Furniture Cleaning Tips: ఇంట్లోని ఫర్నిచర్‌ను ఎంతో ఇష్టంతో కొనుక్కుంటాం. ఇంటికి తగ్గట్టు సోఫాలు, టేబుళ్లు, డైనింగ్ టేబుల్, డ్రెస్సింగ్ టేబుల్, దివాన్‌లు వేసి అందంగా, నీట్‌గా సర్దుకుంటాం. కాగా, రోజులు గడిచే కొద్దీ.. వాటిపై దుమ్మ, జిడ్డుపట్టి నల్లగా మారుతుంటాయి. ఇక ఇంట్లో పిల్లలు ఉంటే.. ఫర్నీచర్ రూపురేఖలు గురించి చెప్పక్కర్లేదు. ఇంట్లోని ఫర్నిచర్‌నే బ్లాక్‌బోర్డుగా మార్చేస్తూ ఉంటారు. ఇక ఫర్నీచర్‌పై ఉన్న మరకలు పోగొట్టాలని ట్రై చేస్తే.. కొన్ని సందర్భాల్లో వాటి మెరుపు తగ్గిపోతూ ఉంటుంది. ఈ క్రమంలోనే ఇంట్లోని ఫర్నిచర్‌ను తిరిగి మెరిపించడానికి కొన్ని సులభమైన పద్ధతులు ఉన్నాయి. అవేంటో ఈ స్టోరీలో చూద్దాం.
టూత్‌పేస్ట్: సాధారణంగా డైనింగ్ టేబుల్ మీద గిన్నెలు, గ్లాసులు పెట్టడం వల్ల నీటి మరకలు ఏర్పడతాయి. వీటిని తొలగించడానికి టూత్‌పేస్ట్‌ను ఉపయోగిస్తే సరిపోతుంది. అందుకు గాను కొద్దిగా టూత్‌పేస్టుని తీసుకుని దానిని నీటితో పలుచగా అయ్యేలా కలపాలి. దీనిని మరకపై రాసి కొన్ని నిమిషాల తర్వాత మెత్తని క్లాత్‌తో తుడిచేయాలి. ఈ చిట్కాని ఉపయోగించి కేవలం డైనింగ్ టేబుల్ పైనే కాదు.. కిటికీలు, తలుపులపై పడిన నీటి చుక్కల మరకల్ని కూడా ఈజీగా రిమూవ్ చేయవచ్చు.
ఫర్నిచర్ వ్యాక్స్: సాధారణంగా ఫర్నిచర్‌పై ఏర్పడే మరకలు నీటి వల్లే ఏర్పడతాయి. కాబట్టి వాటిని ఈజీగా రిమూవ్ చేయడానికి ఫర్నిచర్ వ్యాక్స్‌ని ఉపయోగించవచ్చు. కొద్దిగా ఫర్నిచర్ వ్యాక్స్‌ని తీసుకొని మరకపై రాసి మెత్తని టవల్‌తో క్లీన్ చేయాలి. అప్పటికీ మరక వదలకపోతే.. మినరల్ స్పిరిట్‌లో ముంచిన మెత్తని వస్త్రంతో తుడిస్తే మరకలు వదులుతాయి.
సింక్‌లో నీళ్లు నిలిచిపోయాయా ? ఈ టిప్స్ పాటిస్తే ప్రాబ్లం సాల్వ్!
టూత్‌పేస్ట్, బేకింగ్ సోడా: చిన్న పిల్లలు ఉన్న ఇంట్లో ఫర్నీచర్‌పై ఇంక్ మరకలు పడటం కామన్. అయితే ఈ మరకులు త్వరగా వదలవు. వీటిని తొలగించుకోవడానికి.. టూత్ పేస్ట్, బేకింగ్ సోడా బాగా హెల్ప్ చేస్తాయి. మరకలు ఉన్న చోట.. టూత్ పేస్ట్, బేకింగ్ సోడా కలిపిన మిశ్రమాన్ని రాసి.. బ్రష్‌తో స్మూత్‌గా రుద్ది.. ఆపై మెత్తని క్లాత్ తీసుకుని తుడిచేస్తే.. మొండి మరకలు త్వరగా వదులుతాయి.
లిక్విడ్ బ్లీచ్: చెక్కతో చేసిన ఫర్నిచర్‌పై ఏర్పడిన ఎలాంటి మరకనైనా లిక్విడ్ బ్లీచ్‌తో సులభంగా తొలగించవచ్చు. టూత్‌బ్రష్‌ను లిక్విడ్ బ్లీచ్‌లో ముంచి మరకపై సున్నితంగా రుద్దాలి. కొద్ది సమయం తర్వాత మెత్తటి పొడి వస్త్రంతో తుడిచేస్తే మరక ఈజీగా పోతుంది.
ఇవి కూడా ట్రై చేయండి:
- అరచెంచా వెనిగర్‌ని ఒక కప్పు చల్లటి నీటిలో కలపాలి. ఈ మిశ్రమంలో ఓ క్లాత్ ముంచి మరకపై తుడిస్తే క్లీన్ అవుతుంది..
- గోరువెచ్చని నీటిలో సబ్బు కలిపి తుడిచినా మరకలు చాలా వరకు పోతాయి.
- కొద్దిమొత్తంలో ఉప్పు తీసుకొని ఆలివ్ ఆయిల్‌తో ముద్దలా కలుపుకోవాలి. ఈ పేస్ట్‌ను మరకపై రాసి కొద్ది సమయం తర్వాత తుడిచేయాలి.
కొద్దిగా పెట్రోలియం జెల్లీని మరకపై రాసి తర్వాతి రోజు క్లాత్‌తో తుడిస్తే మరక వదిలిపోతుంది.
ఈ టిప్స్ పాటిస్తే - స్టెయిన్లెస్ స్టీల్ గృహోపకరణాలకు మెరుపు గ్యారంటీ!
రాగి పాత్రలు సీల్ తీసిన వాటిలా మెరిసిపోవాలా? - ఇలా చేయండి!
How to Get Rid of Smell in Bathroom : ఈ టిప్స్ పాటించండి.. మీ బాత్రూమ్ దుర్వాసనొస్తే అడగండి..!