ETV Bharat / bharat

SBI బ్యాంకులో రూ.13కోట్ల బంగారం దోపిడీ- పక్కా స్కెచ్​తో చోరీ- క్లూ దొరక్కుండా కారం!

కర్ణాటకలోని ఓ ఎస్​బీఐ బ్యాంచ్​లో రూ.12.95కోట్లు విలువైన బంగారు ఆభరణాలు చోరీ- పక్కా ప్లాన్​తో గ్యాస్​ కట్టర్లు ఉపయోగించి దోపిడీ

Gold Theft In Karnataka SBI Bank
Gold Theft In Karnataka SBI Bank (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 29, 2024, 6:17 PM IST

Gold Theft In Karnataka SBI Bank : కర్ణాటకలోని దావణగెరె జిల్లా న్యామతి పట్టణంలోని స్టేట్​ బ్యాంక్​ ఆఫ్ ఇండియా-ఎస్​బీఐ బ్రాంచిలో దాదాపు రూ.12.95 కోట్ల విలువైన బంగారాన్ని దొంగలు దోచుకెళ్లారు. మూడు రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బ్యాంకు కిటికీ ఫ్రేమ్​ను కత్తిరించి బ్యాంకు లోపలికి చొరబడిన దుండగులు బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు. అక్టోబర్ 25 అర్ధరాత్రి ఈ ఘటన జరిగినట్లు పోలీసులు వెల్లడించారు.

ఇదీ జరిగింది
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, శని, ఆదివారాల్లో బ్యాంకుకు రెండు రోజులు సెలవు కావడం వల్ల వారాంతంలో ఈ నేరానికి పాల్పడ్డారు. శని, ఆదివారాల్లో బ్యాంకుకు రెండు రోజులు సెలవు కావడంతో వారాంతంలో ఈ నేరానికి పాల్పడ్డారు. సోమవారం(అక్టోబరు 28) ఉదయం సిబ్బంది బ్యాంకు తలుపులు తెరిచి చూడగా ఘటన వెలుగులోకి వచ్చింది. అక్టోబర్ 25 అర్ధరాత్రి బ్యాంకులోకి ప్రవేశించిన దొంగలు గ్యాస్​ కట్టర్​తో సెక్యూరిటీ గది తలుపులు పగులగొట్టారు. వెంటనే బ్యాంక్‌లోకి చొరబడిన సీసీటీవీ, సైరన్‌ను డిస్‌కనెక్ట్ చేశారు. అనంతరం మూడు సేఫ్​ లాకర్లలో ఒకటైన బంగారు ఆభరణాలు ఉన్న లాకర్​ను గ్యాస్​ కట్టర్​తో కట్​ చేశారు. అందులో ఉన్న రూ.12.95 కోట్లు విలువైన బంగారు ఆభరణాలు చోరీ చేశారు. మిగిలిన రెండు లాకర్లను కట్​ చేసేందుకు ప్రయత్నించారు. అయితే గ్యాస్​ అయిపోయి ఉండవచ్చు, లేదా సమయం మిచిపోయి కుదరలేకపోవచ్చు అని పోలీసులు తెలిపారు. కాగా, ఆ రెండు లాకర్లలోని రూ.30 లక్షలు విలువైన బంగారు ఆభరణాలు భద్రంగా ఉన్నాయని ఎఫ్​ఐఆర్​లో పోలీసులు పేర్కొన్నారు.

ETV Bharat
గ్యాస్​ కట్టర్​తో బ్యాంకు కిటికీ కట్​ చేసిన దుండగులు (ETV Bharat)
ETV Bharat
గ్యాస్​ కట్టర్​తో లాకర్​ కట్​ చేసిన దొంగలు (ETV Bharat)

సీసీటీవీ డీవీఆర్​ చోరీ
బంగారు ఆభరణాలతో పాటు బ్యాంకులోని సీసీ కెమెరా డీవీఆర్‌ను కూడా దొంగలు ఎత్తుకెళ్లారు. దోపిడీ తర్వాత దొంగలు- డాగ్​ స్క్వాడ్​కు అధారాలు దొరకకుండా బ్యాంకులో కారం చల్లారు. ఈ ఘటన స్థలానికి చేరుకున్న ఫోరెన్సిక్ లేబొరేటరీ సిబ్బంది వేలిముద్రల ఆధారాలు సేకరించేందుకు ప్రయత్నించారు. ఈస్ట్ జోన్ డీఐజీ బీ రమేష్, ఎస్​పీ ఉమా ప్రశాంత్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు.

ETV Bharat
చోరీ జరిగిన ఎస్​బీఐ బ్యాంకు బ్రాంచి (ETV Bharat)

ఈ ఘటనపై జిల్లా ఎస్​పీ ఉమా ప్రశాంత్ స్పందించారు. రాత్రివేళల్లో బ్యాంకుకు సెక్యూరిటీ గార్డులను నియమించలేదని తెలిపారు. "పాత సైరన్ విధానానే పాటించారు. బ్యాంకు భద్రతా లోపం కారణంగా ఇలా జరిగింది. ఈ కేసును దర్యాప్తు చేయడానికి ఐదుగురు పోలీస్​ ఇన్​స్పెక్టర్ల నేతృత్వంలో ఐదు బృందాలను ఏర్పాటు చేశాం. 10 మంది పిఎస్‌ఐలు, అనేక మంది సిబ్బందిని నియమించి దర్యాప్తు చేపట్టాం" అని వెల్లడించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.