ETV Bharat / bharat

ఇంటెలిజెన్స్‌ బ్యూరో టు బాబా అవతారం- ఎవరీ 'భోలే బాబా'? హాథ్రస్‌ తొక్కిసలాటకు కారణమేంటి? - Hathras stampede - HATHRAS STAMPEDE

Hathras stampede Bhole Baba: ఉత్తర్‌ప్రదేశ్‌లోని హాథ్రస్‌ తొక్కిసలాటలో 121మంది మరణించగా, దాదాపు 100 మందికి పైగా ఆస్పత్రి పాలయ్యారు. అసలేమిటీ ఈ కార్యక్రమం? ఆ భోలే బాబా ఎవరో తెలుసుకుందాం.

Hathras stampede
Hathras stampede (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Jul 3, 2024, 7:38 AM IST

Hathras stampede Bhole Baba : ఉత్తర్‌ప్రదేశ్‌లోని హాథ్రస్‌లో ఓ ఆధ్యాత్మిక కార్యక్రమంలో జరిగిన తొక్కిసలాట తీవ్ర విషాదం నింపింది. ఈ దుర్ఘటనలో 121 మంది ప్రాణాలు కోల్పోగా, అనేక మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఒక బాబా నిర్వహించిన కార్యక్రమానికి భారీ సంఖ్యలో భక్తులు రావడం, పెను విషాదం జరగడం యావత్ దేశాన్ని ఉలిక్కిపాటుకు గురిచేసింది. అసలేమిటీ ఈ కార్యక్రమం? ఆ భోలే బాబా ఎవరూ? తొక్కిసలాటకు కారణం ఏమిటి అనే విషయాలు తెలుసుకుందాం.

ఎవరీ 'భోలే బాబా'?
భోలే బాబా అసలు పేరు నారాయణ్​ సాకార్ హరి. ఉత్తర్​ప్రదేశ్​లోని ఎటా జిల్లా పటియాలి తహసీల్‌లోని బహదూర్‌ గ్రామానికి చెందిన బాబా సాకార్‌ విశ్వ హరి లేదా 'భోలే బాబా'గా ప్రసిద్ధి. బాల్యంలోనే తండ్రితో కలిసి వ్యవసాయం చేసేవాడట. గతంలో ఇంటెలిజెన్స్‌ బ్యూరోలో పనిచేసినట్లు ఈ భోలే బాబా చెప్పుకునేవాడు. 26 ఏళ్ల క్రితమే ఉద్యోగం నుంచి వైదొలిగి, ఆధ్యాత్మిక బాట పట్టినట్లు ప్రచారం చేసుకున్నాడు. తనకు గురువు ఎవరూ లేరని, కేవలం సమాజహిత కోసమే ఈ మార్గాన్ని ఎంచుకున్నట్లు చెబుతుంటాడు.

వేల సంఖ్యలో భక్తులు
ఆ తర్వాత కాలంలోనే వేల సంఖ్యలో భక్తులు భోలే బాబాను అనుసరించడం మొదలు పెట్టారు. అలీగఢ్‌తోపాటు హాథ్రస్‌ జిల్లాల్లో ప్రతి మంగళవారం 'సత్సంగ్‌' పేరుతో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తుంటాడు. ఇందుకు వేల సంఖ్యలో భక్తులు హాజరవుతుంటారు. ఉత్తర్‌ప్రదేశ్‌ కాకుండా ఉత్తరాఖండ్‌, హరియాణా, రాజస్థాన్‌, దిల్లీతోపాటు దేశవ్యాప్తంగా భోలే బాబాకు లక్షల మంది అనుచరులు ఉన్నారు. కార్యక్రమాల నిర్వహణకు వాలంటీర్లు ఉంటారు. కొవిడ్‌ మహమ్మారి సమయంలోనూ భారీ సంఖ్యలో భక్తులు భోలే బాబా కార్యక్రమాలకు హాజరయ్యారు.

ఊపిరాడకే
తాజాగా ఉత్తర్​ప్రదేశ్​లోని ఫుల్‌రాయ్‌ గ్రామంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇందుకు భారీ సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. ఈ క్రమంలో బాబా పాదాల వద్ద ఉన్న మట్టిని తీసుకునేందుకు భక్తులు పోటీపడుతున్న సమయంలో తొక్కిసలాట జరిగినట్లు తెలుస్తోంది. దాంతో ఊపిరాడక అనేక మంది అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయి ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఎక్కువగా మహిళలు, చిన్నారులే ఉన్నారు.

'మీరు అలా చేయడం పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి విరుద్ధం'- స్పీకర్​కు రాహుల్​ లేఖ - Rahul Gandhi Speech In Lok Sabha

రాహుల్‌ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించిన స్పీకర్- ప్రతిపక్షనేత ప్రసంగంపై తీవ్ర దుమారం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.