Hathras Stampede Incident : ఉత్తర్‌ప్రదేశ్ హాథ్రస్‌లో జరిగిన తొక్కిసలాట ఘటనకు నిర్వాహకుల నిర్లక్ష్యమే కారణమని తెలుస్తోంది. వేలాదిగా తరలివచ్చిన భక్తుల సంఖ్యకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేయకపోవటం వల్లనే ఘోరం జరిగినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. చనిపోయినవారి మృతదేహాల గుర్తింపు కొనసాగుతోంది. సికంద్రరావ్ ఆస్పత్రి వద్ద మృతదేహాలు నేలపైనే చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. కొన్నింటిని మంచు దిబ్బలపై ఉంచారు. ఇక స్పృహ కోల్పోయినవారు కూడా మృతదేహాల పక్కనే పడి ఉన్నారు. గాయపడిన వారు ఆస్పత్రి ప్రధాన ద్వారం వద్ద నేలపైనే పడుకుని కనిపించారు. వాళ్ల చుట్టూ బంధువులు ఉన్నారు. ఆస్పత్రిలో సరైన సౌకర్యాలు లేవని, ఆక్సిజన్ కూడా లేదని బంధువులు అంటున్నారు. మృతదేహాల గుర్తింపు కోసం మరి కొన్నింటిని సమీపంలోని ట్రామా సెంటర్, మరికొన్నింటిని ఎటా జిల్లా ప్రభుత్వాస్పత్రిలో భద్రపరిచారు.
VIDEO | Hathras stampede: Visuals from the satsang pandal at Phulrai of UP.
— Press Trust of India (@PTI_News) July 3, 2024
(Full videos available on PTI Videos - https://t.co/n147TvqRQz)#HathrasStampede #HathrasNews pic.twitter.com/vUfIM5QFcd
దర్యాప్తునకు ఆదేశం
హాథ్రస్‌లో జరిగిన తొక్కిసలాట ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. 24గంటల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. ఆగ్రా అదనపు డీజీపీ, అలీగఢ్ డివిజనల్ కమిషనర్ దర్యాప్తు బృందంలో ఉన్నారు. హథ్రాస్‌లో జరిగిన సత్సంగ్ ప్రైవేటు కార్యక్రమమని, సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ అనుమతి ఇచ్చినట్లు జిల్లా మెజిస్ట్రేట్ ఆశీశ్ కుమార్ తెలిపారు. జిల్లా యంత్రాంగం వేదిక వెలుపల భద్రతా ఏర్పాటు చేయగా లోపలి ఏర్పాట్లన్నీ నిర్వాహకులే చేసుకున్నట్లు జిల్లా మెజిస్ట్రేట్ తెలిపారు. సత్సంగ్ నిర్వాహకులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు యూపీ సర్కార్ తెలిపింది.
#WATCH | Uttar Pradesh: Forensic unit along with dog squad at the incident site in Hathras, where a stampede took place yesterday, claiming the lives of 116 people. pic.twitter.com/fOlNtEHdtL
— ANI (@ANI) July 3, 2024
విదేశీ దౌత్యవేత్తల సంతాపం
ఈ ఘటనపై తమిళనాడు గవర్నర్, సీఎం, కేరళ ముఖ్యమంత్రితో పాటు విదేశీ రాయబారులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తొక్కిసలాట ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు కేరళ సీఎం పినరయి విజయన్. అలాగే గాయపడిన వారు తర్వగా కోలుకోవాలని, ఇలాంటి కష్టసమయంలో నష్టపోయిన ప్రజలకు అండగా ఉంటామని తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి, సీఎం స్టాలిన్ అన్నారు. ఇక భారతదేశంలో ఇజ్రాయెల్ దౌత్యవేత్త నౌర్ గిలోన్, చైనా రాయబారి జు ఫీహాంగ్, బ్రిటిష్ హై కమిషనర్ లిండీ కామెరూన్, ఫ్రెంచ్ రాయబారి థియరీ మాథౌ, జర్మన్ దౌత్యవేత్త ఫిలిప్ అకెర్మాన్ ఈ ఘటనలో మరణించిన వారికి సంతాపం తెలిపారు.
Deeply saddened by the tragic stampede in Hathras, Uttar Pradesh, which resulted in several deaths. This incident at a crowded religious event highlights the critical importance of ensuring safety at public gatherings. Our heartfelt condolences go out to the families and friends…
— Pinarayi Vijayan (@pinarayivijayan) July 2, 2024
" deeply anguished by the tragic loss of precious lives in the unfortunate stampede at hathras, uttar pradesh. my deepest condolences to the bereaved families in this hour of grief. prayers for the speedy recovery of the injured." - governor ravi<="" p>— raj bhavan, tamil nadu (@rajbhavan_tn) July 2, 2024
Shocked and saddened about the tragic events in Hathras, UP.
— Xu Feihong (@China_Amb_India) July 2, 2024
Deeply mourn for the lives lost and extend heartfelt sympathies to victims' families. Wish the injured a speedy recovery.
Shocked and saddened to read about the tragic events today in Hathras, UP.
— Lindy Cameron (@Lindy_Cameron) July 2, 2024
My heartfelt condolences to the families of the victims and to all those affected.
అసలేం జరిగిదంటే
మంగళవారం సత్సంగ్ పేరుతో జరిగిన ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి ఉత్తర్‌ప్రదేశ్‌లోని వేర్వేరు జిల్లాలతోపాటు పొరుగు రాష్ట్రాల నుంచి వేల సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. కార్యక్రమం ముగిసిన తర్వాత భోలే బాబా వెళ్లిపోతుండగా భక్తులు ఆయన పాదాలను తాకటానికి పరుగెత్తారు. వేదిక సమీపంలో ఉన్న కాలువ నుంచి నీరుపొంగిపొర్లటంతో రహదారి బురదమయంగా మారింది. దీంతో భక్తులు ఒకరిపై ఒకరు జారిపడటం వల్ల తొక్కిసలాట జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో 116మంది చనిపోగా, వారిలో 108మంది మహిళలు, ఏడుగురు చిన్నారులు, ఓ పురుషుడు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. గాయపడ్డవారి సంఖ్య 100నుంచి 200మంది దాకా ఉండొచ్చని అధికారులు తెలిపారు. తాజాగా ఆస్పత్రిలో చికిత్స పొందతూ మరో ఐదుగురు మరణించినట్లు పేర్కొన్నారు. దీంతో మృతుల సంఖ్య 121కి చేరింది. అయితే వేల సంఖ్యలో భక్తులు హాజరైనప్పటికీ అందుకు తగ్గట్టు ఏర్పాట్లు చేయలేదని సత్సంగ్‌కు హాజరైన భక్తులు కొందరు ఆరోపించారు.