Haryana Road Accident : హరియాణాలోని రేవారీలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మరణించారు. మరో ఆరుగురు గాయపడ్డారు. పంక్చర్ అయిన కారు టైరు మారుస్తుండగా వేగంగా వచ్చిన మరో వాహనం ఢీకొట్టడం వల్ల జరిగిందీ దుర్ఘటన. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. హుటాహుటిన క్షతగాత్రులను చికిత్స కోసం రేవారీ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం
ధరుహెరా రోడ్డులోని మసాని బస్టాండ్ వద్ద ఇన్నోవా కారు పంక్చర్ అయింది. దీంతో డ్రైవర్ రోడ్డు పక్కన కారు ఆపి టైరు మారుస్తున్నాడు. అప్పుడు కారులో ఉన్న ప్రయాణికులు అక్కడే నిలబడి ఉన్నారు. అంతలో రేవారివైపు నుంచి వస్తున్న ఎస్యూవీ కారు పంక్చర్ అయిన వాహనాన్ని ఢీకొట్టింది. ఆ తర్వాత కారు పక్కనవారిపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మరణించారు. మృతుల్లో నలుగురు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నారు. మృతుల్లో నలుగురు ఉత్తర్‌ప్రదేశ్‌లోని గాజియాబాద్, హిమాచల్‌ప్రదేశ్, హరియాణాకు చెందిన ఒక్కొక్కరు ఉన్నారని పోలీసులు చెప్పారు. మృతులు రాజస్థాన్‌లోని ఖాటూ శ్యామ్ జీ ఆలయ దర్శనం చేసుకుని తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. మృతులను రోష్ని (58), నీలం ( 54), పూనమ్ జైన్ ( 50), శిఖా (40 ), విజయ్ ( 40), సునీల్ (24) గా పోలీసులు గుర్తించారు. ఆదివారం రాత్రి 11గంటల 30 నిమిషాలకు ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు.
Road Accident In Bihar : ఇటీవల బిహార్ కైమూర్ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. బైక్‌ను తప్పించబోయి కంటైనర్‌కు కారు ఢీకొట్టడం వల్ల జరిగిందీ ప్రమాదం. మోహానియా పోలీస్ స్టేషన్ పరిధిలోని జాతీయ రహదారి (ఎన్‌హెచ్-2)లో ఉన్న దేవకాలి సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్నారు. ఎన్‌హెచ్‌ఏఐ టీం సాయంతో మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం దగ్గర్లోని భబువా సదర్ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా, ప్రమాదం కారణంగా జాతీయ రహదారిపై పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
వరుడి ఇంట్లో 'తిలక్' వేడుక- తిరిగివస్తుండగా ప్రమాదం- 'వధువు' కుటుంబంలో ఆరుగురు మృతి
వాటర్‌ఫాల్స్‌కు వెళ్లి వస్తూ అనంతలోకాలకు- లారీ, కారు ఢీకొని ఆరుగురు దుర్మరణం