Ghaziabad Milk Van Viral Video : ఒక్క కాకి చనిపోతే వంద కాకులు చుట్టూ చేరి అరుస్తాయి. ఓ కోతి చనిపోతే మిగతా కోతులు దాని చుట్టు చేరి కనీరు కారుస్తూ ఆ దరిదాపుల్లోకి ఎవ్వరినీ రానివ్వువు. కానీ కొన్ని జంతువులు తమ తోటి జంతువులు చనిపోతే కనీసం స్పందించను కూడా స్పందించవు. అలాంటి జంతువుల నుంచి మనిషిని వేరు చేసేదే ఆ మానవత్వం. మనుషుల్లో అలాంటి మానవత్వం చచ్చిపోయిందని నిరుపించే ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని గాజియాబాద్‌లో ఓ దారుణ ఘటన చోటుచేసుకుంది. దిల్లీ - మేరఠ్ ఎక్స్‌ప్రెస్‌వేపై రెండు వాహనాలు ఢీ కొన్నాయి. ఈ ఘటనలో లారీ డ్రైవర్ మృతి చెందగా, క్లీనర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. అయితే, గాయపడిన వారికి సహాయ పడాల్సిన స్థానికులు మానవత్వాన్ని మరిచారు. ఈ ప్రమాదంలో పాల ట్యాంకర్ నుంచి లీకైన పాలను బాటిళ్లలో పట్టుకుపోయారు. వారి కళ్లముందే మృత దేహం ఉన్నా తమకు పట్టనట్లుగా వ్యవహించారు. ఈ దారుణ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. యూపీలో జరిగిన ఈ ఘటనపై స్థానికులు వ్యవహరించిన తీరుపట్ల సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి.
Extremely Shameful !!
— Ashwini Shrivastava (@AshwiniSahaya) August 6, 2024
A milk tanker driver lost his life in a road accident, while the crowd busied themselves looting the milk in Ghaziabad, Uttarpradesh
Last week, near Lalkuan in Ghaziabad, a truck carrying cold drinks met with an accident. At the scene, a man was seen… pic.twitter.com/h0fO9Zfi5c
వివరాల్లోకి వెళితే : గాజియాబాద్‌లో మంగళవారం మేరఠ్ ఎక్స్‌ప్రెస్‌వేపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ పాల ట్యాంకర్‌ను వెనక నుంచి వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఝార్ఖండ్‌కు చెందిన లారీ డ్రైవర్ ప్రేమ్ సాగర్ (45) అనే వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందారు. లారీ క్లీనర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. మేరఠ్ వెళ్తుండగా దిల్లీ-మేరఠ్ ఎక్స్‌ప్రెస్‌వేపై ఏబీఈఎస్ కాలేజ్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది.
ప్రమాద ఘటనలో లారీ నుజ్జనుజ్జయ్యింది. పాల ట్యాంకర్ సైతం దెబ్బతినడంతో పాలు బయటకు వచ్చాయి. దీనిని గమనించిన స్థానికులు పాత్రలు, బాటిళ్లలో నింపే పనిలో పడ్డారు. అక్కడే పడి ఉన్న డ్రైవర్ మృతదేహాన్ని గానీ, గాయపడిన క్లీనర్‌నుగానీ ఎవరూ పట్టించుకోలేదు. దీన్ని ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయటంతో అది వైరలైంది. స్థానికులు వ్యవహరించిన తీరుపై నెటిజన్లు పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తున్నారు. మానవత్వం మరిచారంటూ తీవ్ర స్థాయిలో దుమ్మెత్తి పోస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ సారథిగా మహమ్మద్ యూనస్ - Yunus as head of Bangladesh govt