How to Avoid Bad Smell From Home: ఇల్లు చూసి.. ఇల్లాలిని చూడాలంటారు పెద్దలు. ఇల్లు శుభ్రంగా ఉంటేనే మనసుకు ప్రశాంతత లభిస్తుంది. అయితే ఇంటిని శుభ్రం చేయడం అంత ఈజీ కాదు. దాని కోసం చాలానే కష్టపడాలి. అయినప్పటికీ.. ఏదో మూల అపరిశుభ్రంగానే ఉంటుంది. అదే సమయంలో ఇంట్లో నుంచి వచ్చే వాసనను వదిలించుకోవడం అందరికీ సాధ్యం కాదు.
అయితే.. ఇంట్లో దుర్వాసన రావడానికి కారణాలు అనేకం. ఇక చాలా మంది ఈ సమస్య నుంచి రిలీఫ్ పొందడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. అయినా కానీ రిజల్ట్ ఉండదు. మరి మీరు కూడా ఇలాంటి సమస్యతో బాధపడుతున్నారా..? అయితే నో టెన్షన్. ఇంట్లో నుంచి వచ్చే దుర్వాసనను పొగొట్టుకోవడానికి కొన్ని టిప్స్ పాటిస్తే సరి. మరి అవేంటో ఈ స్టోరీలో చూద్దాం..
కర్టెన్లు మార్చడం: ఇంట్లో దుర్వాసన రావడానికి కారణాల్లో కార్పెట్లు, కర్టెన్లు ఉంటాయి. చాలా మంది వీటిని రెగ్యులర్‌గా మార్చరు. ఎప్పుడో తీరిక ఉన్నప్పుడు లేకుంటే పండగ సమయంలో వీటి జోలికి పోతారు. దీంతో వాటిపై దుమ్ము, ధూళి చేరి దుర్వాసన వస్తుంది. అలాకాకుండా వీటిని రెగ్యులర్‌గా మార్చడం అలవాటు చేసుకోవాలి.
ఇల్లు తళతళా మెరిసిపోవాలా? కెమికల్ లిక్విడ్స్ వద్దు - ఇంట్లోనే తయారు చేసుకోండిలా!
ఎసెన్షియల్ ఆయిల్: ఎసెన్షియల్ ఆయిల్స్ అనేవి మొక్కల నుంచి తీసేవి. మొక్కల పువ్వులు, ఆకులు, కలప, విత్తనాలు లేదా గింజల నుంచి తీస్తారు. ఎసెన్షియల్ ఆయిల్స్ వాటి ఆహ్లాదకరమైన వాసన, అనేక ఆరోగ్య, సౌందర్య ప్రయోజనాలకు ప్రసిద్ధి చెందాయి. ముఖ్యంగా ఇంటి శుభ్రత విషయంలో ఇవి ఎఫెక్టివ్‌గా పనిచేస్తాయి. ఎసెన్షియల్ ఆయిల్స్ హానికరమైన బ్యాక్టీరియా, వైరస్ ను చంపడంలో సహాయపడతాయి. ఏదైనా మీకు నచ్చిన ఓ ఎసెన్షియల్ ఆయిల్‌ను కొన్ని చుక్కలు తీసుకుని ఓ కప్పు నీటిలో కలుపుకుని వాటిని ఓ స్ప్రే బాటిల్లో పోసుకుని ఇంటి మూలల్లో స్ప్రే చేయాలి. దీంతో ఇంట్లో నుంచి వచ్చే దుర్వాసన పోతుంది.
ఇండోర్ మొక్కలు: ఇండోర్ మొక్కలు కూడా ఇంట్లో నుంచి వాసనను పొగొట్టడానికి ఉపయోగపడతాయి. వీటి ధర కూడా తక్కువే ఉంటుంది. అందుకోసం లావెంజర్, జాస్మిన్, పుదీనా, రోజ్మేరి వంటి మొక్కలను పెంచుకోవచ్చు. దీంతో ఇల్లు సువాసనభరితంగా ఉంటుంది.
వాస్తు ప్రకారం మీ ఇంటిని ఇలా క్లీన్ చేయండి - దోషాలన్నీ తొలగిపోతాయ్!
కొవ్వొత్తులు: ప్రతి ఒక్కరి ఇళ్లల్లో కొవ్వొత్తులు ఉంటాయి. ఇవి మంచి సువాసను వెదజల్లుతాయి. వీటిని ఉపయోగించడం వల్ల ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అనుభవించవచ్చు. అందుకోసం సోయా లేదా కొబ్బరి మైనపుతో చేసిన కొవ్వొత్తులను వాడటం వల్ల ఇల్లు మరింత సువాసనగా ఉంటుంది.
ధూపం స్టిక్స్: ఇవి కూడా అందరి ఇళ్లల్లో ఉంటాయి. వీటిని ఎక్కువగా మతపరమైన కార్యక్రమాలకు ఉపయోగిస్తారు. అయితే.. వీటిని కేవలం వాటి కోసమ మాత్రమే కాకుండా ఇంట్లో దుర్వాసనను పొగొట్టేందుకు కూడా ఉపయోగించవచ్చు. ముఖ్యంగా ఇవి చాలా రకాల సువాసనలలో లభ్యమవుతున్నాయి. అందులో లెమన్‌గ్రాస్, రోజ్, జాస్మిన్ వంటివి ఉపయోగించవచ్చు.. ఈ టిప్స్ పాటిస్తే.. మీ ఇంట్లో ఎలాంటి దుర్వాసనా ఉండదు.
కొత్త ఇల్లు కొనుగోలు చేశారా?- అయితే మీరు తప్పనిసరిగా చేయాల్సిన పనులివే!
మీ ఇంట్లో తరచుగా ప్లంబింగ్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయా? ఈ టిప్స్‌తో ఈజీగా చెక్ పెట్టండి!