సరిపడా

తయారీ విధానం:

  • ముందుగా చేపలను ఉప్పు, నిమ్మకాయ రసం వేసి శుభ్రంగా కడిగి పక్కకు పెట్టుకోవాలి.
  • తర్వాత మిక్సీ జార్​లో చిన్న ఉల్లిపాయలు, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి, మిరియాలు, జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
  • తర్వాత కడిగిన చేప ముక్కలను ఓ గిన్నెలోకి తీసుకుని వాటిపై రుబ్బిన ఉల్లిపాయల పేస్ట్, నిమ్మరసం, కారం పొడి వేసి బాగా కలిపి కనీసం 1 గంట పాటు పక్కకు పెట్టుకోవాలి.
  • గంట తర్వాత స్టౌ మీద నాన్‌ స్టిక్‌ పాన్‌ పెట్టి, అందులో ఫ్రైకి కావల్సినంత నూనె పోసి, వేడయ్యాక కరివేపాకు వేసి, దాని పైన చేప ముక్కను వేసి వేయించాలి.
  • ఒకవైపు వేగాక మరోవైపు తిప్పుకుని ఎర్రగా అయ్యేంతవరకు వేయించుకోవాలి. ఇలా చేప ముక్కలన్నీ వేయించుకుంటే రుచికరమైన గ్రీన్ మసాలా ఫిష్ ఫ్రై రెడీ.

Nellore Chepala Pulusu Recipe in Telugu: నోరూరించే నెల్లూరు చేపల పులుసు.. ఇలా చేశారంటే టేస్ట్​ సూపర్​.. ప్లేటు నాకాల్సిందే..!

బటర్ గార్లిక్ ఫ్రై ఫిష్:

కావాల్సిన పదార్థాలు:

  • చేప ముక్కలు: 1kg
  • మైదా : 2 టేబుల్​ స్పూన్లు,
  • కార్న్ ఫ్లోర్: 2టేబుల్​ స్పూన్లు,
  • వెన్న: 4 టేబుల్​స్పూన్లు,
  • బేకింగ్ పౌడర్: 1టీస్పూన్​
  • వెలుల్లి, కొత్తిమీర తురుము : 4టేబుల్​ స్పూన్​
  • ఉప్పు: రిచికి సరిపడా

తయారీ విధానం:

  • ముందుగా ఓ గిన్నెలోకి వెల్లుల్లి తురుము, ఉప్పు, మైదా, కార్న్ ఫ్లోర్, బేకింగ్ పౌడర్​ను కలపాలి.
  • తర్వాత అందులో కొద్దిగా నీళ్లు పోసి ఈ మిశ్రమాన్ని జారుడుగా కలుపుకోవాలి.
  • ఇప్పుడు ఈ మిశ్రమాన్ని చేప ముక్కలకు పట్టించి కాసేపు, వాటిని పక్కన పెట్టుకోవాలి.
  • అరగంట తర్వాత స్టవ్​ మీద నాన్ స్టిక్ పాన్​ పెట్టి వెన్న వేసి కరిగించాలి.
  • వెన్న కరిగిన తర్వాత అందులో చేప ముక్కలు ఒక్కొక్కటి వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకూ వేయించుకోవాలి.
  • చివరగా కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేసి సర్వ్ చేయాలి. అంతే బటర్ గార్లిక్ ఫ్రైడ్ ఫిష్ రెడీ...

How to Make Chepala Pulusu in Telugu: చేపల పులుసు ఇలా చేశారంటే.. గిన్నె ఊడ్చాల్సిందే..!

నెల్లూరు చేపల పులుసు.. తిన్నారంటే అదుర్స్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.