ETV Bharat / bharat

ఈతకు వెళ్లి ఒకే కుటుంబంలో ఏడుగురు మృతి- రోజు గడిచినా దొరకని ఆచూకీ - Family Drowned In Narmada River - FAMILY DROWNED IN NARMADA RIVER

Family Drowned In Narmada River : నర్మదా నదిలో మునిగి ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన గుజరాత్​లో జరిగింది.

Family Drowned In Narmada River
Family Drowned In Narmada River (ANI)
author img

By ETV Bharat Telugu Team

Published : May 15, 2024, 11:36 AM IST

Updated : May 15, 2024, 1:40 PM IST

Family Drowned In Narmada River : గుజరాత్​లోని నర్మదా నదిలో మునిగి ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మరణించారు. వీరందరూ స్నానానికి వెళ్లగా ఈ దుర్ఘటన జరిగింది. మృతుల్లో చిన్నారులు సైతం ఉన్నారు. నీట మునిగిన వారి కోసం నేషనల్ డిజాస్టర్ రెస్క్యూ ఫోర్స్ (ఎన్ డీఆర్ ఎఫ్), వడోదర అగ్నిమాపక బృందం వెతుకుతోంది. రోజు గడిచినా ఇంకా వారి ఆచూకీ దొరకడం లేదు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం
నర్మదా నదిలో స్నానానికి దిగిన ఏడుగురు నదీ ప్రవాహంలో కొట్టుకుపోయారని పోలీసులు తెలిపారు. బాధితులు సూరత్ నుంచి నర్మదా జిల్లాలోని పోయిచా వద్దకు వచ్చిన బృందంలో భాగమని పేర్కొన్నారు. మంగళవారం ఉదయం ఏడుగురు ఈత కొట్టేందుకు నర్మదా నదిలో దిగారని, అయితే వారంతా నీటి ప్రవాహంలో కొట్టుకుపోయారని తెలిపారు. వారి కోసం ముమ్మరంగా గాలిస్తున్నామని చెప్పారు.

కాగా, నర్మదా నదిలోని పోయిచా ప్రాంతాన్ని వేసవిలో పిక్నిక్ స్పాట్​గా నిలిచింది. ఇక్కడ ఈత కొట్టడానికి ఎక్కువ మంది పర్యటకులు వస్తారు. నర్మదా జిల్లా యంత్రాంగం ఇటీవల నదిలో లైసెన్స్ లేకుండా పడవలు నడపకూడదని ఆదేశాలు జారీ చేసింది. అయినా ఆదేశాలకు పట్టించుకోకుండా పడవలను నడుపుతున్నారు.

నీట మునిగి ఒకే కుటుంబంలో ఐదుగురు మృతి
ఇటీవల కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లాలో ఈ తరహా ఘటనే జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు నీట మునిగి దుర్మరణం పాలయ్యారు. శాల్మలా నదికి విహారయాత్రకు వెళ్లగా ఈ ప్రమాదం జరిగింది.

శాల్మలా నది ఓ టూరిస్ట్​ స్పాట్​గా తీర్చిదిద్దారు. సెలవు దినాల్లో విహారయాత్రలకు పెద్ద ఎత్తున జనం వస్తుంటారు. సిరసికి చెందిన కుటుంబసభ్యులు విహార యాత్రకు వెళ్లారు. కుటుంబమంతా సరదాగా ఆడుకుంటున్న క్రమంలో ఓ బాలుడు నీటిలో మునిగిపోయాడు. దీనిని గమనించిన మౌలానా అహ్మద్​ అనే వ్యక్తి వెంటనే నీటిలోకి దూకి అతడిని కాపాడి బాలుడి తల్లి నదియాకు ఇచ్చాడు. ఆ బాలుడిని ఒడ్డుకు చేర్చగానే కాలుజారడం వల్ల నదియా సైతం నీట మునిగింది. వీరిని గమనించిన మరో ముగ్గురు కుటుంబసభ్యులు తల్లికొడుకులను కాపాడేందుకు నీటిలోకి దిగగా వారు మునిగిపోయారు. ఫలితంగా మొత్తం ఐదుగురు నీట మునిగి మరణించారు.

కాపర్​ మైన్​లో చిక్కుకున్న కార్మికులు- 14 మంది సేఫ్, ఒకరు మృతి - Rajasthan Lift Collapse News

'బీజేపీకి 400సీట్లు వస్తే మధుర, కాశీలోనూ దేవాలయాలు నిర్మిస్తాం'- హిమంత బిశ్వశర్మ - Lok Sabha Elections 2024

Last Updated : May 15, 2024, 1:40 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.