ETV Bharat / bharat

బాలుడి గొంతులోకి 'చేప'- కండీషన్ సీరియస్! - Fish Struck In Boy Throat

author img

By ETV Bharat Telugu Team

Published : Mar 29, 2024, 7:41 PM IST

Fish Struck In Boy Throat : చెరువులో స్నానం చేసేందుకు దిగిన బాలుడి గొంతులోకి చేప వెళ్లి ఇరుక్కుపోయింది. కొంతసేపటికే ఆ బాలుడి పరిస్థితి విషమించగా ఆస్పత్రికి తరలించారు. చివరకు ఏమైందంటే?

Fish Struck In Boy Throat
Fish Struck In Boy Throat

Fish Struck In Boy Throat : ఛత్తీస్​గఢ్​లోని జాంజ్​గీర్ చాంపా జిల్లాలో 14 ఏళ్ల బాలుడి గొంతులో చేప ఇరుక్కుపోయింది. చెరువులో స్నానం చేసేందుకు వెళ్లిన బాలుడి నోటిలోకి ప్రమాదవశాత్తు దూరిన చేప గొంతులో అడ్డంగా చిక్కుకుపోయింది. విషయం తెలుసుకున్న స్థానికులు చేపను బయటకు తీసేందుకు విఫలయత్నం చేశారు. ఆ తర్వాత అంబులెన్స్​లో ఆస్పత్రికి తరలించారు.

అసలేం విషయమేమిటంటే?
జిల్లాలోని అకల్తరా పోలీస్​స్టేషన్ పరిధి కరుమహు గ్రామానికి చెందిన సమీర్ గోడ్ స్నానం చేసేందుకు శుక్రవారం ఉదయం చెరువుకు వెళ్లాడు. స్నానం చేస్తుండగా ఒక్కసారి ఓ చిన్న చేప సమీర్ నోటిలోకి ప్రవేశించి గొంతులో ఇరుక్కుపోయింది. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు చిన్నారి నోటి నుంచి చేపను బయటకు తీసేందుకు ప్రయత్నం చేశారు. కానీ బయటకు తీయలేకపోయారు.

వెంటనే అంబులెన్స్​కు ఫోన్​ చేసి అకల్తరా కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు బాలుడి గొంతులో ఇరుకున్న చేపను బయటకు తీయాలని ప్రయత్నం చేసి విఫలమయ్యారు. ఆ తర్వాత అతికష్టం మీద సగం చేపను బయటకు తీశారు. బాలుడి ఆరోగ్య పరిస్థితి విషయమించడం వల్ల బిలాస్​ పుర్​లో ఉన్న సిమ్స్​ ఆస్పత్రికి రిఫర్ చేశారు. ఆ తర్వాత చిన్నారిని అతడి కుటుంబసభ్యులు అక్కడికి తరలించారు.

ముందస్తు సమాచారంతో సిమ్స్ వైద్యులు చికిత్స కోసం అన్ని ఏర్పాట్లు చేశారు. బాలుడు చేరుకున్న వెంటనే చికిత్స ప్రారంభించారు. చిన్నారి మెడ దగ్గర చిన్న రంధ్రం చేసి చేపను విజయవంతంగా బయటకు తీశారు. ఆ తర్వాత అబ్జర్వేషన్‌లో ఉంచారు. బాలుడి గొంతు నుంచి 8 సెంటీమీటర్ల చేపను బయటకు తీశామని డాక్టర్ రామ్ కృష్ణ కశ్యప్ తెలిపారు. సిమ్స్​ వైద్యులకు సమీర్ కుటుంబసభ్యులు కృతజ్ఞతలు చెప్పారు.

ఇటీవల ఉత్తర్​ప్రదేశ్​ గోండా జిల్లాకు చెందిన ఓ యువకుడు పళ్లు తోముకున్న తర్వాత ప్రమాదవశాత్తు స్టీల్​ టంగ్​ క్లీనర్​ మింగేశాడు. దీంతో అది గొంతులో ఇరుక్కుపోయింది. అనంతరం ఆ యువకుడికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది మొదలైంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే ఈ లింక్​పై క్లిక్ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.