Mutton Special Dishes: సండే అంటే.. నాన్‌వెజ్ ప్రియులకు పండగ. ముక్క లేనిదే ఆరోజు పూర్తి కాదు. అయితే.. నాన్‌వెజ్ వెరైటీస్ ఎన్ని ఉన్నా.. మటన్ రేంజ్ వేరే. దీనికి ఫ్యాన్స్ ఎక్కువే. అయితే.. ఎప్పుడూ ఒకే విధంగా వండుకుంటే స్పెషల్ ఏముంటుంది? అందుకే.. ఈ సారి ఆకుకూరలు కలిపి కాస్త వెరైటీగా వండేస్తే.. రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం.. మరి దానికి కావాల్సిన పదార్థాలు.. తయారీ విధానం ఈ స్టోరీలో చూద్దాం..
హరియాలీ మటన్ ఫ్రై
Hariyali Mutton Fry:
కావలసిన పదార్థాలు:
- మటన్-అరకేజీ
- పసుపు- అరచెంచా
- ఉప్పు- తగినంత
- ధనియాలపొడి- టేబుల్‌స్పూను
- కారం-తగినంత
- అల్లంవెల్లుల్లి పేస్టు-చెంచా
- పెరుగు-అరకప్పు
- ఉల్లిపాయ తరుగు-కప్పు
- కరివేపాకు-గుప్పెడు
- జీలకర్ర-చెంచా
- సోంపు-టేబుల్‌స్పూను
- లవంగాలు-నాలుగు
- యాలకులు-రెండు
- దాల్చిన చెక్క- చిన్న ముక్క
- నూనె-అరకప్పు
- కొత్తిమీర తరుగు-పావుకప్పు
How to Prepare Methi Mutton Curry : మటన్ ఎప్పుడూ ఒకేలా ఏం తింటారు..? ఈ సండే ఇలా ట్రై చేయండి!
తయారీ విధానం:
- ఓ గిన్నెలో మటన్ ముక్కలు, పసుపు, తగినంత ఉప్పు, ధనియాలపొడి, కారం, అల్లంవెల్లుల్లి పేస్టు, పెరుగు, రెండు చెంచాల నూనె వేసి బాగా కలిపి మూత పెట్టి ఓ అరగంట పాటు పక్కన పెట్టాలి.
- ఇప్పుడు స్టౌ మీద కడాయిని పెట్టి జీలకర్ర, సోంపు, లవంగాలు, యాలకులు, దాల్చినచెక్క, కరివేపాకు వేయించి మిక్సీ జార్లో వేసుకుని మెత్తని పొడి చేసుకోవాలి.
- ఇప్పుడు స్టౌ మీద కుక్కర్ పెట్టి.. అందులో కలిపి పెట్టుకున్న మటన్ ముక్కల్ని వేసుకుని పావు కప్పు నీళ్లు పోసి నాలుగు కూతలు వచ్చేవరకూ ఉడికించుకోవాలి. ఒకవేళ మటన్ ఉడకకపోతే.. మరో రెండు విజిల్స్ వచ్చేవరకు ఉడికించుకోవాలి.
- ఇప్పుడు స్టవ్‌మీద కడాయి పెట్టి నూనె వేసి ఉల్లిపాయ ముక్కల్ని ఎర్రగా వేయించుకుని అందులో ఉడికించిన మటన్ ముక్కలు వేయాలి.
- ఈ కూర ఉడుకుతున్నప్పుడు చేసి పెట్టుకున్న కరివేపాకు పొడి కలిపి.. కూర పొడిపొడిగా అయ్యాక కొత్తిమీర వేసి దింపేయాలి. అంతే ఎంతో రుచికరంగా ఉండే హరియాలీ మటన్ రెడీ..!
How to Prepare Gongura Mutton Curry : గోంగూర మటన్ కర్రీ ఇలా ట్రై చేయండి.. ఎవరైనా ఫిదా అయిపోతారు!
పాలక్ మటన్:
Palak Mutton:
కావలసినవి..
- మటన్- ముప్పావు కేజీ
- ఉల్లిపాయలు- నాలుగు
- అల్లం తరుగు- టేబుల్‌స్పూను
- వెల్లుల్లి తరుగు- టేబుల్‌స్పూను
- పచ్చిమిర్చి- నాలుగు
- పాలకూర తరుగు-రెండు కప్పులు
- టమాట తరుగు- కప్పు
- పెరుగు- అరకప్పు
- జీలకర్రపొడి- చెంచా
- ధనియాలపొడి- రెండు టేబుల్‌స్పూన్లు
- బిర్యానీ ఆకులు- రెండు
- యాలకులు- రెండు
- లవంగాలు-నాలుగు
- జాజికాయపొడి-పావుచెంచా
- నూనె-పావుకప్పు
- ఉప్పు- తగినంత
- వెన్న- రెండు టేబుల్‌స్పూన్లు
How to Prepare Mutton Curry : సండే పండగ.. అద్దిరిపోయే మటన్ కర్రీ.. ఇలా చేయండి!
తయారీ విధానం:
- ముందుగా అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చిని మిక్సీలో మెత్తగా చేసుకుని గిలకొట్టిన పెరుగులో కలపాలి.
- ఇప్పుడు ఓ గిన్నెలో మటన్ ముక్కలు తీసుకుని.. వాటిపైన పచ్చిమిర్చి పేస్ట్, పావుచెంచా జీలకర్రపొడినీ వేసి కలిపి మూత పెట్టాలి.
- అలాగే ఓ గిన్నెలో నీళ్లు, పాలకూర తరుగు, అరచెంచా ఉప్పు వేసి స్టౌ మీద పెట్టి... నీళ్లు మరుగుతున్నప్పుడు దింపేయాలి. ఆ నీటిని వంపేసి పాలకూరను ప్యూరీలా చేసుకోవాలి.
- ఇప్పుడు స్టవ్‌మీద కడాయి పెట్టి నూనె వేసి బిర్యానీ ఆకులు, యాలకులు, లవంగాలు వేయించుకోవాలి.
- ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి వేయించుకొని ధనియాలపొడి, జీలకర్రపొడి వేసి, పావుకప్పు నీళ్లు పోయాలి.
- తరువాత మటన్ ముక్కలు, టమాట తరుగు, తగినంత ఉప్పూ(పాలకూరలో ఇంతకుముందే ఉప్పు వేశాం కాబట్టి చూసుకోవాలి) వేసి మరో కప్పు నీళ్లు పోసి మూత పెట్టాలి.
- మటన్ ఉడికాక పాలకూర గుజ్జు, జాజికాయ పొడి వేసి కలిపి కూర దగ్గరకు అయ్యాక దింపేసి వెన్న వేయాలి.