ETV Bharat / bharat

"అమృత్​ సరి" చికెన్ రెసిపీ - ఈ పంజాబీ స్టైల్​ ​కర్రీ తిన్నారంటే "భల్లే భల్లే" అనాల్సిందే! - Amritsar Chicken Masala - AMRITSAR CHICKEN MASALA

Amritsar Chicken Masala Recipe : నాన్​వెజ్​ ప్రియులు చికెన్​తో ఏ రెసిపీలు చేసినా ఇష్టంగా లాగించేస్తారు. అయితే, ఎప్పుడూ ఒకే స్టైల్లో కాకుండా.. సరికొత్త రెసిపీలు ట్రై చేస్తే మరింతగా ఎంజాయ్ చేయొచ్చు. అందుకే.. ఈ సారి పంజాబీ స్టైల్​ 'అమృత్​ సరి' చికెన్ కర్రీని కుక్ చేయండి. అది ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూద్దాం.

Amritsar Chicken Masala
Amritsar Chicken Masala Recipe (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Aug 5, 2024, 3:16 PM IST

How To Make Amritsar Chicken Masala : ఇంట్లోకి చికెన్​ తీసుకువస్తే.. ఎప్పుడూ పులుసు, ఫ్రై, బిర్యానీ వంటివి చేసుకోవడం మామూలే. నిత్యం ఇవే రెసిపీలు తింటే బోర్​ అనిపిస్తుంది. అందుకే.. మీకోసం సరికొత్త వంటకాన్ని తీసుకొచ్చాం. అదే అమృత్​ సరి చికెన్​ మసాలా కర్రీ. ఈ పంజాబీ స్టైల్​ రెసిపీ చాలా తక్కువ టైమ్​లోనే చేసేయొచ్చు. టేస్ట్​ మాత్రం అస్సలు మర్చిపోరు. అంత బాగుంటుదీ కర్రీ టేస్ట్​. మరి ఈ కర్రీని ఎలా వండాలో ఇప్పుడు చూద్దాం.

అమృత్​ సరి చికెన్​ మసాలా :

  • చికెన్ అరకిలో
  • బటర్- 3 టేబుల్​స్పూన్లు
  • పెరుగు -పావు కప్పు
  • పసుపు -టీస్పూన్
  • అల్లం వెల్లులి పేస్ట్-టేబుల్​స్పూన్​
  • ధనియాలపొడి - టీస్పూన్
  • జీలకర్ర పొడి- టీస్పూన్​
  • గరంమసాలా-టీస్పూన్
  • టమాటాలు-3
  • ఉల్లిపాయలు-2
  • ఆవాల నూనె- 2 టేబుల్​స్పూన్​
  • ఉప్పు-రుచికి సరిపడా
  • కారం- 2 టేబుల్​స్పూన్​
  • కసూరిమేతి-టేబుల్​స్పూన్​

తయారీ విధానం :

  • ముందుగా స్టౌ పై పాన్​ పెట్టి కొద్దిగా ఆవాల నూనె వేసి చికెన్​ వేపుకోవాలి. తర్వాత ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్​, కొద్దిగా కారం, పసుపు వేసి 10 నిమిషాలు చికెన్​ ఉడికించుకోవాలి. తర్వాత చికెన్ ముక్కలను తీసి పక్కన పెట్టుకోవాలి. మీకు పంజాబీ స్టైల్​ చికెన్​ రెసిపీ రుచి రావాలంటే.. ఈ కర్రీకి కచ్చితంగా ఆవాల నూనెను మాత్రమే వాడాలి.
  • ఉడికించుకున్న ముక్కలను ఒక బౌల్​కి తీసుకుని అందులో పెరుగు, కారం, పసుపు, గరం మసాలా, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్​, కసూరి మేతి, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసుకుని బాగా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి.
  • తర్వాత అదే పాన్​లో ఉల్లిపాయ, టమాటా ముక్కలు వేసి మెత్తగా ఉడికించుకోవాలి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్​లో వేసుకుని గ్రైండ్​ చేసుకోవాలి.
  • ఇప్పుడు అదే పాన్​లో కొద్దిగా ఆవాల నూనె వేసి.. కారం, మసాలాలతో మ్యారినేట్​ చేసుకున్న చికెన్​ వేసి వేపుకోవాలి. తర్వాత మూత పెట్టి కొద్దిసేపు ఉడికించుకోవాలి.
  • ఇప్పుడు టమాటా, ఉల్లిపాయల పేస్ట్​ని చికెన్​లో మిక్స్ చేయాలి. అలాగే పెరుగు వేసుకుని బాగా కలుపుకోవాలి.
  • తర్వాత గ్రేవికి సరిపడా కారం, గరం మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి, రుచికి సరిపడా ఉప్పు వేసుకుని కలుపుకోవాలి.
  • ఇందులో బటర్, కొద్దిగా కసూరి మేతి​ వేసుకుని రెండు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. తర్వాత కొద్దిగా కొత్తిమీర చల్లుకుని సర్వ్​ చేసుకుంటే అద్దిరిపోయే పంజాబీ స్టైల్​ చికెన్ మసాలా కర్రీ మీ కళ్ల ముందు ఉంటుంది.
  • నచ్చితే మీరు కూడా ఈ సరికొత్త రెసిపీని ట్రై చేయండి.

ఇవి కూడా చదవండి :

ఘాటు తక్కువ, ఘుమాయింపు ఎక్కువ - "రెస్టారెంట్ స్టైల్ బటర్ చికెన్" - ఇలా ఈజీగా ప్రిపేర్ చేసుకోండి!

రెస్టారెంట్​ స్టైల్​ అపోలో చికెన్​ రెసిపీ - ఈ వర్షాకాలంలో రుచి చూడాల్సిందే గురూ!

ఓ వైపు వర్షం.. మరోవైపు సండే : "అద్దిరిపోయే నాటుకోడి పులుసు" ఇలా ప్రిపేర్ చేయండి! - యమ్మీ యమ్మీగా జుర్రుకోవాల్సిందే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.