ETV Bharat / bharat

ఎన్నికల కోసం 60+ఏజ్​లో పెళ్లి- లాలూ ప్రసాద్​ కోరికను కాదనలేకపోయిన మాజీ గ్యాంగ్​స్టర్​! - Ashok Mahato Got Married

Gangster Ashok Mahato Got Married : లోక్​సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఏకంగా 60 ఏళ్ల వయసులో వివాహం చేసుకున్నాడు ఓ మాజీ గ్యాంగ్​స్టర్. అదేంటి పెళ్లికి, ఎన్నికల్లో పోటీకి ఏంటి సంబంధం అనుకుంటున్నారా? తెలియాలంటే ఈ వార్త చదవాల్సిందే.

Gangster Ashok Mahato Got Married
Gangster Ashok Mahato Got Married
author img

By ETV Bharat Telugu Team

Published : Mar 20, 2024, 4:14 PM IST

అతడో కరుడుగట్టిన మాజీ గ్యాంగ్​స్టర్​​. వయసు 60 ఏళ్లు. ఓ మర్డర్​ కేసులో 17 ఏళ్లు జైలు శిక్ష అనుభవించి గతేడాదే విడుదలయ్యాడు. ఇదంతా బాగానే ఉన్నా ప్రస్తుతం అతడు మళ్లీ వార్తల్లో నిలిచాడు. వచ్చే లోక్​సభ ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నాడు. అందుకోసం అతడికి వయసుతో పాటు చట్టపరంగా ఉన్న కొన్ని పరిమితులు అడ్డంకిగా మారాయి. దీంతో ప్రత్యక్షంగా ఎన్నికల్లో పోటీ చేయలేకపోతున్నాడు. దీంతో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్​ యాదవ్ సలహా మేరకు ఓ మహిళను వివాహం చేసుకున్నాడు. ఇప్పుడు తన భార్యను సదరు పార్టీ తరఫున ఎన్నికల బరిలోకి దింపబోతున్నాడు.

ఎవరీ అశోక్​ మహతో?
Gangster Ashok Mahato Got Married : నవాడా జిల్లాలోని కోనన్‌పుర్​ గ్రామానికి చెందిన అశోక్​ మహతో ఓ మాజీ గ్యాంగ్​స్టర్​. షేక్‌పురా జేడీయూ ఎమ్మెల్యే రణధీర్​ కుమార్ సోనీపై హత్యాయత్నం ఆరోపణలతో పాటు నవాడా జైల్​ బ్రేక్​ కేసులో నేరస్థుడిగా 17 ఏళ్ల పాటు జైలులో శిక్ష అనుభవించాడు. 2023లో జైలు నుంచి బయటకు వచ్చాడు. మరోవైపు 2005లో జరిగిన ఎంపీ రాజో సింగ్​ హత్యతో కూడా అశోక్​ మహతో గ్యాంగ్​కు సంబంధాలు ఉన్నట్లు పోలీసులు తేల్చారు.

లాలూకా ప్లాన్​!
అయితే గ్యాంగ్​స్టర్ అశోక్​ మహతో పట్నా భక్తియార్‌పుర్‌లోని కరౌటా జగదాంబ ఆలయంలో ఓ మహిళను మంగళవారం రాత్రి తన మద్దతుదారుల సాయంతో వివాహం చేసుకున్నాడు. ముంగేర్‌ బరియార్‌పూర్​ గ్రామానికి చెందిన ఈమె ఇంతకుముందు దిల్లీలో పని చేసేది. ఇక తన భార్యను ముంగేర్​ లోక్‌సభ స్థానం నుంచి రాష్ట్రీయ జనతాదళ్​- ఆర్జేడీ అభ్యర్థిగా పోటీలోకి దింపబోతున్నట్లు సమాచారం. అయితే ఇదంతా ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్​ యాదవ్​ సలహాలు, సూచనల మేరకే జరుగుతున్నట్లు తెలుస్తోంది.

జేడీయూ సిట్టింగ్​ ఎంపీతో 'ఢీ'!
కుష్వాహ సామాజిక వర్గానికి చెందిన అశోక్​ మహతోకు ఆర్జేడీతో ముఖ్యంగా ఆ పార్టీ అధ్యక్షుడు లాలూతో మంచి సంబంధాలు ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. అందుకనే ఆయన సూచనల మేరకు అశోక్​ ఈ వయసులో పెళ్లి చేసుకొని మరీ తన భార్యను ముంగేర్​ పార్లమెంట్​ స్థానం నుంచి ఆర్జేడీ తరఫున పోటీకి సిద్ధం చేస్తున్నాడు. ఈ మేరకు సిద్ధం అవ్వాలని ఇప్పటికే లాలూ అశోక్​ను కోరినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇక ఇదే స్థానం నుంచి ప్రస్తుత ఎంపీ, జేడీయూ నేత లాలన్ సింగ్​ పోటీ చేస్తున్నారు.

ఎండాకాలంలో ఎన్నికల వేడి- ఎలక్షన్లు వేసవిలోనే ఎందుకు?

'58ఏళ్ల వయసులో ఆమె తల్లి ఎలా అయ్యారు?!'- రాష్ట్ర సర్కార్​ నుంచి నివేదిక కోరిన కేంద్రం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.