Fire In Train Compartment In Haryana : రైలు బోగీలో ప్రమాదవశాత్తు మంటలు వ్యాపించి మూడు సిలిండర్లు పేలాయి. దీంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ఘటన హరియాణాలోని అంబాలా సిటీ రైల్వే స్టేషన్లో జరిగింది. బోగీ నుంచి ఒక్కసారిగా మంటలు రావడం వల్ల స్థానికంగా గందరగోళ పరిస్థితి ఏర్పడింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది చాలా సేపు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.
-
VIDEO | A fire broke out in a compartment of a passenger train near Ambala Cantt. railway station earlier today. pic.twitter.com/G1Drn6nYnp
— Press Trust of India (@PTI_News) March 16, 2024
అంబాలా సిటీ రైల్వే స్టేషన్లో సమీపంలో ఉన్న రైలు బోగీ నిలిపి ఉంది. దానిని రైల్వే ఉద్యోగుల కోసం కేటాయించారు. అయితే రైల్వే సిబ్బంది వంట వండుతున్న సమయంలో మంటలు వ్యాపించాయి. దీంతో అందులో ఉన్న మూడు సిలిండర్లలో ఒకటి పేలింది. ఆ తర్వాత మిగతా రెండు కూడా పేలిపోయాయి. దీంతో బోగీలో భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంపై గురించి తెలుసుకున్న స్టేషన్ మాస్టర్ వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్న ఫైర్ సిబ్బంది దాదాపు గంటసేపు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు తెలిపారు.
రైలు బోగీలో మంటలు- 10మంది మృతి
ఇలాంటి ఘటనే గతేడాది ఆగస్టులో జరిగింది. తమిళనాడులోని మదురై రైల్వే స్టేషన్ వద్ద ఆగి ఉన్న రైలులో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 10 మంది పర్యటకులు మృతి చెందారు. దాదాపు 20 మందికి పైగా గాయపడ్డారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, దక్షిణాదిలో ఆధ్యాత్మిక దర్శనం కోసం ఉత్తర్‌ప్రదేశ్‌లోని లఖ్‌నవూ నుంచి ఆగస్టు 17న ఓ టూరిస్ట్ రైలు బయలుదేరింది. అందులో 60 మందికి పైగా యాత్రికులు తమిళనాడు నాగర్‌కోయిల్‌లోని పద్మనాభ స్వామి ఆలయంలో దర్శనం చేసుకుని రైలులో మదురై చేరుకున్నారు. అయితే ఆ రైలు మదురై రైల్వే స్టేషన్‌కు ఒక కిలో మీటరు దూరంలో నిలిచిపోయింది. ఈ క్రమంలో తమతో పాటు తెచ్చుకున్న సిలిండర్‌ను ఉపయోగించి టీ తయారు చేసుకుందామనుకున్నారు. అయితే టీ చేసుకునే ప్రయత్నంలో సిలిండర్ పేలి మంటలు చెలరేగాయి. వెంటనే ఆ మంటలు రెండు కోచ్‌లకు వ్యాపించాయి. మంటలు చెలరేగిన వెంటనే కొంతమంది ప్రయాణికులు అప్రమత్తమై కిందకు దిగారు. అయితే కొందరు అందులోనే చిక్కుకుపోయి మరణించారు. పూర్తి కథనం కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి
Fire In Express Train : ఎక్స్‌ప్రెస్ రైలులో ఒక్కసారిగా మంటలు.. బెంగళూరు స్టేషన్లోనే..
కాజీపేట రైల్వే స్టేషన్ యార్డులో అగ్ని ప్రమాదం - కాలి బూడిదైన బోగీ