High Court Orders Accused To Do Community Service : కర్ణాటక హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. తల్లిని హత్య చేసిన నిందితుడికి ఆరు నెలలు సమాజ సేవ చేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది. ప్రత్యక్ష సాక్షులు లేకపోవడం వల్ల తల్లి మరణ వాంగ్మూలాన్ని నమ్మడం కష్టమని ధర్మాసనం తేల్చింది.
తల్లి హత్య కేసులో..
మడికేరికి తాలూకాలోని సంపాజేకు చెందిన నిందితుడు అనిల్‌పై తల్లి గంగమ్మ(60)ను కొట్టి చంపాడన్న అభియోగం ఉంది. అయితే సరైన సాక్ష్యాధారాలు లేకపోవడం వల్ల ట్రయల్ కోర్టు అతడ్ని నిర్దోషిగా ప్రకటించింది. ఈ తీర్పును సవాలు చేస్తూ కర్ణాటక ప్రభుత్వం హైకోర్టులో అప్పీల్ చేసింది. ఈ కేసును విచారించిన కర్ణాటక హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ కేసులో విచారణ చేపట్టిన జస్టిస్ కేఎస్ ముద్గల్, జస్టిస్ టీజీ శివశంకర్ గౌడ్‌తో కూడిన ధర్మాసనం, నిందితుడికి రూ.10,000 జరిమానా విధించింది. నిందితుడు ఇప్పటికే రెండేళ్ల జైలు శిక్షను అనుభవించడం వల్ల ఆరు నెలల పాటు స్థానిక ప్రభుత్వ పాఠశాలలో సేవ చేయాలని తీర్పు ఇచ్చింది.
అసలేం జరిగిదంటే
కేసు వివరాల్లోకి వెళితే, 2015 ఏప్రిల్ 4న ఈ హత్య జరిగింది. సంపాజేకు చెందిన అనిల్ పని లేకుండా బయట తిరుగుళ్లు తిరుగుతూ మద్యానికి అలవాటు పడటం వల్ల తల్లి అతడిని మందలించింది. పని చేసుకుని బతకమని గట్టిగా చెప్పింది. అప్పటికే మద్యం మత్తులో ఉన్న అనిల్ కోపోద్రిక్తుడై తల్లిపై దాడి చేశాడు. దీంతో ఆమె తీవ్రంగా గాయపడి ఆస్పత్రి పాలయ్యింది. అనంతరం చికిత్స పొందుతూ మరణించింది. ఈ కేసులో అనిల్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. అప్పుడు కొడుగులోని ట్రయల్ కోర్టు అనిల్‌ను నిర్దోషిగా ప్రకటించింది.
మరణ వాంగ్మూలం ఇచ్చినా
అనిల్ తల్లి మరణ వాంగ్మూలంలో కూడా తన కుమారుడే తనను తోసేశాడాని చెప్పింది. అయితే ప్రతక్ష సాక్షులు లేకపోవడం వల్ల మార్చి 2017లో కొడగులోని ట్రయల్ కోర్టు అనిల్‌ను నిర్దోషిగా ప్రకటించింది. అయితే దీన్ని ప్రభుత్వం హైకోర్టులో సవాలు చేసింది.