ETV Bharat / bharat

40 రోజుల్లో అతడ్ని ఏడు సార్లు కరిచిన పాము- ఇంకో రెండు సార్లు అలానే జరుగుతుందట! - Man Bitten by Snake 7th Time

author img

By ETV Bharat Telugu Team

Published : Jul 12, 2024, 3:00 PM IST

Man Bitten by Snake 7th Time in 40 Days : ఉత్తర్​ప్రదేశ్​లోని ఫతేపుర్​లో వింత ఘటన జరిగింది. 40 రోజుల వ్యవధిలో ఏడు సార్లు పాము కాటుకు గురయ్యాడు ఓ యువకుడు. మొత్తం తొమ్మిది సార్లు పాము కాటుకు గురవుతానని కలలో వచ్చినట్లు వాపోయాడు.

Man Bitten by Snake 7th Time in 40 Days
Man Bitten by Snake 7th Time in 40 Days (ANI)

Man Bitten by Snake 7th Time in 40 Days : 40 రోజుల వ్యవధిలో ఏడు సార్లు పాము కాటుకు గురయ్యాడు ఓ యువకుడు. ఇంకా రెండు సార్లు సైతం పాము తనను కాటు వేస్తుందని కలలో వచ్చిందని తెలిపాడు. 9వసారి కాటు వేసిన తర్వాత ఎవరూ కాపాడలేరని చెప్పాడు. ఈ వింత ఘటన ఉత్తర్​ప్రదేశ్​లోని ఫతేపుర్​లో జరిగింది.

ఇదీ జరిగింది
మాల్వా​ పోలీస్ స్టేషన్ పరిధిలోని సౌరా గ్రామానికి చెందిన వికాస్ ద్విదేది అనే యువకుడు సుమారు 40 రోజుల వ్యవధిలోనే ఏడుసార్లు పాము కాటుకు గురయ్యాడు. ప్రస్తుతం వికాస్​ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతడి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. అయితే, ఇటీవల ఆరోసారి కాటు వేయగా వికాస్​ ఆశ్చర్యపోయే విషయం బయటపెట్టాడు. తనకు వచ్చిన ఓ కల గురించి కుటుంబసభ్యులకు చెప్పాడు. తనను కలలో ఒకే పాము 9 సార్లు కాటు వేసిందని, చివరిసారి తనను ఎవరూ కాపాడలేరని వచ్చినట్లు వికాస్​ వివరించాడు. ఎలాంటి చికిత్స అందించినా సరే 9వ సారి పాము కాటు నుంచి తనను ఎవరూ రక్షించలేరని తెలిపాడు. తనను ప్రతి సారి ఆడ పాము కాటు వేస్తుందని, అది కూడా శని లేదా ఆదివారాల్లో మాత్రమే వేస్తుందని చెప్పాడు. ఏదో హాని జరగబోతుందంటూ వికాస్​ భయపడుతున్నాడని కుటుంబసభ్యులు తెలిపారు. మరోవైపు వికాస్​కు చికిత్స అందించిన వైద్యులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. వరుసగా వికాస్​ను మాత్రమే పాములు ఎందుకు కాటు వేస్తున్నాయో అనే విషయం అర్థం కావడం లేదని తెలిపారు.

ఒకే ఇంట్లో 150 నాగుపాములు
150 Cobra Snakes Video : ఉత్తర్​ప్రదేశ్​లోని ఖుషీనగర్ జిల్లాలో​ ఒకే ఇంట్లో 150 పాములు కనిపించడం కలకలం రేపింది. గంగారాణి గ్రామానికి చెందిన ఫుల్బాదన్ ఇంట్లో ఈ పాములు బయటపడ్డాయి. దాదాపు 16 గంటలపాటు శ్రమించి సుశీల్ మిశ్రా అనే వ్యక్తి ఇంట్లో నుంచి పాములను సురక్షితంగా బయటకు తీశాడు. ఈ దృశ్యాలను వీడియో తీశారు. ఈ వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

పాములు కాటేసే ముందు ఏం చేస్తాయో తెలుసా? - అప్పుడు మనుషులు ఏం చేయాలి?

హాయిగా నిద్రిస్తున్న చిన్నారికి పాము కాటు - ఆరు రోజులు ప్రాణాలతో పోరాడి చివరకు?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.